Nabha Natesh | యాక్సిడెంట్ వల్ల ఏడాదిన్నర సినిమాలకు దూరం – సినిమా కోసం వెజిటేరియన్‌గా మారా – నభానటేష్ కామెంట్స్
నాగబంధం సినిమాలో డిఫరెంట్ వేరియేషన్స్‌తో కూడిన పాత్ర చేస్తోన్నట్లు నభానటేష్ చెప్పింది. ఈ క్యారెక్టర్ కోసం రెడీ కావడానికి ప్రతిరోజు రెండు గంటలు టైమ్ పట్టేదని అన్నది.
Entertainment | Published On Jun 29, 2026, 8.03 pm IST
Nabha Natesh | ఓ యాక్సిడెంట్ కారణంగా తెలుగు సినిమాలకు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకోవాల్సివచ్చిందని హీరోయిన్ నభానటేష్ అన్నది. నాగబంధంతో పాటు స్వయంభూ సినిమాలతో మళ్లీ టాలీవుడ్‌లో బిజీ అవుతాననే నమ్మకముందని చెప్పింది. నభానటేష్ హీరోయిన్‌గా నటించిన నాగబంధం మూవీ జూలై 3న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా విశేషాలతో పాటు తన కెరీర్ గురించి నభానటేష్ చెప్పిన సంగతులివి...
వేద విద్యార్థినిగా...
నాగబంధంలో పార్వతి అనే వేద విద్యార్థినిగా కనిపిస్తా. కుటుంబం....ప్రేమ కోసం ఎంతదూరమైన వెళ్లే ఎమోషనల్ స్ట్రాంగ్ క్యారెక్టర్ చేస్తున్నా. కథలో నా పాత్ర చాలా కీలకంగా ఉంటుంది. నా క్యారెక్టర్‌లోని వేరియేషన్స్ ఆడియెన్స్‌ను సర్‌ప్రైజ్ చేస్తాయి. పార్వతి పాత్ర కోసం రెడీ కావడానికి ప్రతిరోజు రెండు గంటలు పట్టేది. కాస్ట్యూమ్స్ విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకున్నారు మేకర్స్. కెరీర్‌లో ఇలాంటి సినిమాలు చేసే ఛాన్స్ చాలా అరుదుగా వస్తుంది.
5000 మంది డ్యాన్సర్లతో...
ఈ సినిమాలోని నమోరే సాంగ్ చేయడం డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్‌ను ఇచ్చింది. దాదాపు 5,000 మంది డ్యాన్సర్లతో ఈ పాటను షూట్ చేశారు డైరెక్టర్. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ అందించారు. క్లాసికల్ డాన్స్ టచ్‌తో వెరైటీగా ఈ సాంగ్ ఉంటుంది. డాన్స్ సాంగ్ మాత్రమే కాదు... అందులో భక్తి భావం కూడా కనిపించేలా కొరియోగ్రఫీ అందించారు. బృందావనంలో గోపికలంతా కలిసి ఆనందంగా వేడుక చేసుకుంటే ఎలా ఉంటుందో, ఆ సెట్లో పాట చిత్రీకరణ సమయంలో కూడా అలాంటి అనుభూతే కలిగింది.
ప్రతి రోజు పూజలు...
నాగబంధం కోసం అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్ వేశారు. నిజంగానే ఆలయంలోకి వెళ్లిన అనుభూతిని కలిగిస్తుంది. అనంత పద్మనాభస్వామి ఆలయ సెట్‌లో షూటింగ్ చేస్తున్నప్పుడు అందరం నియమనిష్టలతో ఉన్నాం. పూర్తిగా వెజిటేరియన్లుగా మారిపోయాం. ప్రతిరోజూ పూజలు చేసిన తర్వాతే షూటింగ్ ప్రారంభించేవాళ్లం. గ్రాండ్ సెట్స్ మరో పది వరకు సినిమాలో ఉంటాయి. కథపై నమ్మకంతో 110 కోట్ల బడ్జెట్‌తో మేకర్స్ ఎక్కడ రాజీపడకుండా ఈ సినిమాను నిర్మించారు.
యాక్సిడెంట్ కారణంగా....
ఇస్మార్ట్ శంకర్ సక్సెస్‌తో తెలుగులో చాలా ఆఫర్లు వచ్చాయి. కెరీర్ హ్యాపీగా సాగిపోతున్న టైమ్‌లోనే ఒక చిన్న యాక్సిడెంట్ జరిగింది. భుజానికి పెద్ద గాయం అయింది. ఆ యాక్సిడెంట్ కారణంగా సినిమాలకు ఏడాదిన్నర పాటు బ్రేక్ తీసుకున్నా. మళ్లీ ఫిజికల్‌గా, మెంటల్‌గా పూర్తిగా స్ట్రాంగ్‌గా ఉన్నప్పుడే సినిమాలు చేయాలనుకున్నా. స్క్రీన్‌పై ఎనర్జీతో కనిపించినప్పుడే పాత్రకు న్యాయం చేయగలనని నేను భావిస్తాను. అందుకే గాయం నుంచి పూర్తిగా కోలుకున్న తర్వాతే మళ్లీ కెమెరా ముందుకొచ్చాను. ప్రస్తుతం నాగబంధంతో నిఖిల్ స్వయంభూలో హీరోయిన్‌గా నటిస్తున్నాం. హిస్టారికల్ యాక్షన్‌గా ఈ మూవీ తెరకెక్కబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Ntr | అఫీషియల్ – ఒకే ఆయుధం…ఒకే లక్ష్యం – ఎన్టీఆర్, త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ పోస్టర్ ట్రెండింగ్
జూన్ 29, 2026

Sreeleela | యూట్యూబ్‌లో చరిత్రను సృష్టించిన మహేష్‌బాబు ,శ్రీలీల తెలుగు సాంగ్ – 800 మిలియన్ల వ్యూస్‌తో రికార్డ్
జూన్ 29, 2026

Movie Teaser | పొలిటికల్ లీడర్‌గా డిస్కో శాంతి కొడుకు – స్టూడెంట్ టీజర్ రిలీజ్
జూన్ 28, 2026
తాజావార్తలు
- ●IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు
- ●Ram Pothineni | మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని - ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ
- ●Prostitution Racket Busted | ముంబయిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు హీరోయిన్లను కాపాడిన పోలీసులు
- ●Vasudeva Reddy | సీఎం కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తా
- ●Telangana Rice Exports | తెలంగాణ బియ్యానికి గ్లోబల్ డిమాండ్: ఎగుమతులపై సర్కార్ స్పెషల్ ఫోకస్.. మంత్రి ఉత్తమ్ కీలక ప్రకటన
- ●New Pensions | కొత్త పెన్షన్లు.. లేనట్టేనా?

IPS Transfers | తెలంగాణలో 12 ఐపీఎస్‌ల బదిలీ.. పలువురికి అదనపు బాధ్యతలు

Ram Pothineni | మెగా ఫోన్ పట్టిన రామ్ పోతినేని - ఓపెనింగ్ రోజే షూటింగ్ షురూ

Prostitution Racket Busted | ముంబయిలో హై ప్రొఫైల్ వ్యభిచార ముఠా గుట్టురట్టు.. ఇద్దరు హీరోయిన్లను కాపాడిన పోలీసులు

Vasudeva Reddy | సీఎం కనిపిస్తే చెంప చెల్లుమనిపిస్తా



