Meenakshi Natarajan | రాజ్యసభ నామినేషన్ తిరస్కరణ.. సుప్రీంకోర్టులో మీనాక్షి నటరాజ్ పిటిషన్
Meenakshi Natarajan | రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ తిరస్కరణ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. తన నామినేషన్‌ను (Rajya Sabha Nomination) తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీచేసిన ఉత్తర్వుపై మీనాక్షి సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు.
Meenakshi Natarajan | త్రినేత్ర.న్యూస్: రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) నామినేషన్ తిరస్కరణ వివాదం దేశ అత్యున్నత న్యాయస్థానానికి చేరింది. తన నామినేషన్‌ను (Rajya Sabha Nomination) తిరస్కరిస్తూ రిటర్నింగ్ అధికారి జారీచేసిన ఉత్తర్వుపై మీనాక్షి సుప్రీంకోర్టును (Supreme Court) ఆశ్రయించారు. రాజ్యాంగంలో ఆర్టికల్ 32 కింద పిటిషన్ దాఖలు చేశారు. ఇప్పటికే ఇదే విషయమై కాంగ్రెస్ పార్టీ కూడా సుప్రీంకోర్టులో (Congress) సవాల్ చేసింది. తెలంగాణకు సంబంధించిన ఓ చట్టపరమైన నోటీసు వివరాలను అఫిడవిట్‌లో దాచారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదుతో రిటర్నింగ్ అధికారి నామినేషన్‌ను తిరస్కరించిన విషయం తెలిసిందే. అది క్రిమినల్ కేసు కాదని, కేవలం నోటీసు మాత్రమేనని కాంగ్రెస్ వాదిస్తున్నది. జూన్ 18న మూడు స్థానాలకు పోలింగ్ జరగనుండగా, ఈ వివాదంపై సుప్రీంకోర్టు వెకేషన్ బెంచ్‌లో గురువారం అత్యవసర విచారణ కోరనుంది.
అసలేం జరిగిందంటే..?
మధ్యప్రదేశ్‌లోని మూడు రాజ్య సభ స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు జరగనున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్ర అసెంబ్లీలోని బలాబలాల ప్రకారం రెండు స్థానాలను అధికార బీజేపీ సునాయాసంగా కైవసం చేసుకోనుండగా.. ఒక స్థానం కాంగ్రెస్‌కు దక్కే అవకాశం ఉంది. ఈ మూడో సీటు కోసం తెలంగాణ పీసీసీ ఇన్‌చార్జి మీనాక్షి నటరాజ్ కాంగ్రెస్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు.
అయితే, హైదరాబాద్‌లో నమోదైన క్రిమినల్ కేసు వివరాలు, ఆస్తులు, బ్యాంక్ లావాదేవీల వివరాలను ఆమె తన నామినేషన్ పత్రాల్లో దాచిపెట్టారని బీజేపీ అభ్యర్థి మహేశ్ కేవత్ రిటర్నింగ్ అధికారికి ఫిర్యాదు చేశారు. దానిని పరిశీలించిన రిటర్నింగ్ ఆఫీసర్ మీనాక్షి నటరాజన్ నామినేషన్‌ను తిరస్కరించారు. దీంతో దేశ వ్యాప్తంగా వివాదం చెలరేగింది. బీజేపీ ఇప్పటి వరకు ఓట్ చోరీకే పాల్పడింది.. ఇప్పుడు సీట్ చోరీకి కూడా పాల్పడుతున్నదని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు. ఇదే విషయమై కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలిసి నామినేషన్ తిరస్కరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసింది.
తాజావార్తలు
- ●IPO | రూ.36 కోట్ల ఎస్ఎంఈ ఐపీవో.. జూన్ 17న ఓపెన్.. పెట్టుబడి ఎంతంటే..
- ●Obsession Review | అబ్సెషన్ రివ్యూ - ఏడు కోట్ల బడ్జెట్ - 1900 కోట్ల కలెక్షన్స్ - హాలీవుడ్ హారర్ మూవీ ఎలా ఉందంటే?
- ●PM Modi | భారతీరాజా మృతి సినీ రంగానికి తీరని లోటు : ప్రధాని మోదీ
- ●El Nino | ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం
- ●NITI Aayog | ప్రధాని మోదీ అధ్యక్షతన ప్రారంభమైన నీతి ఆయోగ్ భేటీ
- ●Chrome | క్రోమ్‌లో జెమినీకి భారీ అప్డేట్.. ఫోటోలను ఎడిట్ చేయడం ఇక సులభం..

IPO | రూ.36 కోట్ల ఎస్ఎంఈ ఐపీవో.. జూన్ 17న ఓపెన్.. పెట్టుబడి ఎంతంటే..

Obsession Review | అబ్సెషన్ రివ్యూ - ఏడు కోట్ల బడ్జెట్ - 1900 కోట్ల కలెక్షన్స్ - హాలీవుడ్ హారర్ మూవీ ఎలా ఉందంటే?

PM Modi | భారతీరాజా మృతి సినీ రంగానికి తీరని లోటు : ప్రధాని మోదీ

El Nino | ఎల్ నినో ప్రభావం.. రుతుపవనాలకు అంతరాయం





