త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nani Paradise | నాని ప్యార‌డైజ్ పోస్ట్‌పోన్ – కొత్త రిలీజ్ డేట్ ఇదే

నాని ప్యార‌డైజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. మార్చి 26న రిలీజ్ కావాల్సిన ఈ సినిమాను వాయిదావేస్తున్న‌ట్లు గురువారం మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు. ఆగస్ట్ 21న ఈ మూవీ థియేటర్లలోకి రానున్నట్లు పేర్కొన్నారు.

N

Entertainment | Published On Feb 12, 2026, 5.53 pm IST

Nani Paradise | నాని ప్యార‌డైజ్ పోస్ట్‌పోన్ – కొత్త రిలీజ్ డేట్ ఇదే
Advertisement

Nani Paradise | అనుకున్న‌దే జ‌రిగింది. నాని ప్యార‌డైజ్ పోస్ట్‌పోన్ అయ్యింది. మార్చిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఏకంగా ఆగ‌స్ట్ నెలకు వెళ్లిపోయింది. గురువారం ఈ సినిమాను పోస్ట్‌పోన్ చేసిన‌ట్లు ప్ర‌క‌టించిన మేక‌ర్స్ కొత్త విడుద‌ల తేదీని వెల్ల‌డించారు.

మార్చి 26న రిలీజ్...

పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కుతోన్న ప్యార‌డైజ్ సినిమాను మార్చి 26న రిలీజ్ చేయ‌బోతున్న‌ట్లుగా ఇన్నాళ్లుగా మేక‌ర్స్ ప్ర‌క‌టిస్తూ వ‌చ్చారు. మార్చిలో ర‌ణ‌వీర్‌సింగ్ ధురంధ‌ర్ 2, య‌శ్ టాక్సిక్‌తో పాటు రామ్ చ‌ర‌ణ్ పెద్ది బ‌రిలో ఉండ‌టంతో ప్యార‌డైజ్ రిలీజ్‌పై చాలా రోజులుగా సందేహాలు వ్య‌క్త‌మ‌వుతూ వ‌చ్చాయి. మ‌రోవైపు షూటింగ్ కూడా డిలే అవుతూ వ‌చ్చింది. ఇటీవ‌ల జ‌రిగిన ప‌రిణామాల కార‌ణంగా స‌డెన్‌గా మార్చి 26 బ‌రిలోకి ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ వ‌చ్చింది. అదే టైమ్‌లో రామ్‌చ‌ర‌ణ్ పెద్ది వాయిదాప‌డింది. దాంతో నాని సినిమా కూడా ప్రేక్ష‌కుల ముందుకు రావ‌డం అనుమాన‌మేన‌ని ఫ్యాన్స్ ఫిక్స‌య్యారు.

ఆగ‌స్ట్‌లో రిలీజ్‌...

తాజాగా ఈ రూమ‌ర్ల‌ను నిజం చేస్తూ గురువారం మేక‌ర్స్ ప్యార‌డైజ్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించారు. మార్చిలో కాకుండా మ‌రో ఐదు నెల‌లు ఆల‌స్యంగా ఆగ‌స్ట్ 21న వ‌ర‌ల్డ్ వైడ్‌గా థియేట‌ర్ల‌లో ప్యార‌డైజ్ రిలీజ్ కానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. రిలీజ్ డేట్ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. ప్యార‌డైజ్ వాయిదాతో మార్చి నెలాఖ‌రున ప‌వ‌న్ క‌ళ్యాణ్ ఉస్తాద్ భ‌గ‌త్‌సింగ్ సోలోగా థియేట‌ర్ల‌లోకి రాబోతుంది.

హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో...

ప్యార‌డైజ్ మూవీకి శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. ద‌స‌రా బ్లాక్‌బ‌స్ట‌ర్ త‌ర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ ఇది. హైద‌రాబాద్ బ్యాక్‌డ్రాప్‌లో తెర‌కెక్కుతోన్న ఈ సినిమాలో జ‌డ‌ల్ అనే క్యారెక్ట‌ర్‌లో నాని క‌నిపించ‌బోతున్నాడు. ఈ పాత్ర కోసం లుక్ ప‌రంగా చాలా మేకోవ‌ర్ అయ్యారు నాని. ప్యార‌డైజ్ మూవీలో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. సీనియ‌ర్ హీరో మోహ‌న్‌బాబు విల‌న్‌గా న‌టించ‌బోతున్నారు. సంపూర్ణేష్‌బాబు, రాఘ‌వ్ జుయ‌ల్‌తో పాటు ప‌లువురు టాలీవుడ్‌, బాలీవుడ్ యాక్ట‌ర్లు ఈ సినిమాలో కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌బోతున్నారు. ప్ర‌స్తుతం ప్యార‌డైజ్ షూటింగ్ హైద‌రాబాద్‌లో జ‌రుగుతోంది. శంషాబాద్‌లో వేసిన ఓ భారీ సెట్‌లో ఆరు వంద‌ల మంది డ్యాన్స‌ర్ల‌పై నాని ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్‌ను షూట్ చేస్తున్నారు. ఈ సినిమాకు అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. దాదాపు 200 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ సినిమా రూపొందుతోన్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్యార‌డైజ్ త‌ర్వాత సుజీత్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా క‌మిట‌య్యారు నాని.

Advertisement
Advertisement