Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
Jio Platforms IPO | దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. జియో ప్లాట్‌ఫామ్స్ తన ప్రారంభ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.37వే కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే తన పబ్లిక్ ఆఫర్‌కు చెందిన పత్రాల తుది సన్నాహాలను ప్రారంభించగా, గ్లోబల్ రోడ్ షోలను సైతం పూర్తి చేసింది.
Jio Platforms IPO | దేశ చరిత్రలోనే అతి పెద్ద ఐపీవోకు రంగం సిద్ధమైంది. జియో ప్లాట్‌ఫామ్స్ తన ప్రారంభ పబ్లిక్ ఇష్యూ (ఐపీవో)కు సన్నాహాలు చేస్తోంది. ఇందులో భాగంగా దాదాపు రూ.37వే కోట్ల నిధులను సమీకరించాలని సంస్థ లక్ష్యంగా నిర్ణయించుకుంది. ఇప్పటికే తన పబ్లిక్ ఆఫర్‌కు చెందిన పత్రాల తుది సన్నాహాలను ప్రారంభించగా, గ్లోబల్ రోడ్ షోలను సైతం పూర్తి చేసింది. జియో ఐపీవో వస్తే దేశ చరిత్రలోనే అత్యంత భారీ ఐపీవోల్లో ఇది ఒకటిగా నిలుస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. జియో ప్లాట్‌ఫామ్స్ మేనేజింగ్ డైరెక్టర్, రిలయన్స్ జియో చైర్మన్ ఆకాష్ అంబానీ, రిలయన్స్ రిటెయిల్ వెంచర్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఈషా అంబానీ గ్లోబల్ రోడ్‌షోలకు నాయకత్వం వహించారు. ఈ మేరకు పీటీఐ వివరాలను వెల్లడించింది.
ఐపీవో కోసం సర్వత్రా ఆసక్తి..
జియో ప్లాట్‌ఫామ్స్ ఈ ఐపీవో ద్వారా భారీ మొత్తంలో నిధులను సమీకరించనుంది. 2008 తరువాత రిలయన్స్ గ్రూప్ నుంచి వస్తున్న తొలి ఐపీవో కావడంతో పెట్టుబడిదారులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అలాగే రిలయన్స్ గ్రూప్‌లో ఇప్పటికే పెట్టుబడులు పెట్టిన వారు సైతం ఈ ఐపీవో కోసం వేచి చూస్తున్నారు. రిలయన్స్ గ్రూప్‌లో వినియోగదారులపై దృష్టి పెట్టిన వ్యాపారం నుంచి వెలువడనున్న తొలి ఐపీవో కూడా ఇదే కావడం విశేషం. జియో ప్లాట్‌ఫామ్స్‌కు ముకేష్ అంబానీ చైర్మన్‌గా ఉండగా, ఆయన పెద్ద కుమారుడు ఆకాష్ అంబానీ ఎండీగా, రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మన్‌గా ఉన్నారు. దీంతో రిలయన్స్ గ్రూప్‌కు చెందిన కీలక డిజిటల్, టెలికాం వ్యాపారం తొలిసారిగా స్టాక్ మార్కెట్‌లోకి అడుగు పెట్టనుంది.
గ్రే మార్కెట్ ప్రీమియం ఎంత..
జియో ప్లాట్‌ఫామ్స్‌కు సంబంధించి గ్రే మార్కెట్ ప్రీమియం (జీఎంపీ)పై ఇంకా స్పష్టత రాలేదు. కంపెనీ ఐపీవో ధరల శ్రేణిని ప్రకటించిన తరువాతే జీఎంపీ తెలియనుంది. ఇక జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవో తేదీని కూడా కంపెనీ ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. కానీ ఈ ఏడాది చివరి వరకు ఐపీవో వస్తుందని అంచనా వేస్తున్నారు. ఈ నెల చివరి నుంచి డిసెంబర్ మధ్య ఐపీవో వచ్చే అవకాశం ఉందని, దీపావళికి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ ఏడాది జూన్ 19న జియో ప్లాట్‌ఫామ్స్ డీఆర్‌హెచ్‌పీని దాఖలు చేయగా, ప్రస్తుత షేర్ హోల్డర్ల కోసం ప్రత్యేక రిజర్వేషన్ కేటగిరిని ప్రకటించింది. అయితే ఈ కేటగిరి కింద ఎంత శాతం షేర్లను కేటాయించేది వెల్లడించలేదు. సెబీ పరిశీలన పూర్తయ్యాక, తుది డీఆర్‌హెచ్‌పీ దాఖలు చేసిన తరువాత మాత్రమే దీనిపై స్పష్టత రానుంది.
