Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో – కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
వృషకర్మ తర్వాత అక్కినేని హీరో నాగచైతన్య టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీతో తదుపరి సినిమా చేయబోతున్నాడు. బెదురులంక ఫేమ్ క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా నటించనున్నట్లు సమాచారం. దుల్కర్ సల్మాన్ ఆకాశంలో ఒక తార సినిమాతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టబోతుంది సాత్విక. తొలి సినిమా రిలీజ్ కాకముందే నాగచైతన్య మూవీలో ఛాన్స్ దక్కించుకుంది.
Entertainment | Published On Oct 2, 2026, 5.05 pm IST
Naga Chaitanya | ప్రస్తుతం తెలుగులో టైమ్ ట్రావెల్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. మహేష్‌బాబు, రాజమౌళి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న వారణాసి టైమ్ ట్రావెల్ కథతోనే తెరకెక్కుతోంది. అల్లు అర్జున్ రాకా కూడా డిఫరెంట్ టైమ్‌లైన్స్‌లో సాగనున్నట్లు సమాచారం. ఈ ట్రెండ్‌లోకి అక్కినేని హీరో నాగచైతన్య అడుగుపెట్టబోతున్నారు. ప్రస్తుతం వృషకర్మ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు నాగచైతన్య. మిస్టిక్ థ్రిల్లర్‌గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది. నవంబర్‌లో వృషకర్మ థియేటర్లలోకి రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
లవ్‌స్టోరీ...
ఓ వైపు వృషకర్మ షూటింగ్‌లో పాల్గొంటూనే మరోవైపు తన తదుపరి సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టారు నాగచైతన్య. వృషకర్మ తర్వాత టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీతో నాగచైతన్య ఓ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమాకు బెదురులంక 2012 ఫేమ్ క్లాక్స్ దర్శకత్వం వహిస్తున్నారు.
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్...
టైమ్ ట్రావెల్‌తో పాటు సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ మిక్స్ చేస్తూ డైరెక్టర్ క్లాక్స్ ఈ కథను సిద్ధం చేసినట్లు చెబుతున్నారు. రెండు టైమ్ పీరియడ్స్‌లో ఈ సినిమా సాగనుందని, వీటికి తగ్గట్లుగా డిఫరెంట్ లుక్‌లలో నాగచైతన్య కనిపించనున్నాడని అంటున్నారు. ఈ పాత్రల కోసం ఫిజికల్‌గానే కాకుండా లుక్ పరంగా ఈ అక్కినేని హీరో మేకోవర్ కానున్నట్లు తెలిసింది.
ఆకాశంలో ఒక తార హీరోయిన్...
ఈ టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో నాగచైతన్యకు జోడీగా సాత్విక వీరవల్లి హీరోయిన్‌గా కనిపించబోతున్నట్లు సమాచారం. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ఆకాశంలో ఒక తార సినిమా చేస్తోంది సాత్విక. ఈ మూవీతోనే టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా అడుగుపెట్టబోతుంది. తొలి సినిమా రిలీజ్ కాకముందే మరో బంపరాఫర్ అందుకుంది. సాత్విక కంటే ముందు రుక్మిణి వసంత్‌ను అనుకున్నారు. కానీ వరుస డిజాస్టర్ల ఎఫెక్ట్‌తో ఆమెను పక్కనపెట్టారు.
అన్నపూర్ణ స్టూడియోస్...
నాగచైతన్య, క్లాక్స్ మూవీని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించబోతున్నట్లు సమాచారం. జనవరిలో షూటింగ్ మొదలుపెట్టి వచ్చే ఏడాది చివరలో సినిమాను రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ – 400 కోట్ల కలెక్షన్స్ – తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
అక్టోబర్ 2, 2026

Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ – రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
అక్టోబర్ 2, 2026

Sudigali Sudheer | ఎట్టకేలకు థియేటర్లలోకి సుడిగాలి సుధీర్ కాంట్రవర్షియల్ మూవీ – హీరోయిన్‌గా కోలీవుడ్ బోల్డ్ బ్యూటీ
అక్టోబర్ 1, 2026
తాజావార్తలు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
- ●India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే



