త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Chanagani Dayakar | బాహుబ‌లిని ఓడించే స‌త్తా కేటీఆర్‌కు లేదు : చ‌న‌గాని ద‌యాక‌ర్

Chanagani Dayakar | తెలంగాణ కాంగ్రెస్ బాహుబ‌లి అయిన సీఎం రేవంత్ రెడ్డిని ఓడించే స‌త్తా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు లేద‌ని టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చ‌న‌గాని ద‌యాక‌ర్ పేర్కొన్నారు.

S

Telangana | Published On Jun 23, 2026, 6.04 pm IST

Chanagani Dayakar | బాహుబ‌లిని ఓడించే స‌త్తా కేటీఆర్‌కు లేదు : చ‌న‌గాని ద‌యాక‌ర్
Advertisement

Chanagani Dayakar | త్రినేత్ర‌.న్యూస్ : తెలంగాణ కాంగ్రెస్ బాహుబ‌లి అయిన సీఎం రేవంత్ రెడ్డిని ఓడించే స‌త్తా సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌కు లేద‌ని టీపీసీసీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ చ‌న‌గాని ద‌యాక‌ర్ పేర్కొన్నారు. చ‌న‌గాని ద‌యాక‌ర్ మంగ‌ళ‌వారం గాంధీ భ‌వ‌న్‌లో మీడియాతో మాట్లాడారు.

కేసీఆర్ భాష ఐటీ కంపెనీలో జాబ్ చేసిన‌ట్లుగా లేద‌ని, బ‌ర్రెల‌ను కాసేవాడిలా మాట్లాడుతున్నార‌ని ద‌యాక‌ర్ మండిప‌డ్డారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌లు చిటికె వేస్తే తునాతున‌క‌లు అవుతావ్ జాగ్ర‌త్త అని కేటీఆర్‌ను హెచ్చ‌రించారు. రాబోయే ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ పార్టీనే గెలుస్తుంద‌ని, కేటీఆర్‌కు ఓట‌మి త‌ప్ప‌ద‌న్నారు.

తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఆద‌ర్శ‌వంత‌మైన పాల‌న‌ను కొన‌సాగిస్తుంద‌న్నారు. కానీ కేటీఆర్ ప్ర‌జ‌ల‌ను రెచ్చ‌గొట్టేలా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ కార్య‌క‌ర్త‌ల స‌హ‌నాన్ని ప‌రీక్షించొద్దు అని హెచ్చ‌రించారు. 2028 ఎన్నిక‌ల్లో మ‌ళ్లీ కాంగ్రెస్ విజ‌యం సాధించి తీరుతుంద‌ని చ‌న‌గాని ద‌యాక‌ర్ దీమా వ్య‌క్తం చేశారు.

Advertisement
Advertisement