భారీగా పెరగనున్న కంపెనీ విలువ..
జియో ప్లాట్‌ఫామ్స్ ఐపీవోకు గాను ఆగస్టు 28న సెబీ తుది పరిశీలనకు ఆమోదం తెలిపింది. దీంతో ఈ ఐపీవోపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కంపెనీ దాఖలు చేసిన వివరాల ప్రకారం జియో ప్లాట్‌ఫామ్స్ 27 కోట్ల కొత్త ఈక్విటీ షేర్లను జారీ చేయనుంది. ఇవి ఐపీవో అనంతర మొత్తం ఈక్విటీ బేస్‌లో సుమారు 2.9 శాతానికి సమానం కాగా, ఈ ఐపీవో ద్వారా కంపెనీ విలువ సుమారు 137 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐపీవో ద్వారా సమీకరించనున్న నిధుల్లో ప్రధాన భాగాన్ని కంపెనీ తీసుకున్న రుణాలను చెల్లించేందుకు, ముందస్తు చెల్లింపులకు ఉపయోగించనుంది. డ్రాఫ్ట్ ప్రాస్పెక్టస్ ప్రకారం సుమారు రూ.27,500 కోట్ల రుణాలను పూర్తిగా లేదా కొంత భాగాన్ని తీర్చేందుకు ఈ నిధులను ఉపయోగించనున్నారు. మిగిలిన మొత్తాన్ని సాధారణ కార్పొరేట్ అవసరాలకు వినియోగించనున్నారు.
మెరుగ్గా ఆర్థిక ఫలితాలు..
జియో ప్లాట్‌ఫామ్స్‌లో ఇప్పటికే మెటా రూ.43,574 కోట్లను పెట్టుబడి పెట్టగా, గూగుల్ రూ.33,737 కోట్ల పెట్టుబడులతో కొనసాగుతోంది. ఈ రెండూ వరుసగా 9.99, 7.73 శాతం వాటాలను జియో ప్లాట్‌ఫామ్స్‌లో కలిగి ఉన్నాయి. అలాగే సిల్వర్ లేక్, విస్టా ఈక్విటీ పార్ట్‌నర్స్, జనరల్ అట్లాంటిక్, కేకేఆర్, ముబాదలా, అబుదాబి ఇన్వెస్ట్‌మెంట్ అథారిటీ, టీపీజీ, ఎల్ క్యాటర్టన్, ఇంటెల్ క్యాపిటల్, క్వాల్‌కామ్ వెంచర్స్ వంటి అంతర్జాతీయ పెట్టుబడి సంస్థలు మొత్తం రూ.74,745 కోట్లను పెట్టుబడిగా పెట్టాయి. వీరి అందరి ఉమ్మడి వాటా 15.2 శాతంగా ఉంది. ఇక జియో ప్లాట్‌ఫామ్స్‌లో రిలయన్స్ ఇండస్ట్రీస్ సుమారు 66.4 శాతం వాటాను కలిగి ఉంది. కాగా జియో ప్లాట్‌ఫామ్స్‌లో భాగంగా ఇప్పటికే జియో 5జి మొబైల్ కనెక్షన్లు, ఫిక్స్‌డ్ లైన్, బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్లు భారీ స్థాయిలో ఉన్నాయి. పలు విభాగాల్లో క్లౌడ్ సేవలను సైతం సంస్థ అందిస్తోంది. ఇక ఆర్థిక ఫలితాల్లోనూ సంస్థ మెరుగైన ప్రదర్శన కనబరుస్తోంది. 2026 ఆర్థిక సంవత్సరంలో జియో ప్లాట్‌ఫామ్స్ పన్నుల అనంతరం లాభం ఏడాది ప్రాతిపదికన 15 శాతం పెరిగి రూ.30,053 కోట్లకు చేరింది. అలాగే వార్షిక ఆదాయం 14.5 శాతం పెరిగి రూ.1,46,885 కోట్లుగా నమోదైంది.
సంబంధిత వార్తలు

Jio Platforms IPO | జియో ఐపీఓకు సెబీ గ్రీన్ సిగ్నల్.. అతిపెద్ద లిస్టింగ్‌కు రంగం సిద్ధం..
ఆగస్టు 29, 2026

Reliance Industries | అంబానీ కీలక అడుగు.. రోల్స్ రాయిస్‌తో కలిసి ఫైటర్ జెట్ ఇంజిన్ల తయారీ..
ఆగస్టు 15, 2026

Jio IPO | జియో ఐపీఓకు గ్రీన్ సిగ్నల్.. సెబీకి డీఆర్‌హెచ్‌పీ దాఖలు.. భారత కార్పొరేట్ చరిత్రలో అతిపెద్ద ఐపీఓగా రికార్డు దిశగా..
జూన్ 19, 2026
తాజావార్తలు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
- ●Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో - కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
- ●India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!



