Naga Durga | నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీకి షాకింగ్ కలెక్షన్స్ – 10 కోట్ల బడ్జెట్‌తో తీస్తే 15 లక్షలు వచ్చాయి!
లవ్ ఓ లవ్ మూవీతో ఫోక్ సింగర్ నాగదుర్గ కోలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ధనుష్ మేనల్లుడు పవీష్ హీరోగా నటించిన ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ మూవీ తొలి రోజు పదిహేను లక్షల కలెక్షన్స్ మాత్రమే రాబట్టి డిసపాయింట్ చేసింది.
Entertainment | Published On Jul 11, 2026, 8.34 pm IST
ఫోక్ సాంగ్స్‌తో ఫేమస్ అయిన నాగదుర్గకు హీరోయిన్‌గా ఆఫర్లు క్యూ కడుతోన్నాయి. ప్రస్తుతం తెలుగులో ఇడుపుకాయితం సినిమా చేస్తోంది. టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ సుకుమార్ నిర్మిస్తున్న ఈ మూవీ ఇటీవలే లాంఛ్ అయ్యింది. టైటిల్ వివాదం కారణంగా ఇడుపుకాయితం సినిమాకు ఓపెనింగ్ ఈవెంట్‌తోనే ఫుల్ పబ్లిసిటీ వచ్చింది.
కాగా ఇడుపుకాయితం కంటే ముందు తమిళంలో హీరోయిన్‌గా ఓ సినిమా చేసింది నాగదుర్గ. లవ్ ఓ లవ్ పేరుతో తెరకెక్కిన ఈ సినిమాలో ధనుష్ మేనల్లుడు పవీన్ నారాయణన్ హీరోగా నటించాడు.ఈ రొమాంటిక్ కామెడీ మూవీతోనే నాగదుర్గ కోలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చింది.
ధనుష్ మేనల్లుడు...
శుక్రవారం తమిళంతో పాటు తెలుగులో లవ్ ఓ లవ్ రిలీజైంది. ధనుష్ మేనల్లుడు హీరో కావడం, పలువురు స్టార్స్ ప్రమోషన్స్‌లో పాల్గొనడంతో తమిళనాట మంచి బజ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. మరోవైపు నాగదుర్గ తమిళ డెబ్యూ మూవీ కావడంతో తెలుగు డబ్బింగ్ వెర్షన్‌పై కూడా మోస్తారు అంచనాలు ఏర్పడ్డాయి. బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందోనని ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూశారు.
పదిహేను లక్షలు...
కానీ తొలిరోజే ఈ మూవీ దారుణంగా డిసపాయింట్ చేసింది. శుక్రవారం రోజు లవ్ ఓ లవ్ సినిమాకు తమిళంలో పది లక్షలు, తెలుగులో ఐదు లక్షల కలెక్షన్స్ రాబట్టింది. రెండు భాషల్లో కలిపి కేవలం పదిహేను లక్షలు మాత్రమే వచ్చాయి. నాగదుర్గ క్రేజ్ తెలుగులో ఏ మాత్రం పనిచేయలేదు. ప్రమోషన్స్ సరిగ్గా చేయకపోవడం కూడా మైనస్‌గా మారింది. తెలుగులో ఈ సినిమా రిలీజైన సంగతే చాలా మందికి తెలియదు.
కోటి అనుకుంటే....
తమిళంలో తొలి రోజు లవ్ ఓ లవ్ సినిమాకు కోటి వరకు కలెక్షన్స్ రావచ్చునని మేకర్స్ అంచనా వేసినట్లు సమాచారం. కనీసం అందులో సగం కూడా రాబట్టలేకపోవడం షాకింగ్‌కు గురిచేస్తోన్నట్లు వార్తలొస్తున్నాయి. దాదాపు పది కోట్ల బడ్జెట్‌తో లవ్ ఓ లవ్ సినిమాను నిర్మించారు. ఫస్ట్ డే కలెక్షన్స్ చూస్తుంటే ఈ రొమాంటిక్ కామెడీ మూవీ నిర్మాతలకు భారీగానే నష్టాలను మిగిల్చే అవకాశం కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం
- ●S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు
- ●CM Revanth| రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి
- ●Shabad Murder Case | షాబాద్ మర్డర్ మిస్టరీ: ఆరుగురిని చంపి రెంటల్ కారులో పరార్.. వాడిని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు
- ●Tollywood | ఏపీ ముఖ్యమంత్రిగా రమ్యకృష్ణ - లక్ష్మి ప్రణతి లుక్ రిలీజ్
- ●Kaleshwaram Project | అప్పుడే వార్నింగ్ ఇచ్చినా.. కేసీఆర్ పట్టించుకోలేదు

Deshapati Srinivas | నరికి వాళ్ల నెత్తురు, కొవ్వు పొలాలకు పారించాలి : దేశపతి శ్రీనివాస్ తీవ్ర ఆగ్రహం

S Janaki | దిగ్గజ గాయని ఎస్ జానకి కన్నుమూత - అరవై ఏళ్ల సినీ ప్రయాణం - యాభై వేల పాటలు

CM Revanth| రిటైర్డ్ ఇంజనీర్లను బొక్కల ఎయ్యకుండ తప్పు జేసినం ..సీఎం రేవంత్ రెడ్డి

Shabad Murder Case | షాబాద్ మర్డర్ మిస్టరీ: ఆరుగురిని చంపి రెంటల్ కారులో పరార్.. వాడిని పట్టిస్తే రూ.2 లక్షల రివార్డు





