త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం

India-Pakistan Border | భారత్‌–పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఖల్డా ప్రాంతంలోని రాజోక్‌ బీఓపీ వద్ద సరిహద్దు దాటేందుకు యత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్‌ (BSF) సిబ్బంది కాల్చిచంపారు. మరో ఇద్దరు అనుమానితులు తప్పించుకున్నారా? లేక సరిహద్దు అవతలే ఉండిపోయారా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది.

P

National | Published On Oct 2, 2026, 4.59 pm IST

India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం
Advertisement

India-Pakistan Border | భారత్‌–పాకిస్థాన్‌ అంతర్జాతీయ సరిహద్దులో గురువారం అర్ధరాత్రి కలకలం రేగింది. ఖల్డా ప్రాంతంలోని రాజోక్‌ బీఓపీ వద్ద సరిహద్దు దాటేందుకు యత్నించిన ఇద్దరు చొరబాటుదారులను బీఎస్‌ఎఫ్‌ (BSF) సిబ్బంది కాల్చిచంపారు. మరో ఇద్దరు అనుమానితులు తప్పించుకున్నారా? లేక సరిహద్దు అవతలే ఉండిపోయారా? అన్నది ప్రస్తుతం మిస్టరీగా మారింది. మృతుల గుర్తింపుపై ఇంకా స్పష్టత రాలేదు. గురువారం అర్ధరాత్రి 12.35 గంటల సమయంలో రాజోక్‌ బీఓపీ వద్ద విధుల్లో ఉన్న బీఎస్‌ఎఫ్‌ సిబ్బందికి సరిహద్దు అవతలి నుంచి అనుమానాస్పద కదలికలు కనిపించాయి. నైట్‌ విజన్‌ కెమెరాలతో నిఘా పెట్టగా.. ముగ్గురు, నలుగురు వ్యక్తులు పాకిస్థాన్‌ వైపు నుంచి భారత భూభాగం వైపు కదులుతున్నట్లు గుర్తించారు. అప్రమత్తమైన బీఎస్‌ఎఫ్‌ సిబ్బంది వారిని ఆగిపోవాలని హెచ్చరించారు. అయినప్పటికీ ముందుకు క‌ద‌ల‌డంతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు.

మృతదేహాలు స్వాధీనం

కాల్పుల అనంతరం భద్రతా బలగాలు ఇద్దరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాయి. వారి వద్ద ఎలాంటి గుర్తింపు పత్రాలు లభించాయన్నది వెల్లడికాలేదు. ప్రాథమికంగా వారు పాకిస్థాన్‌కు చెందినవారై ఉండొచ్చని భావిస్తున్నప్పటికీ.. ఈ విషయాన్ని బీఎస్‌ఎఫ్‌ అధికారికంగా ధ్రువీకరించలేదు. ఘటనపై పాకిస్థాన్‌ రేంజర్స్‌కు సమాచారం అందించారు. సరిహద్దు ప్రాంతంలో కొంతకాలంగా డ్రోన్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఆయుధాల అక్రమ రవాణా జరుగుతున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన చొరబాటు యత్నం వెనుక స్మగ్లింగ్‌ కోణం ఉందా? అన్నదానిపైనా భద్రతా సంస్థలు దృష్టి సారించాయి. హతమైన వ్యక్తులకు డ్రగ్స్‌ లేదా ఆయుధాల అక్రమ రవాణాతో సంబంధం ఉండొచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నా.. దీనిపై అధికారిక ప్ర‌క‌ట‌న రావాల్సి ఉంది.

సరిహద్దంతా జల్లెడ

కాల్పుల సమయంలో కనిపించిన ముగ్గురు, నలుగురు అనుమానితుల్లో ఇద్దరు హతమైనట్లు నిర్ధారణ కాగా.. మిగిలిన వారి ఆచూకీపై స్పష్టత లేదు. దీంతో శుక్రవారం సరిహద్దు ప్రాంతంలో భద్రతా బలగాలు భారీ సెర్చ్‌ ఆపరేషన్‌ చేపట్టాయి. ఎస్‌ఎఫ్‌ సహా ఇతర భద్రతా సంస్థలు సంయుక్తంగా గాలింపు కొనసాగిస్తున్నాయి. భారత భూభాగంలోకి మరెవరైనా చొరబడ్డారా? అన్నదానితోపాటు పరిసర ప్రాంతాల్లో ఆయుధాలు, మాదకద్రవ్యాలు, ఇతర అనుమానాస్పద వస్తువులు ఉన్నాయా? అనే కోణంలోనూ తనిఖీలు నిర్వహిస్తున్నారు. మృతుల గుర్తింపు, చొరబాటు వెనుక ఉద్దేశం, ఘటనలో పాల్గొన్న వారి సంఖ్యపై అధికారిక దర్యాప్తు పూర్తయిన తర్వాతే పూర్తి వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది.

Advertisement
Advertisement