త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay Deverakonda | కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి విజ‌య్ దేవ‌ర‌కొండ మైథాల‌జీ మూవీ – క‌న్న‌డ నాయిక‌తో రొమాన్స్‌

ర‌ణ‌బాలి స‌క్సెస్‌తో జోష్ మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త మూవీ షూటింగ్ మొద‌లుపెట్ట‌బోతున్నారు. విజ‌య్ దేవ‌ర‌కొండ హీరోగా హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథాల‌జీ థ్రిల్ల‌ర్ మూవీ రాబోతుంది. ఈ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ జ‌న‌వ‌రి నుంచి ప్రారంభం కానున్నట్లు వార్త‌లొస్తున్నాయి.

N

Entertainment | Published On Oct 24, 2026, 5.33 pm IST

Vijay Deverakonda | కొత్త ఏడాదిలో సెట్స్‌పైకి విజ‌య్ దేవ‌ర‌కొండ మైథాల‌జీ మూవీ – క‌న్న‌డ నాయిక‌తో రొమాన్స్‌
Advertisement

Vijay Deverakonda | ర‌ణ‌బాలి మూవీతో కెరీర్‌లో మ‌రో బ్లాక్‌బ‌స్ట‌ర్‌ను త‌న ఖాతాలో వేసుకున్నారు విజ‌య్ దేవ‌ర‌కొండ‌ (Vijay Deverakonda). రాహుల్ సాంకృత్యాన్ ద‌ర్శ‌క‌త్వంలో పీరియాడిక‌ల్ యాక్ష‌న్‌గా తెర‌కెక్కిన ఈ మూవీకి మొద‌టిరోజు డివైడ్ టాక్ వ‌చ్చింది. విజ‌య్, ర‌ష్మిక ప్ర‌మోష‌న్స్‌తో పాటు నిజాయితీతో కూడిన మంచి ప్ర‌య‌త్నంగా ఆడియెన్స్ నుంచి ప్ర‌శంస‌లు రావ‌డంతో వ‌సూళ్లు మెళ్ల‌మెళ్ల‌గా పెరుగుతూ వ‌చ్చాయి. నైజాం, సీడెడ్‌లో బ్రేక్ ఈవెన్ టార్గెట్‌ను చేరుకుంది.

మైథాల‌జీ మూవీ...

ఈ స‌క్సెస్‌తో జోష్ మీదున్న విజ‌య్ దేవ‌ర‌కొండ కొత్త‌ మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నారు. హాయ్ నాన్న ఫేమ్ శౌర్యువ్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ మైథాల‌జీ సినిమాను అంగీక‌రించారు ఈ టాలీవుడ్ హీరో. పురాణాల‌కు నేటి కాలాన్ని ముడిపెడుతూ రివేంజ్ యాక్ష‌న్ డ్రామాగా ద‌ర్శ‌కుడు శౌర్యువ్ ఈ సినిమాను రూపొందించ‌బోతున్నారు.
ఈ ఏడాది ఏప్రిల్‌లో విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శౌర్యువ్ మూవీ ఓపెనింగ్ ఈవెంట్ గ్రాండ్‌గా జ‌రిగింది. న‌వంబ‌ర్ నుంచి షూటింగ్ మొద‌లుపెట్టాల‌ని ప్లాన్ చేశారు. కానీ ర‌ణ‌బాలి, రౌడీ జ‌నార్ధ‌న షూటింగ్‌లు ఆల‌స్యం కావ‌డంతో ఆ ఎఫెక్ట్ ఈ మైథాల‌జీ మూవీపై ప‌డింది.

స్పెష‌ల్ మేకోవ‌ర్‌...

తాజాగా శౌర్యువ్ సినిమా కోసం విజ‌య్ దేవ‌ర‌కొండ డేట్స్ కేటాయించిన‌ట్లు చెబుతోన్నారు. వ‌చ్చే ఏడాది జ‌న‌వ‌రిలో ఈ మూవీ సెట్స్‌లో అడుగుపెట్ట‌బోతున్నాడు. మైథాల‌జీ రోల్ కోసం విజ‌య్ స్పెష‌ల్‌గా మేకోవ‌ర్ కాబోతున్న‌ట్లు స‌మాచారం. అత‌డి లుక్‌, క్యారెక్ట‌రైజేష‌న్ గ‌త సినిమాల‌తో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటుంద‌ని అంటున్నారు. మైథాల‌జీ ఎపిసోడ్స్ ఈ సినిమాకు హైలైట్‌గా ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

బాలీవుడ్ వ‌ర్సెస్ శాండ‌ల్‌వుడ్‌

విజ‌య్ దేవ‌ర‌కొండ‌, శౌర్యువ్ మూవీలో హీరోయిన్ ఎవ‌ర‌న్న‌ది టాలీవుడ్ వ‌ర్గాల్లో ఆస‌క్తిక‌రంగా మారింది. కృతి స‌న‌న్‌తో పాటు రుక్మిణి వ‌సంత్ పేర్లు ప్ర‌చారంలో ఉన్నాయి. ఈ ఇద్ద‌రిలో ఒక‌రిని త్వ‌ర‌లోనే క‌థానాయిక‌గా ఫైన‌ల్ చేసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. మైథాల‌జీ క‌థ‌కు రుక్మిణి వ‌సంత్ బాగా సెట్ అవుతుంద‌నే ఆలోచ‌న‌లో ద‌ర్శ‌క‌నిర్మాత‌లు ఉన్న‌ట్లు తెలిసింది. దాదాపు ఈ క‌న్న‌డ బ్యూటీనే క‌న్ఫామ్ కావ‌చ్చున‌ని టాక్‌ వినిపిస్తోంది.
ఈ పాన్ ఇండియ‌న్ సినిమాకు ప‌లువురు హాలీవుడ్ టెక్నీషియ‌న్లు ప‌నిచేయ‌బోతున్నారు. హౌజ్ ఆఫ్ డ్రాగ‌న్‌, ఫాలౌట్ సినిమాల ఫేమ్ అలెగ్జాండ్రో మార్టినెజ్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తోండ‌గా...గాడ్ ఆఫ్ ఈజిప్ట్ ఫేమ్ ఎరిక్ డ‌స్ట్ వీఎఫ్ఎక్స్ స‌మ‌కూర్చుతున్నారు.

 

 

Advertisement
Advertisement