త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Naga Durga | ఓటీటీలోకి నాగ‌దుర్గ త‌మిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పుల‌పాలైన ప్రేమికుడి క‌థ‌

తెలుగు ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ హీరోయిన్‌గా న‌టించిన త‌మిళ డెబ్యూమూవీ ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది. జూల 31 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో తెలుగుతో పాటు త‌మిళంలో ఈ మూవీ స్ట్రీమింగ్ కాబోతుంది. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ఈ మూవీలో ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌విష్ హీరోగా న‌టించాడు.

N

Entertainment | Published On Jul 24, 2026, 11.53 am IST

Naga Durga | ఓటీటీలోకి నాగ‌దుర్గ త‌మిళ రొమాంటిక్ కామెడీ మూవీ – ప్రియురాలి కోసం అప్పుల‌పాలైన ప్రేమికుడి క‌థ‌
Advertisement

Naga Durga | తెలుగు ఫోక్ సింగ‌ర్ క‌మ్ డ్యాన్స‌ర్ నాగ‌దుర్గ ల‌వ్ ఓ ల‌వ్ సినిమాతో హీరోయిన్‌గా కోలీవుడ్ ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ధ‌నుష్ మేన‌ల్లుడు ప‌విష్ హీరోగా న‌టించిన ఈ సినిమాకు మ‌గేష్ రాజేంద్ర‌న్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. రొమాంటిక్ కామెడీగా రూపొందిన ల‌వ్ ఓ ల‌వ్ థియేట‌ర్ల‌లో రిలీజైన మూడు వారాల్లోనే ఓటీటీలోకి వ‌చ్చేస్తోంది.
ల‌వ్ ఓ ల‌వ్ స్ట్రీమింగ్ డేట్‌తో పాటు ప్లాట్‌ఫామ్ ఫిక్స‌య్యాయి. జూలై 31న అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ మూవీ రిలీజ్ కాబోతుంది. త‌మిళంతో పాటు తెలుగులోనూ విడుద‌ల అవుతోంది.

కామెడీ వ‌ర్క‌వుట్ కాలేదు...

జెన్‌జీ యువ‌త ఆలోచ‌న‌లు, అభిప్రాయాలు ఎలా ఉంటున్నాయి?జ‌ల్సాల కార‌ణంగా ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందుల‌ను ఎదుర్కొంటున్నార‌నే అంశాల‌తో ద‌ర్శ‌కుడు మ‌గేష్ రాజేంద్ర‌న్ ల‌వ్ ఓ ల‌వ్ సినిమాను తెర‌కెక్కించారు. కాన్సెప్ట్ యూనిక్‌గానే ఉన్నా కామెడీ, ఎమోష‌న్స్ అనుకున్న స్థాయిలో వ‌ర్క‌వుట్ కాక‌పోవ‌డంతో ల‌వ్ ఓ ల‌వ్ క‌మ‌ర్షియ‌ల్ ఫెయిల్యూర్‌గా నిలిచింది. దాదాపు ఎనిమిది కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ థియేట‌ర్ల‌లో కోటి లోపే క‌లెక్ష‌న్స్ వ‌చ్చాయి. డెబ్యూ మూవీనే రిజ‌ల్ట్ ప‌రంగా నాగ‌దుర్గ‌కు పెద్ద‌ షాకిచ్చింది.

ర‌ఘు...అవంతిక ల‌వ్‌స్టోరీ....

ర‌ఘు ఓ కార్పొరేట్ కంపెనీలో జాబ్ చేస్తుంటాడు. అవంతిక‌తో తొలిచూపులోనే ప్రేమ‌లో ప‌డ‌తాడు. అవంతిక కూడా ర‌ఘును ఇష్ట‌ప‌డుతుంది. అవంతిక జ‌ల్సాల కార‌ణంగా ర‌ఘు అప్పుల‌పాల‌వుతాడు. జాబ్ పోవ‌డ‌మే కాకుండా కుటుంబానికి దూర‌మ‌వుతాడు. దాంతో అవంతిక‌కు బ్రేక‌ప్ చెప్పేసి దుబాయ్ వెళ్లిపోవాల‌ని అనుకుంటాడు. కానీ అవంతిక‌ను ర‌ఘు మోసం చేశాడంటూ మ‌హిళా మండ‌లి అధ్య‌క్షురాలు లేఖ కేస్ పెట్ట‌డంతో ర‌ఘు జైలు పాల‌వుతాడు? ఆ త‌ర్వాత ఏమైంది? ర‌ఘు జైలు నుంచి విడుద‌ల‌య్యాడా? అవంతిక‌కు అత‌డు పెట్టిన కండీష‌న్లు ఏమిటి? అన్న‌దే ఈ మూవీ క‌థ‌.

ఇడుపుకాయితం...

ప్ర‌స్తుతం తెలుగులో నాగ‌దుర్గ ఇడుపుకాయితం అనే సినిమా చేస్తోంది. టైటిల్ వివాదం కార‌ణంగా ఓపెనింగ్‌తోనే ఈ సినిమాపై మంచి బ‌జ్ ఏర్ప‌డింది. ప్రియ‌ద‌ర్శి హీరోగా న‌టిస్తున్న ఈ మూవీ డిసెంబ‌ర్‌లో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది.

 

Advertisement
Advertisement