Nabha Natesh | నభా నటేష్ డబుల్ ట్రీట్ – ఏడేళ్ల కల తీరనుందా?
నభానటేష్ హీరోయిన్‌గా నటిస్తున్న నాగబంధం, స్వయంభూ సినిమాలు ఈ సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ రెండు సినిమాల్లో నభానటేష్ డిఫరెంట్ రోల్స్ చేస్తోంది. ఈ సినిమాలతో ఇస్మార్ట్ బ్యూటీ టాలీవుడ్‌లో కమ్‌బ్యాక్ ఇవ్వడం ఖాయమని అంటున్నారు.
Entertainment | Published On Feb 21, 2026, 8.48 pm IST
Nabha Natesh | టాలీవుడ్‌లో మంచి హిట్టు కోసం చాలా కాలంగా ఎదురుచూస్తోంది నభానటేష్. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ తర్వాత నభానటేష్ చేసిన సినిమాలేవి ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. రవితేజ, సాయిధరమ్‌తేజ్ వంటి స్టార్స్‌తో సినిమాలు చేసినా లక్కు మాత్రం కలిసి రాలేదు. విజయం కోసం ఏడేళ్లుగా నిరీక్షిస్తున్న నభానటేష్ కల ఈ ఏడాది తీరేలానే కనిపిస్తోందని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.
రెండు సినిమాలు...
ప్రస్తుతం నభానటేష్ తెలుగులో నిఖిల్ స్వయంభూతో పాటు నాగబంధం సినిమాలు చేస్తోంది. ఈ రెండు పాన్ ఇండియన్ సినిమాలు హిస్టారికల్ కాన్సెప్ట్‌లతోనే తెరకెక్కాయి. రెండు సినిమాల్లో నభానటేష్ లుక్, క్యారెక్టరైజేషన్స్ డిఫరెంట్‌గా ఉన్నాయి. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న పవర్‌ఫుల్ రోల్స్‌లో నభా నటేష్ కనిపించబోతున్నది. నాగబంధంలో పార్వతి అనే పాత్రలో నభానటేష్ నటిస్తోంది. ఇటీవల ఆమె ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో పాము టాటూలతో మిస్టరీయిస్‌గా ఆమె క్యారెక్టర్ ఉండబోతున్నట్లు సమాచారం. స్వయంభూలో సుందరవల్లి అనే యువరాణిగా నటిస్తోంది. కంప్లీట్ క్లాసీగా ఆమె పాత్రను మేకర్స్ డిజైన్ చేశారు.
సమ్మర్‌లో రిలీజ్...
నాగబంధం, స్వయంభూ సినిమాలు సమ్మర్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అటు ఇటుగా నెల రోజుల గ్యాప్‌లో థియేటర్లలో సందడి చేయనున్నాయి. ఈ సినిమాలతో నభానటేష్‌కు హిట్టు దక్కడం ఖాయమనే టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. నాగబంధం, స్వయంభూ రిలీజ్‌ల కోసం తాను ఎగ్జైటింగ్‌గా ఎదురుచూస్తున్నట్లు నభా నటేష్ చెప్పింది. స్వంయభూ సినిమాలో నిఖిల్ హీరోగా నటిస్తున్నాడు. నాగబంధంలో విరాట్ కర్ణ కథానాయకుడిగా కనిపించబోతున్నాడు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



