త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Hanuman Ansh | రెండు కోట్ల బ‌డ్జెట్ – 400 కోట్ల క‌లెక్ష‌న్స్ – తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ

బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మైథాల‌జీ మూవీ హ‌నుమాన్ అంశ్ తెలుగులోకి వ‌చ్చేస్తోంది. అక్టోబ‌ర్ 9న తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. త్రివిక్ర‌మ్ ఆద‌ర్శ కుటుంబం సినిమాకు పోటీగా హ‌నుమాన్ అంశ్ రిలీజ్ కానుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

N

Entertainment | Published On Oct 2, 2026, 4.17 pm IST

Hanuman Ansh | రెండు కోట్ల బ‌డ్జెట్ – 400 కోట్ల క‌లెక్ష‌న్స్ – తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ
Advertisement

Hanuman Ansh | బాలీవుడ్‌లో ఎలాంటి అంచ‌నాలు లేకుండా విడుద‌లై సంచ‌ల‌న విజ‌యాన్ని సాధించింది హ‌నుమాన్ అంశ్ మూవీ. స్టార్స్ ఎవ‌రూ లేకుండా కేవ‌లం రెండు కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన ఈ మైథాల‌జీ మూవీ ఏకంగా 400 కోట్ల వ‌సూళ్ల‌ను ద‌క్కించుకుంది. అత్య‌ధిక లాభాల‌ను తెచ్చిపెట్టిన ఇండియ‌న్ సినిమాగా రికార్డ్ క్రియేట్ చేసింది. హ‌నుమాన్ అంశ్ సినిమాకు విశాల్ చ‌తుర్వేది ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. శోభిన‌వ్ స‌త్య టైటిల్ పాత్ర‌లో క‌నిపించిన ఈ బాలీవుడ్ మూవీలో చంద‌న్ కే ఆనంద్‌, పూర్ణిమ తివారీ, అనిల్ ర‌స్తోగి కీల‌క పాత్ర‌లు పోషించారు.

ప‌ది ల‌క్ష‌ల‌ క‌లెక్ష‌న్స్‌...

రిలీజ్ టైమ్‌లో హ‌నుమాన్ ఆంశ్ మూవీని బాలీవుడ్ ఆడియెన్స్ పెద్ద‌గా ప‌ట్టించుకోలేదు. తొలిరోజు కేవ‌లం ప‌ది ల‌క్ష‌ల క‌లెక్ష‌న్స్ మాత్ర‌మే వ‌చ్చాయి. మౌత్ టాక్‌తో మెళ్ల‌మెళ్ల‌గా వ‌సూళ్లు పెరిగాయి. సినిమా థియేట‌ర్ల‌లోకి వ‌చ్చి రెండు నెల‌లు అవుతోన్న ఇప్ప‌టికీ హిందీలో హౌజ్‌ఫుల్ క‌లెక్ష‌న్స్‌తో ఆడుతోంది.

త్రివిక్ర‌మ్ రిలీజ్ చేయాల్సింది...

తాజాగా హ‌నుమాన్ అంశ్ మూవీ తెలుగులోకి రాబోతుంది అక్టోబ‌ర్ 9న తెలుగు వెర్ష‌న్ థియేట‌ర్ల‌లో విడుద‌ల కానున్న‌ట్లు మేక‌ర్స్ శుక్ర‌వారం ప్ర‌క‌టించారు. ఓ పోస్ట‌ర్‌ను అభిమానుల‌తో పంచుకున్నారు. తొలుత ఈ సినిమాను డైరెక్ట‌ర్ త్రివిక్ర‌మ్ తెలుగులో విడుద‌ల చేయాల‌ని అనుకున్నారు. కానీ బాలీవుడ్ నిర్మాత‌ల‌తో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా చివ‌రి నిమిషంలో ఆయ‌న ఈ సినిమా నుంచి త‌ప్పుకున్నారు. తాజాగా త్రివిక్ర‌మ్ ఆద‌ర్శ కుటుంబం సినిమాకు పోటీగా హ‌నుమాన్ అంశ్ థియేట‌ర్ల‌లోకి రాబోతుండ‌టం ఆస‌క్తిక‌రంగా మారింది.

క‌రోలీ బాబా బోధ‌న‌ల‌తో...

ప్ర‌ముఖ ఆధ్యాత్మిక గురువు నీమ్ క‌రోలీ బాబా జీవితం ఆధారంగా హ‌నుమాన్ అంశ్ మూవీ రూపొందింది. సాధార‌ణ పూజారిగా జీవితాన్ని మొద‌లుపెట్టిన ల‌క్ష్మినారాయ‌ణ శ‌ర్మ నీమ్ క‌రోలీ బాబాగా ఎలా మారాడు? దేవుడి కోసం సాగించిన ప్ర‌యాణంలో అత‌డికి ఎలాంటి నిజాలు తెలిశాయ‌నే అంశాల‌తో ఈ మూవీ రూపొందింది.

 

Advertisement
Advertisement