త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

The Paradise | ది ప్యార‌డైజ్ విడుద‌ల మ‌ళ్లీ వాయిదా.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది డిసెంబ‌ర్‌లోనే?

The Paradise | నేచుర‌ల్ స్టార్ నాని (Nani) న‌టిస్తున్న యాక్ష‌న్ త్రిల్ల‌ర్ ది ప్యార‌డైజ్ (The Paradise) విడుద‌ల‌పై మ‌రోసారి సందిగ్ధ‌త నెల‌కొంది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్‌ 3 సినిమాలతో వరుస హిట్లు కొట్టిన నాని.. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న‌ది.

G

Movies | Published On Jun 11, 2026, 10.41 am IST

The Paradise | ది ప్యార‌డైజ్ విడుద‌ల మ‌ళ్లీ వాయిదా.. థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది డిసెంబ‌ర్‌లోనే?
Advertisement

The Paradise | త్రినేత్ర‌.న్యూస్‌: నేచుర‌ల్ స్టార్ నాని (Nani) న‌టిస్తున్న యాక్ష‌న్ త్రిల్ల‌ర్ ది ప్యార‌డైజ్ (The Paradise) విడుద‌ల‌పై మ‌రోసారి సందిగ్ధ‌త నెల‌కొంది. దసరా, హాయ్ నాన్న, సరిపోదా శనివారం, హిట్‌ 3 సినిమాలతో వరుస హిట్లు కొట్టిన నాని.. ‘దసరా’ ఫేమ్ శ్రీకాంత్ ఓదెల (Srikanth Odela) దర్శకత్వంలో అత్యంత భారీ బడ్జెట్‌తో ఈ సినిమా తెరకెక్కుతున్న‌ది. ఇప్పటికే రిలీజ్ అయిన ‘ఆయా షేర్’ పాట‌ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న‌ది. తొలుత ఈ చిత్రాన్ని స‌మ్మ‌ర్ సెల‌వుల సంద‌ర్భంగా మార్చి 26న ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేయాల‌నున్నారు. అయితే కొన్ని కారణాలతో ఆ తేది మారిపోయింది. తాను తొంద‌ర ప‌డాల‌నుకోవ‌డం లేదంటూ ప్ర‌క‌టించిన శ్రీకాంత్ ఓదెల‌.. ఆగస్టుకి వాయిదా పడింది.

2026, ఆగస్టు 21న ‘ది ప్యారడైజ్’ మూవీ థియేటర్లలోకి వస్తుందంటూ చిత్ర యూనిట్ ప్రకటించింది. అయితే తాజా సమాచారం ప్రకారం ‘ది ప్యారడైజ్’ మూవీ ఆగస్టు 21న విడుద‌ల చేస్తామంటూ వెల్ల‌డించారు. అయితే ఇప్పుడు ఆ తేదీ కూడా మ‌రిన‌ట్లు తెలుస్తున్న‌ది.

ఇంకా పూర్తికాని షూటింగ్‌..!

ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ షూటింగ్ ఇప్ప‌టివ‌ర‌కు 70 శాతం మాత్ర‌మే పూర్త‌య్యింద‌ట. మిగిలిన చిత్రీక‌ర‌ణ‌తోపాటు పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నుల‌ను పూర్తిచేయ‌డానికి మ‌రింత స‌మ‌యం ప‌ట్టేలా ఉంద‌ని తెలుస్తున్న‌ది. దీంతో తాజాగా ఈ మూవీ విడుద‌ల‌ను డిసెంబ‌ర్‌కు వాయిదా వేసిన‌ట్లు స‌మాచారం. దీంతో నాని సినిమాల్లో విడుదల తేదీలు వరుస‌గా మారుతున్న చిత్రంగా నిలిచింది. కాగా, ఈ సినిమా ఓటీటీ హక్కులను నెట్‌ఫ్లిక్స్ ఇప్ప‌టికే భారీ మొత్తానికి కొనుగోలు చేసింది. దీంతో సెప్టెంబ‌ర్‌లోనే మూవీని విడుదల చేయాలని ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

ర‌వితేజ‌కు రూట్ క్లియ‌ర్‌..

నాని సినిమా వాయిదాతో ర‌వితేజకు (Ravi Teja) మార్గం సుగ‌మం కానుంది. ఆగ‌స్టు 21న మాస్ మ‌హారాజ `ఇరుముడి` సినిమాను విడుద‌ల చేయ‌నున్న‌ట్లు మేక‌ర్స్ ఇప్ప‌టికే ప్ర‌క‌టించారు. అదే రోజు థియేట‌ర్ల‌లోకి రావాల్సిన నాని `ప్యార‌డైజ్` పోస్ట్‌పోన్ కానున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న‌ది. దీంతో ఆ డేట్‌కు ర‌వితేజ వ‌స్తోన్న‌ట్లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాలు వెల్ల‌డిస్తున్నాయి. కాగా, వ‌రుస ఫ్లాపుల‌తో ఉన్న ర‌వితేజకు ఇది ప్లెస్ కానుంది.

Advertisement
Advertisement