Nani | గ్యాంగ్‌స్టర్‌గా నాని – మలయాళ బ్యూటీతో రొమాన్స్ – బ్రేక్ లేకుండా షూటింగ్
ది ప్యారడైజ్ తర్వాత ఎక్కువ గ్యాప్ లేకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నారు నాని. సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో పేరుతో ఓ స్టైలిష్ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ మూవీ చేస్తోన్నాడు. అక్టోబర్ 17 నుంచి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలుకాబోతున్నట్లు సమాచారం. ఈ సినిమాలో మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
Entertainment | Published On Oct 10, 2026, 3.00 pm IST
Nani | నాని (Nani) హీరోగా నటించిన ది ప్యారడైజ్ (The Paradise Movie)మూవీ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చింది. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో పీరియాడికల్ యాక్షన్‌గా తెరకెక్కిన ఈ సినిమాకు మిక్స్‌డ్ టాక్ వచ్చింది. రొటీన్ కథ కావడం, యాక్షన్ ఎపిసోడ్స్‌లో వయలెన్స్ ఎక్కువగా ఉండటం, హీరోయిన్ రోల్‌ను చూపించిన తీరుపై విమర్శలు వచ్చాయి. ఈ నెగెటివ్ టాక్‌తో సంబంధం లేకుండా బాక్సాఫీస్ వద్ద ది ప్యారడైజ్ మూవీ భారీగా వసూళ్లను రాబడుతోంది. 200 కోట్లకుపైగా కలెక్షన్స్ దక్కించుకున్న ఈ సినిమా నైజాంలో లాభాల్లోకి అడుగుపెట్టింది.
గ్యాప్ లేకుండా...
ప్యారడైజ్ షూటింగ్ కోసం రెండేళ్లు కేటాయించారు నాని. పాన్ ఇండియన్ లెవెల్‌లో ఈ సినిమాను ప్రమోట్ చేసేందుకు చాలా కష్టపడ్డారు. మొన్నటివరకు ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా ఉన్న నాని గ్యాప్ లేకుండా వెంటనే తన నెక్స్ట్ సినిమాను మొదలుపెట్టబోతున్నారు.
ఓజీ ఫేమ్...
ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో బ్లడీ రోమియో పేరుతో ఓ సినిమా చేయబోతున్నారు నాని. ఇందులో చెఫ్ కమ్ గ్యాంగ్‌స్టర్‌గా నాని కనిపించబోతున్నారు. యూరప్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా సాగబోతున్నట్లు సమాచారం. గ్యాంగ్‌స్టర్ మోడ్ యాక్టివేటెడ్ బ్లడీ రోమియోను ఉద్దేశించి మేకర్స్ శనివారం ఓ ట్వీట్ పెట్టారు. ఈ సినిమా సెట్స్‌పైకి రాబోతున్నట్లు హింట్ ఇచ్చారు. బ్లడీ రోమియో రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ 17 నుంచి మొదలుకాబోతున్నట్లు తెలిసింది.
బ్లడీ రోమియో...
బ్లడీ రోమియోలో నానికి జోడీగా ఇద్దరూ హీరోయిన్లు నటించనున్నట్లు సమాచారం. ఓ హీరోయిన్‌గా మలయాళ బ్యూటీ ప్రీతి ముకుందన్(Preethi Mukundan) ఫైనల్ అయ్యింది. మరో నాయికగా మృణాల్ ఠాకూర్ పేరు ప్రచారం జరుగుతోంది. బ్లడీ రోమియో సినిమాకు ప్రవీణ్ లక్కరాజు మ్యూజిక్ అందించబోతున్నారు. వచ్చే ఏడాది వేసవిలోగా షూటింగ్ కంప్లీట్ చేయాలనే ఆలోచనలో నాని, సుజీత్ ఉన్నట్లు సమాచారం.
బ్లడీ రోమియోతో పాటు 96, సత్యం సుందరం సినిమాల ఫేమ్ ప్రేమ్ కుమార్ డైరెక్షన్‌లో నాని ఓ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Janhvi Kapoor | టాలీవుడ్‌కు జాన్వీకపూర్ గుడ్‌బై? – స్టార్ హీరో సినిమాను రిజెక్ట్ చేసిన శ్రీదేవి తనయ
అక్టోబర్ 9, 2026

Nithiin | అనౌన్స్ చేసిన మూడు నెలల్లోనే థియేటర్లలోకి అలియాస్ రుక్మిణి – నాని … నితిన్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్
అక్టోబర్ 9, 2026

Priyadarshi | కేసీఆర్ పాత్ర కోసం ప్రియదర్శి మేకోవర్ – ప్యారడైజ్ వర్కింగ్ స్టిల్స్
సెప్టెంబర్ 27, 2026
తాజావార్తలు
- ●Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం
- ●ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్
- ●PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి
- ●Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం
- ●Gajwel MRO | నువ్వు ఇంకా బతికే ఉన్నావా.. పురుగుల మందు తాగలేదా..!
- ●RBI | ఆర్బీఐ కీలక నిర్ణయం.. బ్యాంకులకు కొత్త సీఆర్ఆర్ నిబంధన..

Abhijeet Dipke | నిరసనల వేళ.. అభిజీత్ దిప్కే ఇంట తీవ్ర విషాదం

ED Petition in HC | జగన్ అక్రమాస్తుల కేసును తేల్చండి.. హైకోర్టులో ఈడీ పిటిషన్

PV Kiran | కర్నూల్ మాజీ ఎమ్మెల్యే కుమారుడు మృతి

Bhatti Vikramarka | గట్టిగ పని చేద్దాం.. సర్వోత్తమ్‌రెడ్డిని ఎమ్మెల్సీ చేద్దాం



