త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

TGPCB | ద‌స‌రా సెల‌వుల్లో.. హైద‌రాబాద్‌లో మెరుగుప‌డ్డ గాలి నాణ్య‌త‌

TGPCB | హైద‌రాబాద్ న‌గ‌ర ర‌హ‌దారుల‌పై వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగుతూనే ఉంటాయి. నిత్యం రోడ్ల‌న్నీ ర‌ద్దీగానే ఉంటాయి. దీంతో వాయు కాలుష్యం( Air Pollution ) విప‌రీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ ద‌స‌రా సెల‌వుల్లో మాత్రం హైద‌రాబాద్‌లో గాలి నాణ్య‌త( Air Quality ) మెరుగుప‌డిన‌ట్లు తెలంగాణ పొల్యూష‌న‌ల్ కంట్రోల్ బోర్డు (TGPCB) నివేదిక వెల్ల‌డిస్తుంది.

S

Hyderabad | Published On Oct 24, 2026, 5.31 pm IST

TGPCB | ద‌స‌రా సెల‌వుల్లో.. హైద‌రాబాద్‌లో మెరుగుప‌డ్డ గాలి నాణ్య‌త‌
Advertisement

TGPCB | త్రినేత్ర న్యూస్ : హైద‌రాబాద్ న‌గ‌ర ర‌హ‌దారుల‌పై వాహ‌నాల రాక‌పోక‌లు కొన‌సాగుతూనే ఉంటాయి. నిత్యం రోడ్ల‌న్నీ ర‌ద్దీగానే ఉంటాయి. దీంతో వాయు కాలుష్యం( Air Pollution ) విప‌రీతంగా పెరిగిపోతూ ఉంటుంది. కానీ ఈ ద‌స‌రా సెల‌వుల్లో మాత్రం హైద‌రాబాద్‌లో గాలి నాణ్య‌త( Air Quality ) మెరుగుప‌డిన‌ట్లు తెలంగాణ పొల్యూష‌న‌ల్ కంట్రోల్ బోర్డు (TGPCB) నివేదిక వెల్ల‌డిస్తుంది.

ద‌స‌రా సెలవుల నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో నివాస‌ముంటున్న ప్ర‌జ‌లంద‌రూ త‌మ సొంతూర్ల‌కు వెళ్లారు. దీంతో న‌గ‌రంలో వాహ‌నాల ర‌ద్దీ పూర్తిగా త‌గ్గిపోయింది. ఈ క్ర‌మంలో వాయు కాలుష్యం త‌గ్గిపోయి గాలి నాణ్య‌త మెరుగు ప‌డింది. అక్టోబ‌ర్ 9 నుంచి 18వ తేదీ మ‌ధ్య‌లో గాలి నాణ్య‌త‌ను ప‌రీక్షించే 14 కేంద్రాలను ప‌రిశీలిస్తే.. 11 కేంద్రాల వ‌ద్ద పీఎం2.5 స్థాయిలు త‌గ్గాయి. మ‌రో 13 కేంద్రాల‌ను ప‌రిశీలిస్తే.. 8 కేంద్రాల వ‌ద్ద పీఎం10 స్థాయిలు త‌గ్గాయి. పాశమైలారంలో పీఎం2.5 గాఢత క్యూబిక్ మీటరుకు 90 మైక్రోగ్రాముల నుండి 28 మైక్రోగ్రాములకు పడిపోయింది. అదే ప్రాంతంలో పీఎం10 స్థాయిలు క్యూబిక్ మీటరుకు 145 నుండి 61 మైక్రోగ్రాములకు తగ్గిన‌ట్లు పీసీబీ నివేదిక‌లో వెల్ల‌డైంది.

వాహ‌నాల నుంచి వెలువ‌డే నైట్రోజ‌న్ ఆక్సైడ్ స్థాయిల‌ను ప‌రిశీలిస్తే.. 9 ప్రాంతాల్లో అత్య‌ల్పంగా త‌గ్గాయి. బొల్లారం, నిజాంపేట్ వంటి ఏరియాల్లో గాఢ‌త క్యూబిక్ మీట‌ర్‌కు 27.2 నుంచి 33.5 మైక్రోగ్రాముల‌కు ప‌డిపోయింది. ఖైర‌తాబాద్ ఆర్టీఏ ఏరియాలో నైట్రోజ‌న్ ఆక్సైడ్ స్థాయిలు 23.3 నుంచి 33.5 మైక్రోగ్రాముల‌కు పెరిగాయి. ఈ ఏరియాలో వాహ‌నాల రాక‌పోక‌ల ర‌ద్దీ ఎక్కువ‌గా ఉన్నందున నైట్రోజ‌న్ ఆక్సైడ్ స్థాయిలు పెరిగి ఉండొచ్చ‌ని వెల్ల‌డైంది. ఇక కార్బన్ మోనాక్సైడ్ స్థాయిలు కూడా తొమ్మిది ప్రాంతాలలో తగ్గాయి. బొల్లారం, నిజాంపేట్‌లో వీటి గాఢత క్యూబిక్ మీటరుకు 1.2 నుండి 0.5 మిల్లీగ్రాములకు తగ్గగా, హైద‌రాబాద్ సెంట్ర‌ల్ యూనివ‌ర్సిటీ వ‌ద్ద‌ 0.4 నుండి 0.1 మిల్లీగ్రాములకు క్షీణత నమోదైంది అని పీసీబీ రిపోర్టులో తేలింది.

Advertisement
Advertisement