Pooja Hegde | ఆయన మనసులో ఏదీ దాచుకోడు.. సల్మాన్ ఖాన్‌పై పూజా హెగ్డే ప్రశంసలు
Pooja Hegde | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై పూజా హెగ్డే ప్రశంసల వర్షం కురిపించింది. సల్మాన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనకు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు తెలియవని పేర్కొంది. కొందరు సినీ ప్రముఖులు తమ ప్రయోజనాల కోసం వ్యూహాలు రచిస్తుంటారని, సల్మాన్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని చెప్పింది.
Entertainment | Published On Jul 15, 2026, 5.30 pm IST
Pooja Hegde | బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌పై పూజా హెగ్డే ప్రశంసల వర్షం కురిపించింది. సల్మాన్ చాలా మంచి మనసున్న వ్యక్తి అని, ఆయనకు ఎలాంటి కుట్రలు, కుతంత్రాలు తెలియవని పేర్కొంది. కొందరు సినీ ప్రముఖులు తమ ప్రయోజనాల కోసం వ్యూహాలు రచిస్తుంటారని, సల్మాన్ మాత్రం అలాంటి వ్యక్తి కాదని చెప్పింది. సల్మాన్ మనసులో ఏది ఉంటే అదే బయటకు చెబుతారని తెలిపింది. నిజాయితీగా తన అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం అందరికీ సాధ్యం కాదని, ఆ విషయంలో సల్మాన్ ప్రత్యేకమని కొనియాడింది. ఆయనతో కలిసి పనిచేసిన అనుభవం ఎంతో మంచి అనుభూతిని ఇచ్చిందని పేర్కొంది. సినిమా రంగంలో వ్యక్తిత్వం కూడా ముఖ్యమేనని చెప్పిన పూజా.. సల్మాన్‌లాంటి స్వచ్ఛమైన మనసున్న వ్యక్తులు అరుదుగా ఉంటారని వ్యాఖ్యానించింది. నటుడిగా మాత్రమే కాకుండా వ్యక్తిగతంగా కూడా ఆయనపై తనకు ఎంతో గౌరవం ఉందని వెల్లడించింది.
ఇక తనకు ఇష్టమైన పాటల గురించి మాట్లాడుతూ.. ‘అరబిక్ కుతు’, ‘మోనికా’ పాటలు తన ఫేవరెట్ అని చెప్పింది. డాన్స్ చేసే సమయంలో సంగీతాన్ని ఆస్వాదిస్తూ పెర్ఫార్మ్ చేయడం హృతిక్ రోషన్ నుంచి నేర్చుకున్నానని పేర్కొంది. ఇక ప్రభాస్ పేరు వినగానే తనకు ముందుగా ఫుడ్ గుర్తుకు వస్తుందని సరదాగా వ్యాఖ్యానించింది. ప్రస్తుతం పూజా సినిమాల విషయానికి వస్తే.. గతంలో టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డేకు ప్రస్తుతం అవకాశాలు తగ్గాయి. దీంతో బాలీవుడ్, కోలీవుడ్ చిత్రాలపై ఆమె ఎక్కువగా దృష్టి పెడుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’లో పూజా హెగ్డే నటించింది. ఈ మూవీ ఈ నెల 23న విడుదల కానుంది. ప్రస్తుతం మంచి కథలు, విభిన్నమైన పాత్రల కోసం ఎదురుచూస్తున్న పూజా.. తన కెరీర్‌లో మరోసారి బలమైన స్థానాన్ని సంపాదించుకునేందుకు ప్రయత్నిస్తోంది. ప్రస్తుతం తమిళంలో కాంచన-4 మూవీతో పాటు తెలుగులో శ్రీశ్రీ మూవీలో నటించనుంది.
తాజావార్తలు
- ●Amara Raja Giga Corridor | దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా
- ●realme NARZO 100x 5G | రియల్మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..
- ●SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు
- ●Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్
- ●Supriya Sule | ఆ బిల్లుపై ఇంకా నిర్ణయం తీసుకోలేదు : సుప్రియా సూలే
- ●India - UK CETA | అమల్లోకి భారత్-యూకే వాణిజ్య ఒప్పందం.. హైదరాబాద్ నుంచి కంటైనర్లు ప్రారంభం

Amara Raja Giga Corridor | దివిటిపల్లి ప్లాంట్‌లో 400 మంది మహిళలే : గల్లా అరుణ కుమారి వల్లనే నేను గెలిచా

realme NARZO 100x 5G | రియల్మీ నార్జో 100ఎక్స్ 5జి లాంచ్.. 8,000ఎంఏహెచ్ భారీ బ్యాటరీతో గేమర్లకు కొత్త ఆప్షన్..

SIR | తెలంగాణలో సర్ గడువు పొడిగింపు.. ఆగస్టు 3 వరకు బీఎల్వో ఇంటికొస్తారు

Telangana | తెలంగాణ వ్యాప్తంగా నిలిచిన వాహనాల రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్ కార్డుల డిస్పాచ్






