Mrunal Thakur | కన్నీళ్లు పెట్టుకున్న మృణాల్ ఠాకూర్ – కల నిజమైందంటూ ఎమోషనల్ పోస్ట్
మృణాల్ ఠాకూర్ ఇన్‌స్టాగ్రామ్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. సోదరుడు మందార్ ఠాకూర్ గ్రాడ్యూయేషన్ వేడుకల్లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నది. తమ్ముడి డిగ్రీ పట్టా చూడగానే ఎమోషనల్ అయిన మృణాల్ కన్నీళ్లు పెట్టుకుంది.
Entertainment | Published On Jun 23, 2026, 3.49 pm IST
Mrunal Thakur | సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. తన కలనిజమైందంటూ కన్నీళ్లు పెట్టుకుంది. మృణాల్ సోదరుడు మందార్ ఠాకూర్ విదేశాల్లో ఉన్నత విద్యను పూర్తిచేసుకున్నాడు. సోదరుడి గ్రాడ్యుయేషన్ వేడుకల్లో మృణాల్ ఠాకూర్ పాల్గొన్నది. ఈ వేడుక తాలూకు వీడియోను అభిమానులతో పంచుకుంది. ఈ సంతోషకర క్షణాల గురించి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టింది. నిన్ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ తమ్ముడిపై ప్రశంసలు కురిపించింది. "నాకున్న అతి పెద్ద కలల్లో ఒకటి నిజమైంది. జీవితంలోనే అత్యంత ఆనందమైన క్షణాలివి. ఈ గ్రాడ్యుయేషన్ సెలబ్రేషన్స్ చూస్తుంటే నువ్వో హీరోలా...నీ సినిమాలో నేను చిన్న పాత్రలో భాగమైన అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ ఈ రోజును మర్చిపోలేను" అంటూ పోస్ట్ పెట్టింది. తమ్ముడి డిగ్రీ పట్టాతో ఫొటోలకు ఫోజులిచ్చిన మృణాల్ ఠాకూర్ ఎమోషనల్ అయ్యింది. కన్నీళ్లు పెట్టుకుంది. ఈ వీడియో వైరల్ అవుతోంది.
గైడ్...అడ్వైజర్...
సోదరుడు మందార్ ఠాకూర్‌తో అనుబంధం గురించి పలుమార్లు వెల్లడించింది మృణాల్. తమ్ముడి వల్లే తాను సినిమాల్లోకి అడుగుపెట్టగలిగానని, గొప్ప నా గైడ్, అడ్వైజర్, ఫిలాసఫర్ అన్ని తమ్ముడే అంటూ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది.కాగా మృణాల్ బాటలోనే సోదరుడు మందార్ కూడా సినిమాల్లోకి అడుగుపెట్టబోతున్నాడట. ఫిల్మ్ మేకింగ్ కోర్సు కంప్లీట్ చేసినట్లు సమాచారం. డైరెక్టర్‌గా మారే ప్రయత్నాల్లో ఉన్నాడట.
మూడు సినిమాలు...
కాగా ఈ ఏడాది తెలుగులో డెకాయిట్, హిందీలో దో దివానే షెహర్ మే, హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలతో ప్రేక్షకులను పలకరించింది. మూడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద మిక్స్‌డ్ టాక్‌ను సొంతం చేసుకున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ రాకాలో మృణాల్ ఓ హీరోయిన్‌గా నటిస్తోన్నట్లు ప్రచారం జరుగుతోంది.
సంబంధిత వార్తలు

Tamannaah | ఐపీఎస్ ఆఫీసర్ బయోపిక్‌లో మిల్కీ బ్యూటీ – బాలీవుడ్ స్టార్ డైరెక్టర్‌తో సినిమా కన్ఫామ్
జూన్ 23, 2026

Samantha | చిరు లీక్స్ – సమంత జీవితంలోని గుడ్ న్యూస్‌ను బయటపెట్టిన మెగాస్టార్
జూన్ 23, 2026

Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు – సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
జూన్ 22, 2026
తాజావార్తలు
- ●Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్
- ●Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి
- ●Kunal Shah | వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా: డెలివరీ బాయ్ స్థాయి నుంచి మెటా టాప్ బాస్‌గా ఎదిగిన 'క్రెడ్' ఫౌండర్ ఇన్స్పైరింగ్ జర్నీ
- ●Anshula Kapoor | జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి - అక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో "అచ్చియమ్మ" సందడి
- ●RBI | బలహీమైన రుతుపవనాలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం.. ఆర్బీఐ హెచ్చరికలు..
- ●Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..

Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్

Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి

Kunal Shah | వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా: డెలివరీ బాయ్ స్థాయి నుంచి మెటా టాప్ బాస్‌గా ఎదిగిన 'క్రెడ్' ఫౌండర్ ఇన్స్పైరింగ్ జర్నీ

Anshula Kapoor | జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి - అక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో "అచ్చియమ్మ" సందడి



