Web Series | సలార్ రాజు మిస్సింగ్ – మెగా బ్రదర్ రీఎంట్రీ .. కామెడీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ ఎందులో..ఎప్పుడంటే?
మెగా బ్రదర్ నాగబాబు ప్రధాన పాత్రలో మేము "కాప్"లం పేరుతో ఓ వెబ్‌సిరీస్ రూపొందింది. కామెడీ మిస్టరీ థ్రిల్లర్‌గా రూపొందిన ఈ సిరీస్ మే 22 నుంచి జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ కాబోతుంది. మేము "కాప్"లం వెబ్‌సిరీస్‌లో గెటప్ శ్రీను, రవితేజ, రీతూ చౌదరి కీలక పాత్రలు పోషిస్తున్నారు.
Entertainment | Published On May 14, 2026, 5.36 pm IST
Web Series | గత రెండేళ్లుగా పాలిటిక్స్‌తో బిజీగా ఉన్న మెగా బ్రదర్ నాగబాబు కొంత గ్యాప్ తర్వాత మళ్లీ ఓ వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. నాగబాబు ప్రధాన పాత్రలో మేము "కాప్"లం పేరుతో కామెడీ మిస్టరీ థ్రిల్లర్ వెబ్‌సిరీస్ రూపొందింది. మే 22 నుంచి జీ5 ఓటీటీలో ఈ వెబ్‌సిరీస్ స్ట్రీమింగ్ కాబోతుంది. ప్రదీప్ మద్దాలి దర్శకత్వం వహిస్తున్నఈ సిరీస్‌లో గెటప్ శ్రీను, రవితేజ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. మేము "కాప్"లం ట్రైలర్‌ను దిగ్గజ కమెడియన్ బ్రహ్మానందం రిలీజ్ చేశారు.
సలార్ రాజు కథతో...
కామెడీ, మిస్టరీ అంశాలతో ఈ ట్రైలర్ ఆసక్తిని పంచుతోంది. మహదేవపట్నం ఊరిలో జరిగే కథ ఇదని మేకర్స్ ఆరంభంలోనే చూపించారు. అయ్యగారు వారసుడొచ్చాడండోయ్.. అని పాలేరు అని అరిచి మరి చెబుతాడు. గజపతిరాజు ఆనందపడతాడు. సలార్‌రాజును తన వారసుడిగా ప్రకటిస్తాడు. అయితే అనుకోకుండా ఆ సలార్ రాజు కనిపించకుండా పోతాడు. దీంతో ఊరంతా గందరగోళంలో పడుతుంది. ఇంతకీ సలార్ రాజు ఎవరో కాదు.. కోళ్ల పందెల్లో పాల్గొనాల్సిన కోడిపుంజు. దీన్ని వెతకటానికి ఇద్దరు పోలీసులు(గెటప్ శీను, రవితేజ నన్నిమల) ఊళ్లోకి వస్తారు. సలార్ రాజు కనిపించకపోవటం వల్ల..ఎవరికి లాభం అనే కోణంలో పోలీసులు అన్వేషిస్తుంటారు. సలార్ రాజు సమస్య తో మొదలైన కథ ఊరి మొత్తాన్ని పెద్ద ప్రమాదంలో పడేస్తుంది. అదేమిటి? పోలీసులు దాన్ని ఎలా పరిష్కరించారు? సలార్ రాజు దొరికాడా? లేదా? అనే అంశాలతో ట్రైలర్ సాగింది.
గజపతిరాజు...
రైటర్ కమ్ డైరెక్టర్ బీవీఎస్ రవి, కౌముది నేమాని ఈ సిరీస్‌ను నిర్మిస్తున్నారు. శోభన్ చిట్టుప్రోలు కథను అందించారు. గ్రామీణ నేపథ్యంలో.... అక్కడి రోజువారీ జీవితాలు, స్థానిక రాజకీయాలు ఎలా ఉంటాయనే అంశాలతో మేము "కాప్"లం వెబ్ సిరీస్ రూపొందుతోంది. కోడి పందాల నేపథ్యంలో వచ్చే సీన్లు నవ్విస్తాయి. గజపతిరాజు పాత్రలో నాగేంద్రబాబు, మోహన్ సోటారిగా గెటప్ శీను, రవి సోటారి పాత్రలో రవితేజ క్యారెక్టర్లు ఈ సిరీస్‌కు హైలైట్‌గా ఉంటాయట. ఇందులో రీతూ చౌదరి, చరణ్ లక్కరాజు, సిరి పార్వతి, కిరీటి దామరాజు ఇతర కీలక పాత్రలు పోషించారు. సాకేత్ కోమండూరి మ్యూజిక్ అందించాడు.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



