Ponguleti Srinivas Reddy | చిక్కులు లేకుండా జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు
Ponguleti Srinivas Reddy | ఇళ్ల స్థలాల (House Plots) కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల (Journalists) కు నివాసయోగ్యమైన ప్రాంతంలోనే స్థలాలు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు.
- నివాసయోగ్యమైన ప్రాంతంలోనే ఇచ్చేలా చూస్తాం
- ఇంతకుముందు కాంగ్రెస్ హయాంలోనే ఇచ్చారు.. మరోసారి ఇస్తాం
- రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి
Ponguleti Srinivas Reddy | త్రినేత్ర న్యూస్: ఇళ్ల స్థలాల (House Plots) కోసం ఏళ్లుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల (Journalists) కు నివాసయోగ్యమైన ప్రాంతంలోనే స్థలాలు అందజేస్తామని రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌరసంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి (Ponguleti Srinivas Reddy) అన్నారు. చట్టపరమైన చిక్కులు లేకుండా అందించేందుకు ప్రభుత్వం కార్యాచరణ రూపొందిస్తోందన్నారు. ఈమేరకు ఆయన శనివారం విడుదల చేసిన ఒక ప్రకటనలో వెల్లడించారు.
దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో 2008 లో జర్నలిస్టు హౌసింగ్ సొసైటీకి భూములు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ వ్యవహారంపై సుప్రీంకోర్టులో కేసు పెండింగ్‌లో ఉండటంతో జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే ప్రక్రియ సుదీర్ఘకాలం నిలిచిపోయింది. 2022లో న్యాయపరమైన అడ్డంకులు తొలగిన తర్వాత కూడా గతంలో ఈ సమస్యకు పూర్తిస్థాయి పరిష్కారం లభించలేదు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కొద్ది నెలల్లోనే జర్నలిస్టుల ఇళ్ల స్థలాల అంశంపై చొరవ తీసుకుంది. రెండు దశాబ్దాలుగా ఎదురుచూస్తున్న జర్నలిస్టుల హౌసింగ్ సొసైటీకి 2024, సెప్టెంబర్ 8న రవీంద్ర భారతిలో కార్యక్రమాన్ని నిర్వహించి భూమిని సొసైటీకి అప్పగించాం. అనంతరం సుప్రీంకోర్టు తుది ఉత్తర్వుల నేపథ్యంలో మరోసారి న్యాయపరమైన సమస్యలు ఎదురుకావడంతో ఈ అంశానికి శాశ్వత పరిష్కారం చూపాల్సిన అవసరం ఏర్పడింది.
జర్నలిస్టులు ఆందోళన చెందొద్దు
ఈ పరిస్థితుల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు సహచర మంత్రులతో పలుమార్లు చర్చించి జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై సమగ్రంగా సమీక్షించాం. జర్నలిస్టుల సొంతింటి కలను సాకారం చేయాలన్నది మా ప్రభుత్వ సంకల్పం. గతంలో ఎదురైన న్యాయపరమైన సమస్యలు పునరావృతం కాకుండా, చట్టపరమైన చిక్కులు లేని విధంగా, కుటుంబాలతో గౌరవంగా నివసించేందుకు అనువైన ప్రాంతంలో ఇళ్ల స్థలాలు అందించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం. జర్నలిస్టులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. వారి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోంది.
కాంగ్రెస్ పాలనలోనే మరోసారి..
ఇప్పటివరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. మరోసారి కాంగ్రెస్ పాలనలోనే ఇస్తాం. ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిగా ఉంటూ ప్రజాస్వామ్య వ్యవస్థలో కీలక పాత్ర పోషిస్తున్న జర్నలిస్టుల సంక్షేమానికి ప్రజా ప్రభుత్వం ప్రాధాన్యం ఇస్తుంది. జర్నలిస్టుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంతోపాటు, వారికి గౌరవప్రదమైన జీవనానికి అవసరమైన వసతులు కల్పించేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉంది అని మంత్రి పొంగులేటి తెలిపారు.
సంబంధిత వార్తలు

Khulsumpura Traffic Police Special Drive | సెల్ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!
అక్టోబర్ 24, 2026

Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
అక్టోబర్ 24, 2026

BRS MLAs | కన్నెపల్లి నుంచి గోదావరి జలాలను ఎత్తిపోయాలి
అక్టోబర్ 24, 2026
తాజావార్తలు
- ●Minister Seethakka | మహిళా జర్నలిస్టులపై దాడులు సరికావు : మంత్రి సీతక్క
- ●Gopichand | జెట్ స్పీడ్లో గోపీచంద్ "సింగ" షూటింగ్ - హీరోయిన్గా మలయాళ బ్యూటీ
- ● Khulsumpura Traffic Police Special Drive | సెల్ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!
- ●OPPO Pad Mini | మ్యాట్ డిస్ప్లేతో కొత్త ట్యాబ్.. లాంచ్ చేసిన ఒప్పో.. భారీ బ్యాటరీ..
- ●Uttam Kumar Reddy | ప్రాజెక్టులు పూర్తి చేసుంటే ఈ కరువు దెబ్బ తగ్గేది
- ●iPhone Duo | 11వేల సార్లు మడిచిన తరువాత ఐఫోన్ డ్యుయో పరిస్థితి ఇది.. మన్నిక ఎలా ఉంది..?

Minister Seethakka | మహిళా జర్నలిస్టులపై దాడులు సరికావు : మంత్రి సీతక్క

Gopichand | జెట్ స్పీడ్లో గోపీచంద్ "సింగ" షూటింగ్ - హీరోయిన్గా మలయాళ బ్యూటీ

Khulsumpura Traffic Police Special Drive | సెల్ఫోన్ మాట్లాడుతూ స్పెషల్ డ్రైవ్లో దొరికిపోయారు.. ఎన్ని కేసులయ్యాయంటే!

OPPO Pad Mini | మ్యాట్ డిస్ప్లేతో కొత్త ట్యాబ్.. లాంచ్ చేసిన ఒప్పో.. భారీ బ్యాటరీ..



