త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Donald Trump | ప్ర‌ధానిగా మోదీ.. భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన ఘ‌ట్టం: డొనాల్డ్ ట్రంప్‌

Donald Trump | భారత ప్రధానిగా అత్యధిక కాలం (నిరంతరాయంగా 4,399 రోజులు) ప‌నిచేసిన‌ మోదీకి (PM Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అభినందనలు తెలిపారు. చారిత్ర‌క మైలురాయిని అధిగ‌మించినందుకు హృద‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు.

G

National | Published On Jun 11, 2026, 8.17 am IST

Donald Trump | ప్ర‌ధానిగా మోదీ.. భార‌త‌దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లో ముఖ్య‌మైన ఘ‌ట్టం: డొనాల్డ్ ట్రంప్‌
Advertisement

Donald Trump | త్రినేత్ర‌.న్యూస్‌: భారత ప్రధానిగా అత్యధిక కాలం (నిరంతరాయంగా 4,399 రోజులు) ప‌నిచేసిన‌ మోదీకి (PM Modi) అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్ (Donald Trump) అభినందనలు తెలిపారు. చారిత్ర‌క మైలురాయిని అధిగ‌మించినందుకు హృద‌పూర్వ‌క శుభాకాంక్ష‌లు తెలియ‌జేశారు. అధికారికంగా భార‌త‌దేశంలో అత్య‌ధికాలం ప‌నిచేసిన ప్రజాస్వామ్య‌యుతంగా ఎన్నికైన ప్ర‌ధానిగా అవ‌త‌రించార‌ని చెప్పారు. ఇది దేశ రాజ‌కీయ చ‌రిత్ర‌లోనే ఒక ముఖ్య‌మైన ఘ‌ట్ట‌మ‌ని తెలిపారు.

మోదీ తనకు మంచి మిత్రుడని, గొప్ప నాయకుడని, వివేకవంతమైన వ్యక్తి అని కొనియాడారు. భవిష్యత్తులో ఆయన మరిన్ని గొప్ప విజయాలు సాధించాలని ఆకాక్షించారు. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో (Truth Social) పోస్ట్ చేశారు.

మోదీ స్పంద‌న‌..

ఈ సంద‌ర్భంగా ప్ర‌ధాని మోదీ స్పందిస్తూ.. రాబోయే రోజుల్లో రెండు దేశాల ప్రయోజనాలు, ప్రపంచ శాంతి కోసం `ఇండియా-యూఎస్ సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని` మరింత ముందుకు తీసుకెళ్లేందుకు ట్రంప్‌తో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పారు.

కాగా, దేశ తొలి ప్రధానమంత్రి జవహర్‌లాల్‌ నెహ్రూను అధిగమించి మోదీ ఈ ఘనతను సొంతం చేసుకున్నారు. బీజేపీకి చెందిన మోదీ.. దేశ చరిత్రలోనే అత్యధిక కాలం పనిచేసిన మొదటి కాంగ్రెస్సేతర ప్రధానమంత్రిగా నిలిచారు. జూన్‌ 10తో ఆయన ప్రధానిగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. ఇక అత్యధిక రోజులు పాలించిన వారిలో ఇందిరాగాంధీ మూడో స్థానంలో ఉన్నారు. ఆమె 1966 జనవరి 24 నుంచి 1977 మార్చి 24 వరకు వరుసగా 4,077 రోజులు పదవిలో ఉన్నారు.

అత్య‌ధికాలం ప‌నిచేసిన ప్ర‌ధానులు..

జ‌వ‌హ‌ర్‌లాల్ నెహ్రూ- 16 సంవత్సరాల 286 రోజులు
నరేంద్ర మోదీ- 12 సంవత్సరాలు పైగా (2014 - ప్రస్తుతం)
ఇందిరా గాంధీ- 15 సంవత్సరాల 350 రోజులు (రెండు వేర్వేరు విడతలుగా)
మన్మోహన్ సింగ్‌- 10 సంవత్సరాల 4 రోజులు (2004–2014)
అటల్ బిహారీ వాజ్‌పేయి- 6 సంవత్సరాల 80 రోజులు (మూడు విడతలుగా పనిచేసి, పూర్తి ఐదేండ్ల‌ పదవీకాలాన్ని పూర్తిచేసిన‌ మొదటి కాంగ్రెసేతర ప్రధాని)

Advertisement
Advertisement