Naga Chaitanya | రిలీజ్ డేట్ చెప్పేశారు – షూటింగ్ మాత్రం పెండింగ్ – నాగచైతన్య వృషకర్మపై అప్‌డేట్
నాగచైతన్య వృషకర్మ డిసెంబర్ 4న థియేటర్లలోకి రాబోతుంది. రిలీజ్‌కు మరో నలభై రోజులే టైమ్ ఉంది. అయినా షూటింగ్ మాత్రం కంప్లీట్ కాకపోవడం అభిమానుల్లో ఆసక్తికరంగా మారింది. ప్రకటించిన డేట్‌కు ఈ సినిమా థియేటర్లలోకి వస్తుందా? అన్నది అనుమానంగా మారింది. విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దండు దర్వకత్వం వహిస్తున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
Entertainment | Published On Oct 21, 2026, 12.23 pm IST
Naga Chaitanya | పాన్ ఇండియన్ మోజులో పడి స్టార్ హీరోలు మాత్రమే కాదు యంగ్ హీరోలు కూడా సినిమా షూటింగ్‌ల కోసమే ఏళ్లకు ఏళ్లు టైమ్ కేటాయిస్తున్నారు. తండేల్ బ్లాక్‌బస్టర్ తర్వాత నాగచైతన్య హీరోగా నటిస్తున్న మూవీ వృషకర్మ. డివైన్ మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు విరూపాక్ష ఫేమ్ కార్తిక్ వర్మ దర్శకత్వం వహిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తోంది.
దేవతా విగ్రహం...
దసరా సందర్భంగా వృషకర్మ నుంచి కొత్త పోస్టర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. ఈ పోస్టర్‌లో నుదుటిపై ఎర్రటి తిలకంతో ఇంటెన్స్ లుక్‌లో నాగచైతన్య కనిపిస్తున్నారు. అతడి ముందు సంప్రదాయ ఆభరణాలు, ఎరుపు బంగారు రంగుల చీరతో అలంకరించిన దేవతా విగ్రహం కనిపిస్తోంది. ఆ విగ్రహం చేతిలో బంగారు శూలం ఉంది. భక్తి, మిస్టరీ అంశాలతో ఈ పోస్టర్ ఆసక్తిని పంచుతోంది.
షూటింగ్ అప్‌డేట్
వృషకర్మ రిలీజ్ డేట్‌ను మేకర్స్ ఇటీవలే ప్రకటించారు. అక్టోబర్ 4న ఈ మూవీని థియేటర్లలోకి తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. రిలీజ్‌కు మరో నలభై రోజులు మాత్రమే టైమ్ ఉంది. కానీ వృషకర్మ షూటింగ్ మాత్రం పూర్తికాలేదు. లాస్ట్ షెడ్యూల్‌ను షూట్ చేస్తున్నారు. ఓ వైపు చిత్రీకరణను జరుపుతూనే మరోవైపు నిర్మాణానంతర పనులు కొనసాగిస్తున్నారు. చెప్పిన డేట్‌కు ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తారా? చివరి నిమిషంలో వాయిదా వేస్తారా? అన్నది సస్పెన్స్‌గా మారింది. దాదాపు ఏడాదిన్నరపైనే నాగచైతన్య ఈ సినిమా షూటింగ్ కోసం సమయాన్ని కేటాయించడం గమనార్హం.
హయ్యెస్ట్ బడ్జెట్....
నాగచైతన్య కెరీర్‌లోనే హయ్యెస్ట్ బడ్జెట్‌తో రూపొందుతోన్న మూవీ ఇది. వృషకర్మ కోసం ఫిజికల్‌గా చాలా మేకోవర్ అయ్యారు. అతడి లుక్, క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉంటుందని మేకర్స్ చెబుతోన్నారు. వృషకర్మలో లపాతా లేడీస్ ఫేమ్ బాలీవుడ్ నటుడు స్పర్శ్ శ్రీవాస్తవ విలన్‌గా నటిస్తున్నారు. జయరామ్, బేబీ కియారా కీలక పాత్రలు పోషిస్తున్నారు. అజనీష్ బీ లోకనాథ్ మ్యూజిక్ అందిస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్‌తో కలిసి నిర్మాత బీవీఎస్ఎన్ ప్రసాద్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు
తాజావార్తలు
- ●Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ
- ●Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..
- ●Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు
- ●Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..
- ●TTD Recommendation Letters Cancelled | తిరుమల వెళ్తున్నారా? ఆ లేఖలు చెల్లవు.. టీటీడీ కీలక ప్రకటన
- ●Bhagwant Mann | ఢిల్లీ ఎయిర్‌పోర్టులో పంజాబ్ సీఎం నిర్బంధం.. రూ.50,000 ఫైన్

Police Commemoration Day Hyderabad | త్వరలో మరో 5 వేల పోలీస్ జాబ్స్.. 2028 లోగా అన్ని ఖాళీల భర్తీ

Google Gemini | కారులోనే జెమిని ఏఐ.. ఇక ప్రయాణం మరింత సౌకర్యవంతం..

Salman Khan | అసలు టార్గెట్ సల్మాన్.. టైగర్ ష్రాఫ్ కాదు.. దర్యాప్తులో వెలుగులోకి కీలక విషయాలు

Gold And Silver Prices Today | బంగారం కొనేవారికి అలర్ట్.. బులియన్ మార్కెట్లలో తీవ్ర అస్థిరత..






