Yellamma Movie | ఎల్లమ్మకు జోడీ దొరికిందా? – టాప్ హీరోయిన్లు రిజెక్ట్ చేసిన సినిమాలో సీతారామం బ్యూటీ
బలగం వేణు ఎల్లమ్మలో హీరోయిన్ ఎవరనే సస్పెన్స్‌కు తెరపడినట్లు సమాచారం. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్‌కు జోడీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా ఎంపికైనట్లు సమాచారం.
Entertainment | Published On May 7, 2026, 11.09 am IST
Yellamma Movie | ఎల్లమ్మ హీరోయిన్ కష్టాలకు చెక్ పడినట్లు సమాచారం. కథానాయిక కోసం మేకర్స్ సాగించిన అన్వేషణ ఎట్టకేలకు ఫలించినట్లు టాక్ వినిపిస్తోంది. ఎల్లమ్మ మూవీతో టాలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ హీరోగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. బలగంతో సెన్సేషనల్ హిట్‌ను అందుకున్న వేణు ఎల్దండి దర్శకత్వం వహిస్తున్నారు. తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఓ వెనుక బడిన కులానికి చెందిన డప్పు వాయిద్య కళాకారుడి జీవితం నేపథ్యంలో రా అండ్ రస్టిక్‌గా ఎల్లమ్మ తెరకెక్కుతోన్నట్లు సమాచారం.
సాయిపల్లవి, కీర్తి సురేష్....
ఎల్లమ్మకు హీరో, టెక్నీషియన్లు, ప్రొడ్యూసర్‌తో పాటు అన్ని కుదిరాయి. కానీ హీరోయిన్ మాత్రం ఫైనలైజ్ కాలేదు. ఈ సినిమాలో హీరోయిన్‌గా కీర్తి సురేష్, సాయిపల్లవితో పాటు పలువురు టాప్ హీరోయిన్ల పేర్లు వినిపించాయి. కానీ డేట్స్ ఇష్యూతో పాటు ఇతర కారణాల వల్ల అగ్ర నాయికలు ఎల్లమ్మను రిజెక్ట్ చేశారు. ఒకానొక దశలో భాగ్యశ్రీ బోర్సే ఫైనల్ అంటూ వార్తలొచ్చాయి. కానీ అవి రూమర్లుగానే తేలిపోయాయి.
డీ గ్లామర్ రోల్...
చివరకు ఈ సినిమాలో హీరోయిన్‌గా సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్‌ను మేకర్స్ ఫైనల్ చేశారట. యాక్టింగ్‌కు స్కోప్ ఉన్న డీ గ్లామర్ రోల్ కావడంతోనే మేకర్స్ మృణాల్‌ను హీరోయిన్‌గా సెలెక్ట్ చేసినట్లు వార్తలొస్తున్నాయి. ఈ సినిమాలో హీరోహీరోయిన్ల లవ్ స్టోరీ, కెమిస్ట్రీ చాలా డిఫరెంట్‌గా ఉండబోతుందని అంటున్నారు.
రెమ్యూనరేషన్...
కాగా ఎల్లమ్మ కోసం మృణాల్ ఠాకూర్ భారీగానే రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు ప్రచారం జరుగుతోంది. రెండున్నర నుంచి మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు వార్తలొస్తున్నాయి. త్వరలోనే ఎల్లమ్మ సెట్స్‌లో మృణాల్ అడుగుపెట్టబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది.
డెకాయిట్ తర్వాత....
ఎల్లమ్మలో హీరోగా నటిస్తూనే ఈ సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు దేవిశ్రీప్రసాద్. దిల్‌రాజు నిర్మిస్తున్నారు. కాగా ఇటీవలే డెకాయిట్ మూవీతో ప్రేక్షకుల ముందుకొచ్చింది మృణాల్ ఠాకూర్. అడివి శేష్ హీరోగా యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ మూవీకి మంచి సినిమాగా పేరొచ్చిన నిర్మాతలకు మాత్రం నష్టాలనే మిగిల్చింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



