Tollywood | ఒక్క లిప్‌లాక్ లేదు .. అయినా “ఏ” సర్టిఫికెట్ ఇచ్చారు – సెన్సార్ తీరుపై దీవాన టీమ్ ఫైర్
సెన్సార్ బోర్డుపై దీవాన దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎలాంటి అశ్లీలత, అసభ్యకర సన్నివేశాలు, హింసాత్మక సీన్లు లేని తమ సినిమాకు "ఏ" సర్టిఫికెట్ ఇచ్చారని అన్నారు. తెలుగు భాష తెలియని సెన్సార్ బోర్డు సభ్యులు ఇష్టానుసారం కట్స్ చేసి సినిమాలను చంపేస్తున్నారని పేర్కొన్నారు.
Entertainment | Published On Jun 22, 2026, 8.27 pm IST
Tollywood | సెన్సార్ బోర్డ్‌పై దీవానా దర్శకనిర్మాతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ సినిమాలో ఒక్క ముద్దు సీన్ లేదని, వయలెన్స్ సన్నివేశాలు లేవని అన్నారు. సెన్సార్ బోర్డు "ఏ" సర్టిఫికెట్ ఎందుకు ఇచ్చిందో అర్థం కావడం లేదని అన్నారు. హర్షిత్ రెడ్డి, స్నేహ మణిమేగలై హీరోహీరోయిన్లుగా నటించిన దీవాన ఇటీవల థియేటర్లలో రిలీజైంది. ఈ సినిమాకు శ్రీకాంత్ సంగిశెట్టి దర్శకత్వం వహించాడు. సోమవారం హైదరాబాద్ ఈ మూవీ సక్సెస్ మీట్‌ను నిర్వహించారు.
భాష తెలియని వారు...
ఈ వేడుకలో డైరెక్టర్ మాట్లాడుతూ .... "దీవాన సినిమాలో రియాలిటీ, కమర్షియాలిటీ రెండూ ఉన్నాయి. కేజీఎఫ్ సినిమాలో ఎలివేషన్ సీన్స్ కు వచ్చే రెస్పాన్స్ ...ఈ సినిమాలోని చిన్న చిన్న డైలాగ్స్ కు కూడా వస్తోంది. తెలుగు సినిమాలు ఇతర భాషలకు తక్కువేం కాదు. మిగిలిన భాషల కంటే గొప్పగా ఉంటాయని ఎన్నో సినిమాలు నిరూపించాయి. వాటిలో దీవాన ఒకటిగా నిలిచింది. ఇందులో హీరో హీరోయిన్స్ పెయిన్ ను ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. మన భాష, మన నేటివిటీ తెలియని ముంబాయిలోని సెన్సార్ బోర్డు సభ్యులు తెలుగు సినిమాలకు ఇష్టానుసారం సెన్సార్ కట్స్ ఇస్తున్నారు. మన సినిమాలను చంపేస్తున్నారు. ఇంకొందరు ముంబాయి నుంచి మన తెలుగు సినిమాల గ్రేట్ నెస్ తగ్గించేందుకు రివ్యూస్ ఇస్తున్నారు" అని అన్నారు.
ముద్దు సీన్లు లేవు...
నిర్మాతలు మాట్లాడుతూ "రెండు తెలుగు రాష్ట్రాల్లో సక్సెస్ టూర్స్ ప్లాన్ చేశాం అయితే సెన్సార్ "ఏ" సర్టిఫికెట్ఇవ్వడం వల్ల అవన్నీ క్యాన్సిల్ చేసుకున్నాం. మా సినిమాలో ముద్దు సీన్లు, వయలెంట్ సన్నివేశాలు లేవు. అయినా ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. అలా ఎందుకు చేశారో అర్థం కావడం లేదు. మా మూవీ టికెట్స్ బుక్ చేసుకుందామని అనుకుంటున్న వారికి ఆన్‌లైన్ టికెటింగ్ ప్లాట్‌ఫామ్స్‌లో 18 ఫ్లస్ ఏజ్ అని చూపిస్తోంది.అది చూసి సినిమాలో అభ్యంతరకర సన్నివేశాలు ఏమున్నాయో అని భయపడుతున్నారు. మా మూవీ నచ్చకుంటే డబ్బులు రిటర్న్ ఇస్తాం. సింగిల్ స్క్రీన్స్ లో టికెట్ ధర 100 రూపాయలు చేస్తున్నాం. మాకు ఫ్యామిలీ ఉంది. పిల్లలు ఉన్నారు. ఫ్యామిలీ మెంబర్స్ తో ధైర్యంగా చూసే సినిమా మేము చేశామని గర్వంగా చెబుతున్నాం" అని చెప్పారు.
టైమ్ లెస్ లవ్‌స్టోరీ...
"దీవాన ఒక టైమ్ లెస్ లవ్ స్టోరీ. ఎప్పుడూ చూసినా నచ్చుతుంది. లైఫ్ టైమ్ మెమొరీ ఇస్తుంది. సెన్సార్ బోర్డును గౌరవిస్తా కానీ ఈ సినిమా విషయంలో మాత్రం వాళ్లు సరైన డెసిషన్ తీసుకోలేదు" అని హీరో హర్షిత్ రెడ్డి చెప్పాడు.
సంబంధిత వార్తలు

Tollywood | వెంకటేష్, అనిల్ రావిపూడి సినిమాలో యాక్టింగ్ ఛాన్స్ అంటూ మోసాలు – క్లారిటీ ఇచ్చిన టీమ్
జూన్ 22, 2026

Peddi OTT | నెల రోజుల్లోనే ఓటీటీలోకి పెద్ది – రామ్‌చరణ్ స్పోర్ట్స్ యాక్షన్ మూవీ స్ట్రీమింగ్ డేట్ ఇదేనా?
జూన్ 22, 2026

Jonita Gandhi | బికినీలో సింగర్ జోనితా గాంధీ గ్లామర్ షో – హీరోయిన్లు కూడా పనికిరారంటూ ఫ్యాన్స్ కామెంట్స్
జూన్ 21, 2026
తాజావార్తలు
- ●Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క
- ●Cybercrime Refund Hyderabad | ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'
- ●Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ
- ●RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?
- ●TG Rains | ఐదురోజులు భారీ వర్షాలు.. ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసిన ఐఎండీ
- ●MVI Venkanna Road Accident | ఎంవీఐ వెంకన్న భౌతికకాయానికి మంత్రి పొన్నం ప్రభాకర్ నివాళులు

Minister Seethakka | రూ.20 కోట్లతో 'హై లెవల్ బ్రిడ్జి'.. దశాబ్దాల కష్టాలకు చెక్ పెట్టిన మంత్రి సీతక్క

Cybercrime Refund Hyderabad | ఆన్‌లైన్ మోసాల్లో డబ్బు పోగొట్టుకున్న బాధితులకు రూ.21 కోట్ల 'రీఫండ్'

Keerthy Suresh | ఏకంగా ఏడు సినిమాలను లైన్లో పెట్టిన మహానటి - నాలుగు భాషల్లో బిజీ

RS Praveen Kumar | భగీరథ్ ఒక్కడికే స్పెషల్‌గా పరీక్షలు పెట్టడం ఏంటి?




