Kunal Shah | వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా కునాల్ షా: డెలివరీ బాయ్ స్థాయి నుంచి మెటా టాప్ బాస్‌గా ఎదిగిన ‘క్రెడ్’ ఫౌండర్ ఇన్‌స్పైరింగ్ జర్నీ
ఒకప్పుడు డెలివరీ బాయ్‌గా పనిచేసిన క్రెడ్ (Cred) ఫౌండర్ కునాల్ షా, ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ యాప్ 'వాట్సప్' గ్లోబల్ హెడ్‌గా ఎంపికయ్యారు.
Technology | Published On Jun 23, 2026, 5.41 pm IST
- క్రెడ్ (Cred) ఫౌండర్ కునాల్ షా వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు
- మెటా (Meta) సంస్థ క్రెడ్‌లో దాదాపు $900 మిలియన్ల పెట్టుబడి పెట్టడంతో ఈ మార్పు జరిగింది
- కుటుంబం ఆర్థికంగా దెబ్బతినడంతో టీనేజ్‌లోనే డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన కునాల్ అంచెలంచెలుగా ఎదిగారు
- డిగ్రీల కంటే టాలెంట్‌ను నమ్మే కునాల్.. విల్ క్యాత్‌కార్ట్ స్థానంలో వాట్సప్ బాధ్యతలు చేపట్టనున్నారు
Kunal Shah | త్రినేత్ర.న్యూస్ : పట్టుదల, క్లారిటీ ఉంటే జీవితంలో ఎంత ఎత్తుకైనా ఎదగవచ్చు అనడానికి క్రెడ్ (Cred) ఫౌండర్ కునాల్ షా (Kunal Shah) ప్రయాణమే బెస్ట్ ఎగ్జాంపుల్. ఒకప్పుడు కుటుంబ పోషణ కోసం డెలివరీ బాయ్‌గా, డేటా ఎంట్రీ ఆపరేటర్‌గా పనిచేసిన ఆయన.. ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ అయిన వాట్సప్ (WhatsApp) గ్లోబల్ హెడ్‌గా నియమితులయ్యారు. మార్క్ జుకర్‌బర్గ్‌కు చెందిన మెటా (Meta) సంస్థ క్రెడ్‌లో భారీ పెట్టుబడులు పెట్టిన వెంటనే టెక్ ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తూ ఈ కీలక పరిణామం చోటుచేసుకుంది.
కష్టాల నుంచి కోటీశ్వరుడిగా
కునాల్ షా చిన్న వయసులోనే వారి కుటుంబ వ్యాపారం దెబ్బతిని ఆర్థికంగా చాలా నష్టపోయారు. దీంతో కేవలం 14-15 ఏళ్ల వయసులోనే ఆయన పని చేయడం ప్రారంభించారు. కుటుంబానికి అండగా నిలిచేందుకు డెలివరీ బాయ్, డేటా ఎంట్రీ ఆపరేటర్, మెహందీ కోన్ల విక్రేత, సైబర్ కేఫ్ ఆపరేటర్, పైరేటెడ్ సీడీల అమ్మకందారుడిగా.. ఇలా దొరికిన ప్రతి పనీ చేశారు. అలా కష్టపడుతూ 16 ఏళ్లు వచ్చేసరికి ఆర్థికంగా తన కాళ్లపై తాను నిలబడే స్థాయికి చేరుకున్నారు.
వాట్సప్ పగ్గాలు.. జుకర్‌బర్గ్ ప్రశంసలు
ఇండియన్ ఫిన్‌టెక్ దిగ్గజం క్రెడ్‌లో మెటా సంస్థ 900 మిలియన్ డాలర్ల (సుమారు రూ.7,500 కోట్లు) నిధులను పెట్టుబడిగా పెట్టింది. దీంతో క్రెడ్ సంస్థలో మెటా వాటా 20 శాతానికి చేరుకోగా, వాల్యుయేషన్ ఏకంగా 4.5 బిలియన్ డాలర్లకు చేరింది. ఈ డీల్ తర్వాత.. విల్ క్యాత్‌కార్ట్ (Will Cathcart) స్థానంలో కునాల్ షా వాట్సప్ గ్లోబల్ హెడ్‌గా బాధ్యతలు స్వీకరించనున్నారు.
కునాల్ 'బిల్డర్ మెంటాలిటీ, గ్లోబల్ పర్స్‌పెక్టివ్' వాట్సప్‌ను మరింత ముందుకు తీసుకెళ్తాయని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ ప్రశంసించారు. భారత్‌లో వాట్సప్‌కు 50 కోట్ల మందికి పైగా యాక్టివ్ యూజర్లు ఉన్నారు. మెటా తదుపరి టార్గెట్ అయిన బిజినెస్ మెసేజింగ్, డిజిటల్ పేమెంట్స్ విభాగాల్లో కునాల్ అనుభవం కంపెనీకి కీలకం కానుంది. కాగా.. కునాల్ షా నిష్క్రమణతో క్రెడ్ తాత్కాలిక సీఈఓగా మిటెన్ సంపత్ బాధ్యతలు చేపట్టనున్నారు.
