Sai Pallavi | వాలెంటైన్స్ డే స్పెషల్ – నాగచైతన్య, సాయిపల్లవి మూవీ థియేటర్లలో రీ రిలీజ్
వాలెంటైన్స్ డే స్పెషల్‌గా నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన లవ్‌స్టోరీ మూవీ మరోసారి థియేటర్లలోకి రాబోతుంది. ఫిబ్రవరి 14న థియేటర్లలో రీ రిలీజ్ చేయబోతున్నారు.
Entertainment | Published On Jan 22, 2026, 6.26 pm IST
Sai Pallavi | టాలీవుడ్‌లో నాగచైతన్య, సాయిపల్లవిలది ( Sai Pallavi) మోస్ట్ సక్సెస్‌ఫుల్ కాంబో. వీరిద్దరి కలయికలో వచ్చిన లవ్‌స్టోరీ (Love Story), తండేల్ సూపర్ హిట్‌గా నిలిచాయి. థియేటర్లలో ఈ రెండు సినిమాలు వంద కోట్లకుపైగా వసూళ్లను రాబట్టాయి. తాజాగా వాలెంటైన్స్ డే కానుకగా లవ్‌స్టోరీ మూవీ మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఫిబ్రవరి 14న రీ రిలీజ్ కానుంది. ఈ విషయాన్ని నిర్మాతలు అఫీషియల్‌గా ప్రకటించారు. లవ్‌స్టోరీకి శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించాడు. కరోనా టైమ్‌లో 2021లో థియేటర్లలో రిలీజైన ఈ మూవీ అంచనాలకు మించి విజయాన్ని అందుకుంది. కేవలం 30 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా వంద కోట్ల కలెక్షన్స్ దక్కించుకుంది.
సామాజిక వివక్ష...
తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో దర్శకుడు శేఖర్ కమ్ముల ఈ సినిమాను తెరకెక్కించారు. ప్రేమకథ, సామాజిక వివక్ష లాంటి అంశాలకు ఓ సమకాలీన సమస్యను జోడించి హార్ట్ హిట్టింగ్ మూవీగా తెరకెక్కింది. లవ్‌స్టోరీకి పవన్ సీహెచ్ మ్యూజిక్ అందించారు. నాగచైతన్య, సాయిపల్లవి కాంబినేషన్‌లో వచ్చిన ఫస్ట్ మూవీ ఇదే కావడం గమనార్హం. శేఖర్ కమ్ముల కథతో పాటు నాగచైతన్య, సాయిపల్లవి కెమిస్ట్రీ, యాక్టింగ్ అభిమానులను ఆకట్టుకున్నాయి.
లవ్‌స్టోరీ కథ ఏంటంటే?
రేవంత్ (నాగచైతన్య) ఓ జుంబా సెంటర్‌ను నడుపుతుంటాడు. ఊళ్లోని కుల వివక్ష భరించలేక ఉన్నతంగా బతకాలని ఎన్నో కలలతో సిటీకి వస్తాడు. రేవంత్ ఊరికే చెందిన మౌనిక (సాయిపల్లవి) సాఫ్ట్‌వేర్ జాబ్ చేయడానికి సిటీకి వస్తుంది. చాలా ఉద్యోగ ప్రయత్నాలు చేసిన మౌనిక చివరకు రేవంత్ జుంబా సెంటర్‌లో డ్యాన్సర్‌గా చేరుతుంది. అనుకోకుండా ఇద్దరూ ప్రేమలో పడతారు? రేవంత్, మౌనిక ప్రేమకు కులం ఎలా అడ్డంకిగా నిలిచింది? పెద్దరికం పేరుతో మౌనిక బాబాయ్ ఎలాంటి ఎలాంటి అకృత్యాలకు పాల్పడ్డాడు అన్నదే లవ్‌స్టోరీ కథ.
ప్రస్తుతం వృషకర్మ షూటింగ్‌లో నాగచైతన్య బిజీగా ఉన్నాడు. మరోవైపు బాలీవుడ్‌లో ఎక్‌దిన్‌తో పాటు రామాయణ సినిమాల్లో నటిస్తోంది సాయిపల్లవి.
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్






