Mrunal Thakur | ఐటెంసాంగ్‌కు మృణాల్ గ్రీన్‌సిగ్నల్ … ఒక్క పాటకు అన్ని కోట్లా? … గట్టిగానే డిమాండ్ చేసిందిగా!
పెద్ది సినిమాలో ఐటెంసాంగ్‌లో నటించే బ్యూటీ ఎవరన్నది టాలీవుడ్ ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. పూజా హెగ్డే, తమన్నా, ఆయేషాఖాన్‌తో పాటు పలువురు ముద్దుగుమ్మల పేర్లు వినిపించాయి. తాజాగా ఐటెంసాంగ్ కోసం హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌ను మేకర్స్ ఫైనల్ చేసినట్లు వార్తలు టాక్ వినిపిస్తోంది.
Entertainment | Published On Mar 22, 2026, 2.48 pm IST
Mrunal Thakur | దక్షిణాదిలో స్పెషల్ సాంగ్స్‌కు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. మాస్ సినిమా అంటే ఐటెంసాంగ్ ఖచ్చితంగా ఉండాల్సిందే. అందులోనూ స్టార్ హీరో సినిమాలో ఐటెంసాంగ్ ఉందంటే దాని గురించి గట్టిగానే చర్చ నడుస్తుంది. స్టార్ హీరోతో చిందేసే బ్యూటీ ఎవరు? ఆ సాంగ్ బడ్జెట్, సింగర్స్ ఎవరు...ప్రతీదీ హాట్‌టాపిక్‌గా నిలుస్తుంటాయి. ప్రస్తుతం పెద్ది విషయంలో అభిమానుల్లో అలాంటి ఆసక్తే నెలకొంది. ఈ సినిమాలోనూ ఓ స్పెషల్ సాంగ్ ఉందట. ఈ పాటలో నటించే బ్యూటీ ఎవరన్నది ఉత్కంఠను రేకెత్తిస్తోంది. తమన్నా, పూజా హెగ్డే, అయేషా ఖాన్...ఇలా చాలా మంది పేర్లు ప్రచారంలోకి వచ్చాయి. కానీ వారందరిని కాదని మృణాల్ ఈ అవకాశాన్ని దక్కించుకుందట.
జాన్వీకపూర్ కూడా...
ఏప్రిల్ ఫస్ట్ వీక్‌లో హైదరాబాద్‌లోనే భారీ సెట్‌లో రామ్‌చరణ్, మృణాల్ ఠాకూర్‌లపై ఈ స్పెషల్ సాంగ్‌ను షూట్ చేయబోతున్నారట. ఈ పాటలో జాన్వీకపూర్ కూడా కనిపించబోతున్నట్లు సమాచారం. కెరీర్‌లో మృణాల్ ఠాకూర్ చేయనున్న ఫస్ట్ ఐటెంసాంగ్ ఇదే.
రెమ్యూనరేషన్....
ఈ సాంగ్ కోసం మృణాల్ ఠాకూర్ గట్టిగానే రెమ్యూనరేషన్ అందుకోనున్నట్లు చెబుతున్నారు. రెండు కోట్లు డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. బాలీవుడ్‌తో పాటు దక్షిణాదిలోనూ మృణాల్‌కు ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని ఆమె అడిగినంత మొత్తాన్ని మేకర్స్ ఇవ్వడానికి రెడీ అయినట్లు చెబుతోన్నారు.ఇప్పటివరకు పెద్ది నుంచి రిలీజైన చికిరి, రై రై పాటలు మ్యూజిక్ లవర్స్‌ను మెప్పించాయి. వాటికి ఏ మాత్రం తగ్గకుండా ఈ స్పెషల్ సాంగ్ ఉంటుందని అంటున్నారు.
మార్చి 27న అనుకున్నారు కానీ...
స్పోర్ట్స్ యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న పెద్ది మూవీకి బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్నాడు. శివరాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకు ఆస్కార్ విన్నర్ ఏఆర్ రెహమాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.
రామ్‌చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న ఈ సినిమాను రిలీజ్ చేయాలని అనుకున్నారు. కానీ షూటింగ్ ఆలస్యం కావడంతో ఏప్రిల్ 30కి ఈ సినిమా వాయిదాపడింది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



