Priyanka Chopra | ‘వారణాసి’పై ప్రియాంక చోప్రా ఆసక్తికర వ్యాఖ్యలు.. 14 నెలలుగా అదే పనిలో ఉన్నానంటూ..!
Priyanka Chopra | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది.
Entertainment | Published On Jul 15, 2026, 7.15 pm IST
Priyanka Chopra | సూపర్‌స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘వారణాసి’పై అంచనాలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. రాజమౌళి నుంచి వస్తున్న సినిమా కావడంతో దేశవ్యాప్తంగా మాత్రమే కాకుండా అంతర్జాతీయ స్థాయిలోనూ ఈ ప్రాజెక్ట్‌పై ఆసక్తి నెలకొంది. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ నటి ప్రియాంక చోప్రా కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో ప్రియాంక ‘మందాకిని’ పాత్రలో కనిపించనుంది. తాజాగా ఓ పాడ్‌కాస్ట్ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆమె ‘వారణాసి’ చిత్రానికి సంబంధించిన కొన్ని ఆసక్తికర విషయాలను వెల్లడించింది. ఈ ప్రాజెక్ట్ కోసం గత 14 నెలలుగా ప్రత్యేకంగా పనిచేస్తున్నానని తెలిపింది.
రాజమౌళి సినిమా అంటే కేవలం షూటింగ్ మాత్రమే కాదని, ప్రతి సన్నివేశాన్ని ఎంతో శ్రద్ధతో, పూర్తి స్థాయిలో తీర్చిదిద్దుతారని ప్రియాంక పేర్కొంది. ఈ చిత్రంలో తాను ఇప్పటివరకు చేయని విధమైన పాత్రను పోషిస్తున్నానని, తన కెరీర్‌లోని ఇతర సినిమాలతో పోలిస్తే ‘వారణాసి’ పూర్తిగా భిన్నమైన అనుభూతిని ఇస్తోందని చెప్పింది. సినిమాలో కొన్ని అద్భుతమైన యాక్షన్ సన్నివేశాల్లో భాగమైనట్లు తెలిపిన ప్రియాంక.. ముఖ్యంగా ఓ స్లో మోషన్ జంప్ సీన్ గురించి ప్రస్తావించింది. అయితే సినిమా కథ, తన పాత్రకు సంబంధించిన మరిన్ని వివరాలను ఇప్పుడే వెల్లడించలేనని చెప్పింది.
ఇక సినిమా చిత్రీకరణ విషయానికి వస్తే.. ఇప్పటికే పలు కీలక సన్నివేశాలను రాజమౌళి పూర్తి చేసినట్లు సమాచారం. ఈ ఏడాది అక్టోబర్ నాటికి షూటింగ్ మొత్తం పూర్తి చేయాలని చిత్రబృందం ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. అనంతరం పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేసి, వచ్చే ఏడాది ప్రారంభం నుంచి ప్రమోషన్ కార్యక్రమాలు మొదలుపెట్టే అవకాశం ఉంది. భారీ బడ్జెట్‌తో, అంతర్జాతీయ ప్రమాణాలతో రూపొందుతున్న ఈ చిత్రం 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. మహేశ్ బాబు-రాజమౌళి కాంబినేషన్‌లో తొలిసారి వస్తున్న సినిమా కావడంతో అభిమానుల్లో ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి.
తాజావార్తలు
- ●Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్
- ●CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి
- ●Madhapur Youth Murder | కత్తులతో పొడిచి.. మాదాపూర్‌లో వరంగల్ యువకుడి దారుణ హత్య.. 'పరువు' కోసమే బలితీసుకున్నారా?
- ●CM Revanth Reddy | సిరాజుద్దీన్‌కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా డీఎస్పీ జాబ్ ఇచ్చాం : సీఎం రేవంత్
- ●Rukmini Vasanth | రజినీకాంత్ భారీ ప్రాజెక్ట్‌లో ‘కాంతార’ బ్యూటీకి ఛాన్స్..!
- ●Fake Number Plates Hyderabad | ట్రాఫిక్ చలాన్ల నుంచి తప్పించుకోవడానికి నకిలీ నంబర్ ప్లేట్లు వాడుతున్నారా?

Telangana Education Kit | విద్యార్థులకు శుభవార్త.. పంద్రాగస్టు లోపు తెలంగాణ ఎడ్యుకేషన్ కిట్

CM Revanth Reddy | టీచర్ల బదిలీలు అత్యంత కఠినం.. వారికి ఆ తెలివితేటలు ఎక్కువ : సీఎం రేవంత్ రెడ్డి

Madhapur Youth Murder | కత్తులతో పొడిచి.. మాదాపూర్‌లో వరంగల్ యువకుడి దారుణ హత్య.. 'పరువు' కోసమే బలితీసుకున్నారా?

CM Revanth Reddy | సిరాజుద్దీన్‌కు కానిస్టేబుల్ ఉద్యోగానికి అర్హత లేదు.. అయినా డీఎస్పీ జాబ్ ఇచ్చాం : సీఎం రేవంత్





