త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | తెలుగులో మృణాల్ ఠాకూర్ ఫ‌స్ట్ టైమ్ – డెకాయిట్ కోసం…

మృణాల్ ఠాకూర్ హీరోయిన్‌గా న‌టించిన డెకాయిట్ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. ఈ సినిమా కోసం మృణాల్ ఠాకూర్ ఫ‌స్ట్ టైమ్ తెలుగులో ప్ర‌యోగం చేయ‌బోతుంది. అదేమిటంటే?

N

Entertainment | Published On Mar 20, 2026, 7.25 pm IST

Mrunal Thakur | తెలుగులో మృణాల్ ఠాకూర్ ఫ‌స్ట్ టైమ్ – డెకాయిట్ కోసం…
Advertisement

Mrunal Thakur | సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫ‌స్ట్ టైమ్ డెకాయిట్ కోసం ఓ ప్ర‌యోగం చేయ‌బోతుంది. అడివి శేష్ హీరోగా న‌టించిన ఈ మూవీ ఏప్రిల్ 10న ప్రేక్ష‌కుల ముందుకు రాబోతుంది. రొమాంటిక్ యాక్ష‌న్ ల‌వ్‌స్టోరీగా తెర‌కెక్కిన ఈ సినిమాతో సినిమాటోగ్రాఫ‌ర్ షానీల్ డియో డైరెక్ట‌ర్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇవ్వ‌బోతున్నాడు.

యాక్ష‌న్ రోల్‌లో

ఇప్ప‌టివ‌ర‌కు ల‌వ్ స్టోరీస్‌లో సాఫ్ట్ రోల్స్ చేసిన మృణాల్ ఠాకూర్ ఫ‌స్ట్ టైమ్ డెకాయిట్‌లో ఔట్ అండ్ ఔట్ యాక్ష‌న్ రోల్‌లో క‌నిపించ‌బోతున్న‌ది. ఇందులో దొంగ పాత్ర‌లో న‌టిస్తోన్న‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది.
డెకాయిట్ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు శ‌ర‌వేగంగా జ‌రుగుతోన్నాయి. మ‌రోవైపు ప్ర‌మోష‌న్స్ మొద‌లుపెట్టారు. తాజాగా డెకాయిట్‌లో త‌న పాత్ర‌కు డ‌బ్బింగ్ చెప్ప‌డం మొద‌లుపెట్టింది మృణాల్ ఠాకూర్‌. ఈ సినిమా కోసం ఫ‌స్ట్ టైమ్ తెలుగులో డ‌బ్బింగ్ చెబుతోంద‌ట‌. ఈ విష‌యాన్ని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అఫీషియ‌ల్‌గా మృణాల్ ఠాకూర్ వెల్ల‌డించింది. ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో డ‌బ్బింగ్ స్టూడియో ఫొటోను పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు తెలుగు పాట‌ను జోడించింది. ఇన్‌డైరెక్ట్‌గా తెలుగులో డ‌బ్బింగ్ చెబుతోన్న‌ట్లు వెల్ల‌డించింద‌ని నెటిజ‌న్లు అంటోన్నారు. తెలుగుతో పాటు హిందీలో కూడా మృణాల్ ఠాకూర్ త‌న పాత్ర‌కు తానే స్వ‌యంగా డ‌బ్బింగ్ చెప్పుకోబోతుంద‌ని స‌మాచారం.

తెలుగు నేర్చుకొని....

సీతారామం నుంచి ఫ్యామిలీ స్టార్ వ‌ర‌కు  తెలుగులో మృణాల్ ఠాకూర్‌కు చిన్మ‌యి డ‌బ్బింగ్ చెబుతూ వ‌చ్చింది.  టాలీవుడ్ లో అవకాశాలు పెర‌గ‌డంతో భాష‌పై ప‌ట్టు పెంచుకోవాలని భావించిన మృణాల్ ఠాకూర్ గ‌త ఏడాది కాలంగా తెలుగు  నేర్చుకున్నట్లు సమాచారం. ఇక‌పై తాను న‌టించే ప్ర‌తి సినిమాకు సొంతంగా డ‌బ్బింగ్ చెప్పాల‌ని మృణాల్ ఫిక్స‌య్యింద‌ని అంటున్నారు.
డెకాయిట్ మూవీలో తొలుత శృతి హాస‌న్‌ను హీరోయిన్‌గా ఫైన‌ల్ చేశారు. కానీ క్రియేటివ్ డిఫ‌రెన్సెస్‌తో పాటు డేట్ ఇష్యూస్ కార‌ణంగా కొంత షూటింగ్ జ‌రిగిన త‌ర్వాత ఈ సినిమా నుంచి శృతి హాస‌న్ త‌ప్పుకుంది. దాంతో ఆమె స్థానంలో మృణాల్‌ను హీరోయిన్‌గా తీసుకున్నారు. డెకాయిట్ మూవీలో బాలీవుడ్ న‌టుడు అనురాగ్ క‌శ్య‌ప్ విల‌న్‌గా న‌టించ‌బోతున్నాడు. తొలుత ఈ సినిమాను మార్చి 19న రిలీజ్ చేయాల‌ని అనుకున్నారు. కానీ ధురంధ‌ర్ 2, టాక్సిక్‌తో పాటు పోటీ కార‌ణంగా మేక‌ర్స్ వాయిదావేశారు.

Advertisement

తాజావార్తలు

Advertisement