డిగ్రీలు కాదు.. టాలెంట్ ముఖ్యం
సాధారణంగా సక్సెస్‌ఫుల్ స్టార్టప్ ఫౌండర్లు అనగానే ఐఐటీ, ఐఐఎం (IIT-IIM) బ్యాక్‌గ్రౌండ్ ఉంటుంది. కానీ కునాల్ షా ముంబైలోని విల్సన్ కాలేజీలో ఫిలాసఫీ చదివారు. ఉదయం 8 నుంచి 10 గంటల వరకే క్లాసులు ఉండటం వల్లే ఆ కోర్సులో చేరానని, ఆ తర్వాత మిగతా రోజంతా ఉద్యోగాలు చేసేవాడినని ఆయన గతంలో వెల్లడించారు. ఆ తర్వాత ఎంబీఏ (MBA) లో చేరినప్పటికీ, ఆ చదువు కేవలం మార్కుల కోసమే తప్ప ప్రాక్టికల్‌గా లేదని మధ్యలోనే డ్రాపౌట్ అయ్యారు.
కంపెనీలో రిక్రూట్‌మెంట్ సమయంలో కూడా డిగ్రీ సర్టిఫికెట్ల కంటే మల్టీ-టాలెంటెడ్ వ్యక్తులకే కునాల్ ప్రాధాన్యత ఇస్తారు. ఆయన నియమించిన క్రెడ్ సీనియర్ లీడర్లలో ఒకరు కేవలం 10వ తరగతి మాత్రమే పాస్ కావడం ఆయన ఆలోచనా విధానానికి నిదర్శనం.
నాయకత్వానికి 'ఎంపతీ' ముఖ్యం..
2018లో క్రెడ్ స్థాపించడానికి ముందు, కునాల్ 'ఫ్రీఛార్జ్' (FreeCharge) అనే డిజిటల్ పేమెంట్స్ స్టార్టప్‌ను కూడా విజయవంతంగా నడిపి యాక్సిస్ బ్యాంకుకు అమ్మేశారు. ఒక పెద్ద సంస్థను నిర్మించాలంటే లీడర్‌కు 'ఎంపతీ' (Empathy - ఇతరుల స్థానంలో ఉండి ఆలోచించే గుణం) కచ్చితంగా ఉండాలని ఆయన నమ్ముతారు. వర్క్ ప్లేస్‌లో ఎవరూ తమను తాము మరీ సీరియస్‌గా తీసుకోకూడదని, సరదాగా ఉండే వాతావరణాన్ని (Meme culture) ఆయన ప్రోత్సహిస్తారు. ఇప్పుడు ఇదే లీడర్‌షిప్ స్టైల్ వాట్సప్‌లో కొత్త ఒరవడి సృష్టిస్తుందని టెక్ పండితులు విశ్లేషిస్తున్నారు.
తాజావార్తలు
- ●Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్
- ●Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి
- ●Anshula Kapoor | జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి - అక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో "అచ్చియమ్మ" సందడి
- ●RBI | బలహీమైన రుతుపవనాలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం.. ఆర్బీఐ హెచ్చరికలు..
- ●Asus | గేమింగ్, కంటెంట్ క్రియేటర్లకు అసుస్ నుంచి కొత్త ల్యాప్ టాప్‌లు.. ఏఐ పనులకు ప్రత్యేకం..
- ●Sushruta Statue Edinburgh | ప్రపంచంలోనే అతి ప్రాచీన మెడికల్ కాలేజీలో మన 'సుశ్రుతుడి' విగ్రహం.. 2600 ఏళ్ల నాటి భారతీయ వైద్యానికి అరుదైన గౌరవం

Chanagani Dayakar | బాహుబలిని ఓడించే సత్తా కేటీఆర్‌కు లేదు : చనగాని దయాకర్

Hyderabad Metro Rail | కథ కంచికి.. మెట్రో మళ్లీ మొదటికి

Anshula Kapoor | జాన్వీ కపూర్ ఇంట పెళ్లి సందడి - అక్క ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్‌లో "అచ్చియమ్మ" సందడి

RBI | బలహీమైన రుతుపవనాలతో ద్రవ్యోల్బణం పెరిగే అవకాశం.. ఆర్బీఐ హెచ్చరికలు..



