త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్‌ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు

Deepika Chikhli | బాలీవుడ్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘రామాయణం’పై చర్చ కొనసాగుతోంది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రామాయణం సీరియల్‌లో సీత పాత్రతో గుర్తింపు పొందిన నటి దీపికా చిఖ్లియా కూడా స్పందించారు.

P

Entertainment | Published On Nov 8, 2026, 4.50 pm IST

Deepika Chikhli | సాయిపల్లవి యాక్షన్‌ సీన్లపై దీపికా చిఖ్లియా ఆసక్తికర వ్యాఖ్యలు
Advertisement

Deepika Chikhli | బాలీవుడ్‌లో తెరకెక్కిన భారీ బడ్జెట్‌ చిత్రం ‘రామాయణం’పై చర్చ కొనసాగుతోంది. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాలోని యాక్షన్‌ సన్నివేశాలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రామాయణం సీరియల్‌లో సీత పాత్రతో గుర్తింపు పొందిన నటి దీపికా చిఖ్లియా కూడా స్పందించారు. సాయిపల్లవి యాక్షన్‌ సన్నివేశాలు తాను ఇన్‌స్టాగ్రామ్‌లో చూశానని, వాల్మీకి, తులసీదాస్‌ రామాయణాల్లో అలాంటి సన్నివేశాలు తనకు గుర్తులేవని వ్యాఖ్యానించారు.

300పైగా రామాయణాలు ఉన్నాయి

ఫ్రీ ప్రెస్‌ జర్నల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో దీపికా మాట్లాడుతూ.. ‘ఈ సన్నివేశాలపై ఏమని స్పందించాలో తెలియడం లేదు. నాకు వాల్మీకి రామాయణం, తులసీదాస్‌ రామాయణం గుర్తున్నాయి. మనం చూసిన రామాయణంలోనూ చాలా ఘట్టాలు ఉన్నాయి. అయితే ఇలాంటి సన్నివేశాలు చూపించినట్లు నాకు గుర్తులేదు. మన దేశంలో 300పైగా రామాయణాలు ఉన్నాయి. ఒక్కో రామాయణంలో ఒక్కో విధమైన కథనం ఉంటుంది. బహుశా చిత్రబృందం నాకు తెలియని మరో రామాయణం నుంచి ఈ ఘట్టాన్ని తీసుకుని ఉండొచ్చు’ అని పేర్కొన్నారు.

ఇంకా సినిమా చూడలేదట!

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి నటించిన ‘రామాయణం’ సినిమాను చూశారా? అన్న ప్రశ్నకు దీపికా ఆసక్తికరంగా స్పందించారు. ఇప్పటివరకు సినిమా చూడలేదని, దీపావళి తర్వాత వచ్చే వారం వీక్షిస్తానని తెలిపారు. ఈ చిత్రం భారీ విజయం సాధిస్తుందనే నమ్మకం తనకు ఉందని చెప్పారు. నితీశ్‌ తివారీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రాన్ని ప్రైమ్‌ ఫోకస్‌ స్టూడియోస్‌, యశ్‌కు చెందిన మాన్‌స్టర్‌ మైండ్‌ క్రియేషన్స్‌ నిర్మించాయి. రణ్‌బీర్‌ కపూర్‌ రాముడిగా, సాయిపల్లవి సీతగా నటించగా.. యశ్‌, సన్నీ డియోల్‌, రవి దూబే, కాజల్‌ అగర్వాల్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, వివేక్‌ ఒబెరాయ్‌ తదితరులు కీలక పాత్రలు పోషించారు. నవంబర్‌ 5న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది.

Advertisement
Advertisement