Mrunal Thakur | డబ్బు కోసం సినిమాలు చేయడం లేదు – మృణాల్ ఠాకూర్ కామెంట్స్ వైరల్
డబ్బు కోసమే తెలుగులో సినిమాలు చేస్తోందంటూ మృణాల్ ఠాకూర్‌పై గత కొద్ది కాలంగా విమర్శలు వినిపిస్తున్నాయి. బాలీవుడ్‌తో పోలిస్తే తెలుగు సినిమాల కోసం డబుల్ రెమ్యూనరేషన్‌ను మృణాల్ డిమాండ్ చేస్తుందంటూ ప్రచారం జరుగుతోంది. ఈ రూమర్లపై మృణాల్ రియాక్ట్ అయ్యింది.
Entertainment | Published On Apr 12, 2026, 12.07 pm IST
Mrunal Thakur | ఇటీవలే డెకాయిట్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చింది మృణాల్ ఠాకూర్. యాక్షన్ లవ్‌స్టోరీగా తెరకెక్కిన ఈ సినిమాలో సరస్వతిగా ఎమోషనల్ రోల్‌లో నాచురల్ యాక్టింగ్‌తో మెప్పించింది. ఓ చిన్నారికి తల్లిగా, దొంగగా మల్టీపుల్ షేడ్స్‌తో కూడిన క్యారెక్టర్‌లో మృణాల్ చూపించిన వేరియేషన్స్‌కు ఆడియెన్స్ ఫిదా అవుతోన్నారు. కలెక్షన్స్ పరంగా డెకాయిట్ అదరగొడుతోంది. రెండు రోజుల్లోనే 28 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. కాగా రెమ్యూనరేషన్ కోసమే మృణాల్ తెలుగులో సినిమాలు చేస్తోందంటూ కొన్నాళ్లుగా విమర్శలొస్తున్నాయి. బాలీవుడ్‌లో ఒక్కో సినిమాకు రెండు నుంచి మూడు కోట్ల వరకు పారితోషికం తీసుకుంటున్న మృణాల్...తెలుగులో మాత్రం ఐదు కోట్ల వరకు డిమాండ్ చేస్తోన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. డెకాయిట్ కోసం కూడా మృణాల్ భారీగానే రెమ్యూనరేషన్ అందుకుందని అంటున్నారు.
అతి తక్కువ రెమ్యూనరేషన్...
ఈ రూమర్లపై డెకాయిట్ ప్రమోషన్స్‌లో మృణాల్ రియాక్ట్ అయ్యింది. డబ్బు కోసం తాను సినిమాలు చేయడం లేదని అన్నది. "నా కెరీర్‌లో డెకాయిట్ కోసమే అతి తక్కువగా రెమ్యూనరేషన్ తీసుకున్నా. మేకర్స్ నన్ను అప్రోచ్ అయినప్పుడే లిమిటెడ్ బడ్జెట్‌లోనే ఈ సినిమా చేస్తున్నామని అన్నారు. కథ వినగానే చాలా నచ్చేసింది. సరస్వతి పాత్ర నటిగా నాకో ఛాలెంజ్‌గా అనిపించింది. రెమ్యూనరేషన్ గురించి ఆలోచించకుండా ఈ సినిమాకు ఓకే చెప్పేశా. గత సినిమాలతో కంపేర్ చేస్తే చాలా తక్కువే ఈ సినిమా కోసం అందుకున్నా. ఓ సినిమా ద్వారా ఎంత డబ్బు సంపాదించాను అన్నదానికంటే నా నటనతో ఎంత మంది ప్రేక్షకుల మనసులు గెలుచుకోగలిగాను అన్నదే నాకు ముఖ్యం" అని అన్నది మృణాల్ ఠాకూర్.
శృతి హాసన్ ఫస్ట్ ఛాయిస్...
హాయ్ నాన్న తర్వాత టాలీవుడ్‌కు రెండేళ్లు దూరమైంది మృణాల్ ఠాకూర్. ఈ గ్యాప్‌లో కొన్ని కథలు విన్నదట. కానీ అవేవీ తన మనసుకు నచ్చలేదని చెప్పింది. డెకాయిట్‌లో హీరోయిన్‌గా మృణాల్ ఫస్ట్ ఛాయిస్ కాదు. తొలుత శృతిహాసన్‌ను మేకర్స్ ఫైనల్ చేశారు. కానీ డేట్స్ ఇష్యూతో పాటు క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా శృతి హాసన్ ఈ సినిమా నుంచి తప్పుకుంది. ఆమె స్థానంలో మృణాల్‌ను తీసుకున్నారు.
డెకాయిట్ తర్వాత తెలుగులో అల్లు అర్జున్‌తో రాకా సినిమా చేస్తోంది మృణాల్ ఠాకూర్. బాలీవుడ్‌లో మరో రెండు సినిమాలతో బిజీగా ఉంది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



