Nara Rohith | నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ – హీరోగా… విలన్‌గా… సర్‌ప్రైజ్
బర్త్‌డే సందర్భంగా అభిమానులకు నారా రోహిత్ ట్రిపుల్ ట్రీట్ ఇచ్చాడు. హీరోగా రెండు సినిమాలతో పాటు విలన్‌గా ఓ సినిమా చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఈ సినిమాలకు సంబంధించిన ఫస్ట్ లుక్‌లు శనివారం రిలీజయ్యాయి.
Entertainment | Published On Jul 25, 2026, 2.36 pm IST
Nara Rohith | బర్త్‌డే సందర్భంగా నారా రోహిత్ అభిమానులకు ట్రిపుల్ ట్రీట్ ఇచ్చాడు. హీరోగా నటిస్తున్న సినిమాలతో పాటు విలన్‌గా చేస్తోన్న సినిమాకు సంబంధించిన లుక్‌ను రిలీజ్ చేశాడు. 2018లో వచ్చిన వీరభోగవసంతరాయలు తర్వాత సినిమాలకు ఆరేళ్లు గ్యాప్ తీసుకున్న నారా రోహిత్ ప్రతినిధి 2తో రీఎంట్రీ ఇచ్చాడు. ఆ తర్వాత భైరవం, సుందరకాండ సినిమాలు చేశాడు. హీరోగా సినిమాలు చేస్తూనే మరోవైపు విలన్ పాత్రకు కూడా ఓకే చెప్పాడు.
హారర్ మూవీ...
బర్త్‌డే సందర్భంగా తన కొత్త సినిమాల తాలూకు అప్‌డేట్స్‌ను శనివారం సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకున్నాడు నారా రోహిత్ . ప్రస్తుతం హీరోగా కపాలితో పాటు సౌండ్ ఇంజినీర్ అనే సినిమాలు చేస్తున్నాడు. ఈ రెండు సినిమాల ఫస్ట్ లుక్‌లను మేకర్స్ రిలీజ్ చేశారు. కాపాలి మూవీ హారర్ కథాంశంతో రూపొందుతోంది. రామ్ గన్నీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. హారర్ కథతో నారా రోహిత్ చేస్తోన్న ఫస్ట్ మూవీ ఇది.
సౌండ్ ఇంజినీర్...
నారా రోహిత్, నయన్ సారిక జంటగా నటిస్తున్న ఓ రొమాంటిక్ ఎంటర్‌టైనర్ మూవీ ఇటీవల లాంఛ్ అయ్యింది. ఈ సినిమాకు సౌండ్ ఇంజినీర్ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మణికుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నరేష్, రోహిణి కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాలో నారా రోహిత్ చెవిటితనంతో బాధపడే యువకుడిగా కనిపించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వెంకటేష్ సినిమాలో విలన్‌గా...
వెంకటేష్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆదర్శకుటుంబం సినిమాలో నారా రోహిత్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. నారా రోహిత్ బర్త్‌డే సందర్భంగా అతడి ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో పోలీస్ ఆఫీసర్‌గా ఇంటెన్స్ లుక్‌లో నారా రోహిత్ కనిపిస్తోన్నాడు. ఆదర్శకుటుంబంలో నారా రోహిత్ పాత్ర నెగెటివ్ షేడ్స్‌లో సాగనున్నట్లు సమాచారం. శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో నివేదా పేతురాజ్ ఓ స్పెషల్ సాంగ్ చేస్తోంది. దసరాకు ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన
- ●Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!
- ●Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!
- ●BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!
- ●Sri Lanka Tour | బుమ్రా ఫిట్‌నెస్‌పై ఉత్కంఠ.. వచ్చే వారం శ్రీలంక టూర్‌కు జట్టు ఎంపిక..!
- ●Revanth Reddy Speech | 58 ఇంచుల ఛాతీని ఓడించిన 'జెన్-జీ' యువత

Healthcare in Germany | భర్తకు కంటి ఇన్ఫెక్షన్.. వారం తర్వాత అపాయింట్మెంట్: జర్మనీ హెల్త్‌కేర్‌పై భారతీయ మహిళ ఆవేదన

Vande Mataram 150 | 150 మంది దివ్యాంగులతో అక్షర అద్భుతం: రవీంద్రభారతిలో రోమాలు నిక్కబొడుచుకునే 'వందేమాతరం' ప్రదర్శన!

Liver Disease Awareness | మీ లివర్ సేఫేనా? కాలేయ వ్యాధులపై డాక్టర్ సోమశేఖర్ రావు 'ఆఖరి హెచ్చరిక' బుక్ లాంచ్!

BRS Party | కర్ణాటక అక్రమ చెక్‌డ్యాంల పరిశీలనకు బీఆర్ఎస్ బృందం..!






