త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Bloody Romeo | నాని బ‌ర్త్‌డే ట్రీట్ – లోకేష్ కనగరాజ్ ఫార్ములాతో బ్లడీ రోమియో

హీరో నాని, డైరెక్ట‌ర్ సుజీత్ కాంబినేష‌న్‌లో తెర‌కెక్కుతోన్న మూవీ నుంచి స‌ర్‌ప్రైజింగ్ అప్‌డేట్ వ‌చ్చేసింది. నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా మంగ‌ళ‌వారం ఈ మూవీ టైటిల్‌ను రివీల్ చేశారు. ఈ సినిమాకు బ్ల‌డీ రోమియో అనే పేరును క‌న్ఫామ్ చేశారు.

N

Entertainment | Published On Feb 24, 2026, 12.02 pm IST

Bloody Romeo |  నాని బ‌ర్త్‌డే ట్రీట్ – లోకేష్ కనగరాజ్ ఫార్ములాతో బ్లడీ రోమియో
Advertisement

Bloody Romeo |  త‌న బ‌ర్త్‌డే సంద‌ర్భంగా అభిమానుల‌కు అదిరిపోయే ట్రీట్ ఇచ్చాడు నాని. ప్ర‌స్తుతం ప్యార‌డైజ్ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు నాని. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీ త‌ర్వాత ఓజీ ఫేమ్ డైరెక్ట‌ర్ సుజీత్‌తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు. స్టైలిష్ యాక్ష‌న్ కామెడీగా రూపొందుతోన్న ఈ మూవీ ఇటీవ‌లే అఫీషియ‌ల్‌గా లాంఛ్ అయ్యింది.

బ్ల‌డీ రోమియో...

బ్ల‌డీ రోమియో టైటిల్ గ్లింప్స్‌ను నాని బ‌ర్త్‌డే సంద‌ర్భంగా రిలీజ్ చేశారు. యానిమేష‌న్ రూపంలో రిలీజ్ చేసిన ఈ గ్లింప్స్‌లో ఓ వ్య‌క్తి వంట చేస్తున్న‌ట్లుగా క‌నిపించాడు. చివ‌ర‌లో కుక్క‌ర్‌కు బాంబు ఫిక్స్ చేసి హోట‌ల్‌ను పేల్చేయ‌డం ఆస‌క్తిని పంచింది. ఎలా జ‌రిగింది షూటింగా? అని ఓ వ్య‌క్తి అడ‌గ్గా...కాదు కుకింగ్ అంటూ వెన్నెల‌కిషోర్ స‌మాధానం ఇవ్వ‌డం ఆక‌ట్టుకుంటుంది. పిడికెడు కోపం, బారెడు భీబ‌త్సం, స‌రిపోయేంతా...సారీ మతిపోయేంత ప్రేమ అంటూ వెన్నెల కిషోర్ చెప్పిన డైలాగ్ గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలిచింది. గ్లింప్స్ బీజీఎమ్ ఆక‌ట్టుకుంటుంది.గ్లింప్స్ చూస్తుంటే లోకేష్ కనగరాజ్ ఫార్ములాను సుజీత్ ఫాలో అవుతున్నట్లుగా తెలుస్తోంది.

చెఫ్ క‌మ్ గ్యాంగ్‌స్ట‌ర్‌...

ఈ గ్లింప్స్ చూస్తుంటే బ్లడీ రోమియోలో నాని  చెఫ్ క‌మ్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా నాని డిఫ‌రెంట్ షేడ్స్‌తో కూడిన క్యారెక్ట‌ర్‌లో క‌నిపించ‌బోతున్న‌ట్లు తెలుస్తోంది. ఈ సినిమా షూటింగ్ చాలా వ‌ర‌కు యూర‌ప్‌లోనే సాగ‌నున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ఈ సినిమాకు ధురంధర్ ఫేమ్ శ‌శ్వ‌త్ స‌చ్‌దేవ్ మ్యూజిక్ అందిస్తున్నాడు. గ్లిం

త్రిప్తి డిమ్రి....

బ్త‌డీ రోమియోలో నానికి జోడీగా యానిమ‌ల్ బ్యూటీ త్రిప్తి డిమ్రిని హీరోయిన్‌గా ఫైన‌ల్ చేసిన‌ట్లు స‌మాచారం. తొలుత క‌థానాయిక‌గా పూజా హెగ్డే పేరు బ‌లంగా వినిపించింది. ఫ్రెష్ పెయిర్ ఉండాల‌ని భావించిన మేక‌ర్స్ పూజా హెగ్డేను కాద‌ని త్రిప్తి డిమ్రిని ఎంపిక‌చేసిన‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి.

స‌మ్మ‌ర్‌లో...

బాలీవుడ్ సీనియ‌ర్ హీరోయిన్ మాధురీ దీక్షిత్ మ‌రో కీల‌క పాత్ర‌లో క‌నిపించ‌నున్న‌ట్లు చెబుతోన్నారు.
నిహారిక ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ ప‌తాకంపై వెంక‌ట్ బోయిన‌ప‌ల్లి బ్ల‌డీ రోమియో సినిమాను నిర్మిస్తున్నారు. ఏప్రిల్ లేదా మే నుంచి బ్ల‌డీ రోమియో షూటింగ్ మొద‌లుకాబోతున్న‌ట్లు తెలుస్తోంది.

ప్యార‌డైజ్ పోస్ట్‌పోన్‌...

నాని ప్యార‌డైజ్ షూటింగ్ మార్చి నెలాఖ‌రులోగా కంప్లీట్ కానున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ద‌స‌రా త‌ర్వాత నాని, శ్రీకాంత్ ఓదెల కాంబినేష‌న్‌లో ఈ మూవీ తెర‌కెక్కుతోంది. ఈ పీరియాడిక‌ల్ యాక్ష‌న్ మూవీని తొలుత మార్చిలో రిలీజ్ చేయాల‌ని భావించారు. కానీ షూటింగ్ డిలే వ‌ల్ల ఆగ‌స్ట్ 21కి వాయిదాప‌డింది. ప్యార‌డైజ్‌లో క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. మోహ‌న్‌బాబు విల‌న్‌గా క‌నిపించ‌బోతున్నారు.

Advertisement
Advertisement