Auto charges | ఆటో ప్రయాణికులకు షాక్.. చార్జీల పెంపు.. కనీస చార్జ్ ఎంతంటే
Auto charges | తెలంగాణలో ఆటో రిక్షా ప్రయాణికులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఛార్జీలను (Auto fare) పెంచుతూ రవాణాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది.
Auto charges | త్రినేత్ర న్యూస్: తెలంగాణలో ఆటో రిక్షా ప్రయాణికులకు ప్రభుత్వం షాక్ ఇచ్చింది. ఛార్జీలను (Auto fare) పెంచుతూ రవాణాశాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆటో కనీస ఛార్జీ 1.6 కి.మీ వరకు రూ.30, కనీస ఛార్జీ తర్వాత ప్రతి కిలోమీటరుకు రూ.14గా నిర్ణయించారు. ఇక రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు ఒకటిన్నర శాతం అదనపు ఛార్జీలు వసూలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈమేరకు జీవో నంబర్ 46ను జారీ చేసింది.
ప్రయాణ సమయంలో ట్రాఫిక్ లేదా ఇతర కారణాల వల్ల ఆటో ఆగి ఉన్నప్పుడు నిమిషానికి 75 పైసల చొప్పున వెయిటింగ్ ఛార్జీని ఖరారు చేశారు. లగేజీకి సంబంధించి కూడా కొన్ని నిబంధనలను పొందుపరిచింది. సాధారణంగా ఉండే బ్రీఫ్‌కేస్, హ్యాండ్ బ్యాగ్‌లను ఉచితంగా తీసుకెళ్లవచ్చు. వీటి మినహా ఇతర పెద్ద ప్యాకేజీలు, లగేజీ ఉంటే వాటికి కిలోమీటరుకు 50 పైసల చొప్పున అదనపు ఛార్జీ వర్తిస్తుంది. ఆటోలో తీసుకెళ్లే లగేజీ గరిష్ఠ పరిమితిని 100 కిలోలుగా పరిమితం చేశారు.
అయితే 3 నెలల్లోపు ఆటో డ్రైవర్లు డిజిటల్ మీటర్లు ఏర్పాటు చేసుకోవాలని రవాణాశాఖ సూచించింది. పాత, కొత్త ఛార్జీల వివరాలు స్పష్టంగా తెలిసేలా ఆటోల్లో విధిగా ఫేర్ కార్డులను ప్రదర్శించాలని అధికారులు స్పష్టం చేశారు.
సెప్టెంబర్‌లో ప్రతిపాదనలు..
ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ గత ఆగస్టు 23 నుంచి ఆటోలు బంద్ చేయాలని రాష్ట్ర ఆటో, యాప్ ఆధారిత రవాణా సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వెల్లడించారు. దీంతో అదే నెల 22న రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కార్మికులతో చర్చలు జరిపారు. ఈ చర్చల్లో ఆటో కార్మికుల సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. దీంతో ఆటో కార్మికులు ప్రభుత్వం ముందు కొన్ని ప్రతిపాదనలు ఉంచారు. దీనిపై ఏర్పాటైన అధికారుల కమిటీ ఛార్జీల పెంపుపై సెప్టెంబర్ లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపగా తాజాగా ప్రభుత్వం ఆమోదం తెలపడంతో రవాణా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
తాజావార్తలు
- ●OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్
- ●Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..
- ●Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన
- ●Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!
- ●Naga Chaitanya | టైమ్ ట్రావెల్ లవ్‌స్టోరీలో అక్కినేని హీరో - కొత్త హీరోయిన్‌తో రొమాన్స్
- ●India-Pakistan Border | సరిహద్దులో కాల్పుల కలకలం.. ఇద్దరు చొరబాటుదారులు హతం

OTT Releases | ఈ వారం ఓటీటీలో రిలీజైన సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే - మలయాళం మూవీ హైలైట్

Jio Platforms IPO | ఇన్వెస్టర్లకు పండుగే.. రూ.37వేల కోట్ల జియో ఐపీవో.. రంగం సిద్ధం..

Students Protest Against Dipke | నీట్ అంశంపై ఎందుకు మౌనంగా ఉన్నారు..? అభిజీత్ దిప్కేకి వ్యతిరేకంగా విద్యార్థుల నిరసన

Asian Games 2026 | ఆసియా క్రీడల్లో బాక్సింగ్‌లో భారత్ గోల్డెన్ హ్యాట్రిక్.. అంకుశ్ పంచ్ అదుర్స్!






