OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే – మలయాళం మూవీ హైలైట్
ఈ వారం ఓటీటీలో రొమాంటిక్ కామెడీ సినిమాలు ఎక్కువగా రిలీజయ్యాయి. మలయాళంలో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన బెత్లెహమ్ కుడుంబ యూనిట్ జియో హాట్ స్టార్ ద్వారా ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఈ మూవీతో పాటు ఈ వీక్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలు, సిరీస్‌లు ఏవంటే?
Entertainment | Published On Oct 2, 2026, 5.56 pm IST
ఈ వారం ఓటీటీలో సినిమాల జాతర నెలకొంది. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో కూడిన పలు సినిమాలు ఓటీటీ ప్రేక్షకుల ముందుకొచ్చాయి. శుక్రవారం ఒక్కరోజే ఇరవైకిపైగా సినిమాలు, వెబ్‌సిరీస్‌లు రిలీజయ్యాయి. వాటిలో మిస్ కాకుండా చూడాల్సినవి ఏవంటే?
నెట్‌ఫ్లిక్స్
రొమాంచకం
టాలీవుడ్ అగ్ర దర్శకుడు సందీప్ వంగా నిర్మాతగా వ్యవహరించిన తెలుగు మూవీ రొమాంచకం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. సుమంత్ ప్రభాస్, అనంతిక సనీల్ కుమార్ జంటగా నటించిన ఈ మూవీకి వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించాడు. కమర్షియల్‌గా ఈ మూవీ ఫెయిలైంది.
లవ్ వెబ్ సిరీస్ (తమిళ్)
ఓ మై డాగ్ (హిందీ)
డూయింగ్ లైఫ్ (ఇంగ్లీష్)
డెమాన్ స్లేయర్ (జపనీస్)
జియో హాట్‌స్టార్
బెత్లెహం కుడుంబ యూనిట్
మలయాళంలో అత్యధిక వసూళ్లను రాబట్టిన సినిమాగా బెత్లెహమ్ కుడుంబ యూనిట్ రికార్డ్ క్రియేట్ చేసింది. కేవలం 25 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా 300 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. నవీన్ పాల్, మమితా బైజు హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా జియో హాట్‌స్టార్‌లో రిలీజైంది. మలయాళంతో పాటు తెలుగులో స్ట్రీమింగ్ అవుతోంది.
బాంబే స్టోరీస్ ( హిందీ)
మెయిన్ లడేగా (హిందీ)
వార్ (ఇంగ్లీష్)
జీ5 ఓటీటీ
పూజా మేరీ జాన్
మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా నటించిన బాలీవుడ్ మూవీ పూజా మేరీ జాన్ థియేటర్లను స్కిప్ చేస్తూ నేరుగా జీ5 ఓటీటీలో రిలీజైంది. ఈ థ్రిల్లర్ మూవీలో హ్యుమా ఖురేషి మరో నాయికగా నటించింది.
మదర్ ప్రామిస్ (కన్నడ)
మడగాస్కర్ (ఇంగ్లీష్)
పంథడిక్కమ్ వెబ్‌సిరీస్ (మలయాళం)
అమెజాన్ ప్రైమ్ వీడియో
సర్దార్ 2 (తమిళ్)
కార్తి, మాళవికా మోహనన్, ఆషికా రంగనాథ్ నాయకానాయికలుగా నటించిన తమిళ మూవీ సర్ధార్ 2 అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అవుతోంది. థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమా రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చింది.
మహేంద్రగిరి వారాహి (తెలుగు)
సుమంత్ హీరోగా నటించిన మైథాలజీ థ్రిల్లర్ మూవీ మహేంద్రగిరి వారాహి తెలుగు ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. సిద్ధు జొన్నలగడ్డ, ఐశ్వర్య రాజేష్ గెస్ట్ పాత్రల్లో నటించిన ఈ సినిమాలో బ్రహ్మానందం విలన్‌గా కనిపించాడు.
ఆహా ఓటీటీ
ధూళ్‌పేట్ (తెలుగు)
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో – కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
అక్టోబర్ 2, 2026

Hanuman Ansh | రెండు కోట్ల బడ్జెట్ – 400 కోట్ల కలెక్షన్స్ – తెలుగులోకి బాలీవుడ్ బ్లాక్‌బస్టర్ మూవీ
అక్టోబర్ 2, 2026

Movie Review | డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ రివ్యూ – రాజమౌళి కొడుకు సినిమా ఎలా ఉందంటే?
అక్టోబర్ 2, 2026
తాజావార్తలు
- ●BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
- ●Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో - కొత్త హీరోయిన్‌తో రొమాన్స్

BMS Nanda Kishore | ఆటో డ్రైవర్లూ.. కనీస ఛార్జీ రూ.50 వసూలు చేయండి: బీఎంఎస్ పిలుపు

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే



