త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Nabha Natesh | న‌భాన‌టేష్ మైథ‌లాజిక‌ల్ మూవీ నాగ‌బంధం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే – అన‌సూయ రోల్ ఇదేనా

న‌భాన‌టేష్ హీరోయిన్‌గా న‌టించిన మైథ‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మూవీ నాగ‌బంధం రిలీజ్ డేట్ ఫిక్స‌య్యింది. జూలై 3న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రాబోతుంది. విరాట్ క‌ర్ణ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో న‌భాన‌టేష్‌తో పాటు ఐశ్వ‌ర్య మీన‌న్ మ‌రో హీరోయిన్‌గా న‌టిస్తోంది.

N

Entertainment | Published On Mar 26, 2026, 3.40 pm IST

Nabha Natesh | న‌భాన‌టేష్ మైథ‌లాజిక‌ల్ మూవీ నాగ‌బంధం థియేట‌ర్ల‌లోకి వ‌చ్చేది అప్పుడే – అన‌సూయ రోల్ ఇదేనా
Advertisement

Nabha Natesh | తెలుగులో క‌మ‌ర్షియ‌ల్ స‌క్సెస్‌ కోసం గ‌త ఏడేళ్లుగా ఎదురుచూస్తోంది న‌భాన‌టేష్‌. రామ్ పోతినేని ఇస్మార్ట్ శంక‌ర్ త‌ర్వాత న‌భాన‌టేష్ చేసిన సినిమాల‌న్నీ బాక్సాఫీస్ వ‌ద్ద బోల్తా కొట్టాయి. ప్ర‌స్తుతం నాగ‌బంధంతో పాటు నిఖిల్ స్వ‌యంభూ సినిమాల్లో హీరోయిన్‌గా న‌టిస్తోంది న‌భాన‌టేష్‌. ఈ రెండు ... మైథ‌లాజిక‌ల్ కాన్సెప్ట్‌ల‌తోనే తెర‌కెక్కుతోండ‌టం గ‌మ‌నార్హం.

రిలీజ్ డేట్‌...

నాగ‌బంధం మూవీ రిలీజ్ డేట్‌ను మేక‌ర్స్ క‌న్ఫామ్ చేశారు. జూలై 3న ఈ మూవీ థియేట‌ర్ల‌లోకి రానున్న‌ట్లు ప్ర‌క‌టించారు. విరాట్ క‌ర్ణ హీరోగా న‌టిస్తోన్న ఈ సినిమాలో న‌భాన‌టేష్‌తో పాటు ఐశ్వ‌ర్య మీన‌న్ మ‌రో హీరోయిన్‌గా క‌నిపించ‌బోతున్న‌ది. గురువారం రిలీజ్ చేసిన కొత్త పోస్ట‌ర్‌లో రెండు డిఫ‌రెంట్ లుక్‌ల‌లో హీరో విరాట్ క‌ర్ణ క‌నిపించారు. చేతిలో త్రిశూలంతో మ‌హాశివుడిని త‌ల‌పించేలా ఓ లుక్ సాగ‌గా...మ‌రో గెట‌ప్‌లో కంప్లీట్ మోడ్ర‌న్‌గా ఉండ‌టం ఆస‌క్తిని పంచుతోంది. పౌరాణిక కాలానికి, ఆధునిక యుగానికి మ‌ధ్య సంఘ‌ర్ష‌ణ‌తో మైథ‌లాజిక‌ల్ అడ్వెంచ‌ర్ థ్రిల్ల‌ర్‌గా నాగ‌బంధం మూవీ రూపొందుతోంది.

అనంత‌ప‌ద్మ‌నాభ స్వామి ఆల‌యం...

తిరువనంతపురంలోని శ్రీ పద్మనాభస్వామి ఆలయంలోని రహస్య గ‌దికి కాప‌లాగా నాగ‌బంధం ఉంటుంది. ఆ బంధాన్ని తెంచి గుడిలోని సంప‌ద‌ను దోచుకోవాల‌ని అనుకున్న దుష్ట‌శ‌క్తుల‌ను దేవుడు ఎలా ఎదుర్కొన్నాడ‌నే అంశాల‌తో నాగ‌బంధం ఉండ‌బోతున్న‌ట్లు స‌మాచారం.

యాంక‌ర్ అన‌సూయ‌...

నాగ‌బంధం సినిమాలో పార్వ‌తి అనే పాత్ర‌లో న‌భాన‌టేష్ న‌టిస్తోంది. నెగెటివ్‌, పాజిటివ్ షేడ్స్ క‌ల‌బోత‌గా మిస్ట‌రీయ‌స్‌గా ఆమె క్యారెక్ట‌ర్ సాగుతుంద‌ట‌. చాలా స‌ర్‌ప్రైజింగ్ ఎలిమెంట్స్‌తో కూడి ఉంటుంద‌ని అంటున్నారు.
ఈ సినిమాలో యాంక‌ర్ అన‌సూయ  విలన్ గా కీల‌క పాత్ర‌లో న‌టించ‌బోతున్న‌ట్లు మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. ఆమెతో పాటు జ‌గ‌ప‌తిబాబు, గుర‌డ రామ్‌, మ‌హేష్ మంజ్రేక‌ర్‌తో పాటు ప‌లువురు సీనియ‌ర్ యాక్ట‌ర్లు కీల‌క పాత్ర‌లు పోషిస్తున్నారు. ఇటీవ‌లే ఈ మూవీ ట్రైల‌ర్‌తో పాటు న‌మోరే అనే సాంగ్‌ను రిలీజ్ చేశారు. దాదాపు 50 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందుతోన్న ఈ సినిమాకు అభిషేక్ నామా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

నిఖిల్ స్వ‌యంభూ...

నాగ‌బంధంతో పాటు నిఖిల్ స్వ‌యంభూలో న‌భాన‌టేష్ హీరోయిన్‌గా న‌టిస్తోంది. హిస్టారిక‌ల్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌గా ఈ సినిమా రూపొందుతోంది. ఈ రెండు సినిమాల‌పై న‌భాన‌టేష్ భారీగా ఆశ‌లు పెట్టుకుంది. నాగ‌బంధం, స్వ‌యంభూ సినిమాల‌తో విజ‌యాల‌ను అందుకొని టాలీవుడ్‌లో మ‌ళ్లీ బిజీగా మారాల‌ని ఆశ‌ప‌డుతోంది.

Advertisement

తాజావార్తలు

Advertisement