Pooja Hegde | గ్లామర్‌తో రెచ్చిపోయిన పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ – బాలీవుడ్ మూవీపై ట్రోల్స్
స్టార్ హీరోయిన్లు పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ ఒకే సినిమాతో ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నారు. వీరిద్దరు హీరోయిన్లుగా నటించిన బాలీవుడ్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై ఫస్ట్ లుక్ వీడియోను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ వీడియోలో అందాల ఆరబోతలో మృణాల్, పూజా హెగ్డే పోటీపడ్డారు.
Entertainment | Published On Apr 14, 2026, 2.09 pm IST
Pooja Hegde | పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ హీరోయిన్లుగా నటిస్తున్న బాలీవుడ్ మూవీ హై జవానీ తో ఇష్క్ హోనా హై (Hai Jawani Toh Ishq Hona Hai) రిలీజ్ డేట్ మరోసారి మారింది. అనుకున్న తేదీ కంటే ముందుగానే ఈ మూవీ థియేటర్లలో సందడి చేయబోతుంది. వరుణ్ ధావన్ హీరోగా రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతోన్న ఈ సినిమాను తొలుత జూన్ 4న రిలీజ్ చేయాలని భావించారు. అనుకోకుండా యశ్ టాక్సిక్ అదే డేట్‌కు బాక్సాఫీస్ బరిలో నిలవడంతో జూన్ 12కుఈ బాలీవుడ్ మూవీ రిలీజ్ డేట్‌ను ఛేంజ్ చేశారు. తాజాగా హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాను ప్రీ పోన్ చేశారు. జూన్ 12న కాకుండా ఇరవై రోజుల ముందుగానే మే 22నే ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు.
అందాల ఆరబోతలో పోటీ...
కొత్త రిలీజ్ డేట్‌తో పాటు ఈ సినిమా ఫస్ట్ లుక్ వీడియోను మంగళవారం రిలీజ్ చేశారు. ఈ ఫస్ట్ లుక్ వీడియోలో గ్లామర్‌తో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ రెచ్చిపోయారు. అందాల ఆరబోతలో పోటీపడ్డారు. ఇద్దరు చిన్నారుల సంభాషణతో ఆసక్తికరంగా ఈ వీడియో మొదలైంది. ఆ చిన్నారుల తండ్రి ఒక్కరే...కానీ తల్లులు వేర్వేరు అని చూపించారు. జస్ (వరుణ్ ధావన్) అనే యువకుడితో...బానీ (మృణాల్ ఠాకూర్), ప్రీత్ ( పూజా హెగ్డే)లు ప్రేమలో పడటం... ఈ ముగ్గురి మధ్య రొమాంటిక్ సన్నివేశాలతో ఎంటర్‌టైనింగ్‌గా ఈ వీడియో సాగింది. డబుల్ ట్రబుల్ లవ్‌స్టోరీ అంటూ చివరలో చిన్నారులు చెప్పే డైలాగ్ ఆకట్టుకుంటోంది.
రీమేక్ అంటూ రూమర్లు....
హై జవానీ తో ఇష్క్ హోనా హై ఫస్ట్ లుక్ వీడియోపై మిక్స్‌డ్ టాక్ వస్తోంది. గోవిందా హీరోగా నటించిన శాండ్‌విచ్ సినిమాకు ఫ్రీమేక్‌లా హై జవానీ తో ఇష్క్ హోనా హై ఉందంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతోన్నారు. 2006లో వచ్చిన శాండ్‌విచ్ మూవీలో ఒకరికి తెలియకుండా మరొకరిని పెళ్లి చేసుకొని ఇద్దరు భార్యల మధ్య గోవిందా ఎలా నలిగిపోయాడనే అంశాలతో సాగుతుంది. హై జవానీ తో ఇష్క్ హోనా హై కథ కూడా అదే పాయింట్‌తో తెరకెక్కినట్లు కనిపిస్తోందని అంటున్నారు.
హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాకు డేవిడ్ ధావన్ దర్శకత్వం వహిస్తున్నాడు. వరుణ్ ధావన్, డేవిడ్ ధావన్ కాంబినేషన్‌లో వస్తోన్న నాలుగో సినిమా ఇది. మృణాల్ ఠాకూర్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో వస్తోన్న ఫస్ట్ సినిమా ఇది.
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Pooja Hegde | చిక్కుల్లో పూజా హెగ్డే, మృణాల్ ఠాకూర్ బాలీవుడ్ మూవీ – లీగల్ సమస్యలతో ట్రైలర్ రిలీజ్ క్యాన్సిల్
మే 21, 2026

Sai Pallavi | పాపం సాయిపల్లవి… రామాయణ డైరెక్టర్ అంత మాట అనేశాడేంటి?
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



