త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Jayam Ravi | జ‌యం ర‌వి తండ్రి తెలుగులో టాప్ ప్రొడ్యూస‌ర్ – చిరంజీవి, ర‌వితేజ‌ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌

కోలీవుడ్ హీరో జ‌యం ర‌వికి టాలీవుడ్‌లో అనుబంధం ఉంది. జ‌యం ర‌వి తండ్రి తెలుగులో చిరంజీవి, ర‌వితేజ‌, జ‌గ‌ప‌తిబాబుతో పాటు ప‌లువురు హీరోల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌ను నిర్మించాడు. జ‌యం ర‌వి కూడా తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాలు చేశాడు.

N

Entertainment | Published On May 16, 2026, 8.50 pm IST

Jayam Ravi | జ‌యం ర‌వి తండ్రి తెలుగులో టాప్ ప్రొడ్యూస‌ర్ – చిరంజీవి, ర‌వితేజ‌ల‌తో బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీస్‌
Advertisement

Jayam Ravi |  భార్య ఆర్తితో ఉన్న వివాదం కార‌ణంగా సినిమాల‌కు దూరం అవుతున్న‌ట్లు కోలీవుడ్ హీరో జ‌యం ర‌వి ప్ర‌క‌టించాడు. భార్య‌కు విడాకులు ఇచ్చిన త‌ర్వాతే తాను తిరిగి సినిమాలు చేస్తాన‌ని అన్నాడు. శ‌నివారం చెన్నైలో మీడియా స‌మావేశం ఏర్పాటుచేసిన జ‌యం ర‌వి భార్య ఆర్తిపై సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశాడు. ఆర్తి త‌న‌ను బ్లాక్‌మెయిల్ చేసి పెళ్లి చేసుకుంద‌ని, చేత‌బ‌డులు చేయించింద‌ని అన్నాడు. పెళ్లైన మొద‌టిరోజు నుంచే న‌ర‌కం చూపించింద‌ని కామెంట్లు చేశాడు. మీడియా స‌మావేశంలో ఎమోష‌న‌ల్ అయిన జ‌యం ర‌వి క‌న్నీళ్లు పెట్టుకున్నాడు. ఈ విడాకుల వ్య‌వ‌హారం కోలీవుడ్ నాట ఆస‌క్తి క‌రంగా మారింది.

డైరెక్ట‌ర్‌గా ఎంట్రీ...

ప్ర‌స్తుతం హీరోగా త‌మిళంలో మూడు సినిమాలు చేస్తోన్నాడు జ‌యం ర‌వి. యోగిబాబు హీరోగా న‌టిస్తోన్న ఎన్ అర్డిన‌రీ మ్యాన్ అనే మూవీతో ద‌ర్శ‌కుడిగా అరంగేట్రం చేయ‌బోతున్నాడు.ఈ సినిమాల‌న్నీ షూటింగ్ ద‌శ‌లో ఉన్నాయి.

స్ట్రెయిట్ సినిమాలు...

జ‌యం ర‌వికి టాలీవుడ్ ఇండ‌స్ట్రీతోనూ చ‌క్క‌టి అనుబంధం ఉంది. తెలుగులో రెండు స్ట్రెయిట్ సినిమాల్లో చైల్డ్ యాక్ట‌ర్‌గా క‌నిపించాడు. అంతే కాదు...జ‌యం ర‌వి తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్ తెలుగులోప‌లు సూప‌ర్ హిట్ సినిమాల‌కు నిర్మాత‌గా, ఎడిట‌ర్‌గా ప‌నిచేశాడు.

చైల్డ్ యాక్ట‌ర్‌...

తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్ నిర్మించిన తెలుగు సినిమాలు బావ బావ‌మ‌రిదితో పాటు ప‌ల్నాటి పౌరుషంలో జ‌యం ర‌వి చైల్డ్ యాక్ట‌ర్‌గా క‌నిపించాడు. హీరోగా జ‌యం మూవీతో అత‌డి కెరీర్ ప్రారంభ‌మైంది. ఈ సినిమా పేరునే త‌న ఇంటి పేరుగా మార్చుడుతున్నాడు. . తెలుగులో నితిన్ హీరోగా న‌టించిన జ‌యం మూవీకి రీమేక్‌గా అదే పేరుతో త‌మిళంలో ఈ మూవీ రిలీజైంది. అమ్మ నాన్న ఓ త‌మిళ అమ్మాయి, వ‌ర్షం, నువ్వోస్తానంటే నేనొద్దంటానాతో పాటు ప‌లు తెలుగు సూప‌ర్ హిట్ మూవీస్‌ను త‌మిళంలోకి రీమేక్ చేశాడు జ‌యం ర‌వి.

హిట్ల‌ర్‌...

జ‌యం ర‌వి తండ్రి ఎడిట‌ర్ మోహ‌న్‌ కూడా తెలుగులో చిరంజీవి, సుమ‌న్‌, ర‌వితేజ‌, జ‌గ‌ప‌తిబాబుతో పాటు ప‌లువురు హీరోల‌తో సినిమాలు నిర్మించాడు. బ్లాక్‌బ‌స్ట‌ర్ స‌క్సెస్‌ల‌ను అందుకున్నాడు. చిరంజీవి హిట్ల‌ర్‌, సుమ‌న్ బావ బావ‌మ‌రిదితో హ‌నుమాన్ జంక్ష‌న్‌, ర‌వితేజ, వ‌డ్డే న‌వీన్ మ‌న‌సిచ్చి చూడు, క్షేమంగా వెళ్లి లాభంగా రండి సినిమాల‌తో నిర్మాత‌గా విజ‌యాల‌ను అందుకున్నారు. జ‌యం ర‌వి సోద‌రుడు మోహ‌న్ రాజా కూడా ద‌ర్శ‌కుడిగా తెలుగులో హ‌నుమాన్ జంక్ష‌న్‌తో పాటు చిరంజీవి గాడ్‌ఫాద‌ర్ సినిమాలు చేశాడు.

 

Advertisement
Advertisement