త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Paradise | నాని ప్యార‌డైజ్ సినిమాపై నెగెటివ్ పోస్ట్‌లు – క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వన్న కోర్టు

ప్యార‌డైజ్ రిలీజ్ ముంగిట సినిమాపై వ‌స్తోన్న నెగెటివ్ ప్ర‌చారంపై బెంగ‌ళూరు కోర్టు మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఈ సినిమాలోని కంటెంట్‌, న‌టీన‌టుల‌ను ఉద్దేశించి అభ్యంత‌ర‌క‌ర, అస‌త్య‌పు క‌థ‌నాలు, పోస్టులు పెట్టినా, షేర్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆదేశించింది.

N

Entertainment | Published On Sep 22, 2026, 2.40 pm IST

Paradise | నాని ప్యార‌డైజ్ సినిమాపై నెగెటివ్ పోస్ట్‌లు – క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వన్న కోర్టు
Advertisement

Paradise |  నాని ప్యార‌డైజ్ సినిమాపై సోష‌ల్ మీడియాలో వ‌స్తోన్న నెగెటివ్ ప్ర‌చారంపై బెంగ‌ళూరు కోర్టు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. సినిమాపై ఉద్దేశ‌పూర్వ‌కంగా అభ్యంత‌రక‌ర‌పోస్టులు, కించ‌ప‌రిచేలా కామెంట్లు పెడితే క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వంటూ పేర్కొన్న‌ది. నెగెటివ్ పోస్ట్‌లు, రివ్యూలు పెట్ట‌కుండా మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది.

మూడేళ్ల క‌ష్టం...

ఇటీవ‌ల టీజ‌ర్ రిలీజ్ త‌ర్వాత సినిమా క‌థ‌, హీరోహీరోయిన్ల పాత్ర‌లు, విజువ‌ల్స్‌, మ్యూజిక్‌తో పాటు ఇత‌ర సాంకేతిక అంశాల‌ను విమ‌ర్శిస్తూ కొంద‌రు పోస్ట్‌లు పెట్టారు. వీటిపై మేక‌ర్స్ బెంగ‌ళూరు కోర్టును ఆశ్ర‌యించారు.ప్యార‌డైజ్ భారీ బ‌డ్జెట్‌తో రూపొందింద‌ని, ఈ సినిమా వెనుక త‌మ‌ రెండు, మూడేళ్ల‌ క‌ష్టం ఉంద‌ని...రిలీజ్ ముంగిట కొంద‌రు త‌ప్పుడు క‌థ‌నాలు, నెగెటివ్ పోస్ట్‌లు పెడుతూ బిజినెస్‌ను దెబ్బ‌తీసే ప్ర‌య‌త్నం చేస్తున్నార‌ని మేక‌ర్స్ బెంగ‌ళూరు కోర్టులో పిటీష‌న్ వేశారు. సినిమా రిలీజ్ ముగింట ఉద్దేశ‌పూర్వ‌కంగా చేసే ఈ అస‌త్య‌పు ప్ర‌చాచాల‌ వ‌ల్ల సినిమాక‌లెక్ష‌న్స్‌పై ప్ర‌భావం ప‌డే అవ‌కాశం ఉంద‌ని, త‌మ‌కు తీవ్ర న‌ష్టం వాటిల్లుతుంద‌ని కోర్టుకు విన్న‌వించారు.

నెగెటివ్ పోస్ట్‌లు పెడితే..

నిర్మాత వాద‌న‌ల‌తో కోర్టు ఏకీభ‌వించింది. ప్యార‌డైజ్ సినిమాపై నెగెటివ్‌గా పెట్టిన పోస్ట్‌లు, క‌థ‌నాల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని ఆదేశించింది. త‌ప్పుడు కంటెంట్‌ను పోస్ట్ చేసినా, షేర్ చేసినా క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌ని ఆదేశిస్తూ మ‌ధ్యంత‌ర ఉత్త‌ర్వులు జారీ చేసింది. సినిమా కంటెంట్‌తో పాటు న‌టీన‌టుల‌ను కంచ‌ప‌రిచేలా, వారి ప‌రువుకు భంగం క‌లిగేలా ఎలాంటి అబ‌ద్ధ‌పు కంటెంట్‌ను ప్ర‌చారం చేయ‌ద్ద‌ని ఆదేశించింది.

టికెట్ ధ‌ర‌ల పెంపు...

ప్యార‌డైజ్ సినిమాకు శ్రీకాంత్ ఓదెల ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. క‌య‌దు లోహ‌ర్ హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీలో కీర్తి సురేష్ స్పెష‌ల్ సాంగ్‌లో క‌నిపించింది. త‌ల్లీకొడుకుల ఎమోష‌న్‌కు యాక్ష‌న్ అంశాలు జోడించి రూపొందిన ఈ మూవీ సెప్టెంబ‌ర్ 24న రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాకు తెలంగాణ‌తో పాటు ఏపీలో టికెట్ ధ‌ర‌ల‌ను పెంపుకు అనుమ‌తులు వ‌చ్చాయి. బెనిఫిట్ షోల‌కు ప‌ర్మిష‌న్ ఇచ్చారు.

 

Advertisement
Advertisement