Mrunal Thakur | బోల్డ్ సీన్లపై మృణాల్ ఠాకూర్ క్లారిటీ – అందుకే ఆ సినిమా చేశానంటూ కామెంట్స్
మృణాల్ ఠాకూర్ పేరు చెప్పగానే సెంటిమెంట్, ఎమోషనల్ రోల్స్ గుర్తొస్తాయి. ఈ ఇమేజ్‌కు భిన్నంగా ఫస్ట్ టైమ్ హై జవానీతో ఇష్క్ హోనా హై సినిమాలో బోల్డ్ రోల్‌లో కనిపించబోతున్నది మృణాల్ ఠాకూర్. ఈ సినిమా అంగీకరించడంపై మృణాల్ ఏమన్నదంటే?
Entertainment | Published On May 25, 2026, 4.19 pm IST
Mrunal Thakur | దక్షిణాదిలో ట్రెడిషనల్ రోల్స్ అంటే నేటితరం హీరోయిన్లలో మొదటగా మృణాల్ ఠాకూర్ గుర్తొస్తుంది. సీతారామం నుంచి ఇటీవల రిలీజైన డెకాయిట్ వరకు ప్రతి సినిమాలో యాక్టింగ్‌కు స్కోప్‌ను ఉన్న హెవీ ఎమోషనల్ రోల్స్‌లో కనిపించింది. నార్త్ హీరోయిన్లు గ్లామర్ రోల్స్‌కు మాత్రమే పరిమితమనే అపోహను తిరగరాసింది. తెలుగులోనే కాకుండా బాలీవుడ్‌లోనూ ఇన్నాళ్లుగా గ్లామర్ పరంగా కొన్ని లిమిట్స్ పెట్టుకొని వాటికి లోబడే సినిమాలు చేస్తూ వచ్చింది.
ఫస్ట్ టైమ్...
కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హై జవానీ తో ఇష్క్ హోనా హై సినిమాలో బోల్డ్ రోల్‌లో కనిపించబోతున్నది మృణాల్. అందాల ఆరబోత విషయంలో తాను పెట్టుకున్నహద్దులన్నింటిని ఈ సినిమాతో బ్రేక్ చేసింది. ఇటీవల రిలీజైన ఈ ట్రైలర్‌లో పొట్టి డ్రెస్‌లలో కనిపించింది. మృణాల్ చెప్పిన డబుల్ మీనింగ్ డైలాగ్స్, ఆమెపై వచ్చిన ఇంటిమేట్ సీన్స్ హాట్ టాపిక్‌గా మారాయి. ఇందులో మృణాల్ ఠాకూర్‌తో పాటు పూజా హెగ్డే మరో హీరోయిన్‌గా నటించింది. గ్లామర్‌ను పండించే విషయంలో వీరిద్దరు పోటీ పడ్డారు.
ఆఫర్లు చేజారాయి....
బోల్డ్ రోల్ చేయడంపై మృణాల్ హై జవానీ తో ఇష్క్ హోనా హై ప్రమోషన్స్‌లో క్లారిటీ ఇచ్చింది. "గ్లామర్ పాత్రలకు దూరంగా ఉంటానని సినిమాల్లోకి అడుగుపెట్టే టైమ్‌లో అమ్మనాన్నలకు మాటిచ్చా. కనీసం లిప్‌లాక్ సీన్ లో కూడా నటించనని చెప్పా. ఆ రూల్ కారణంగా పలు పెద్ద సినిమాల్లో ఆఫర్లు చేజారిపోయాయి. అయినా ఎప్పుడు రిగ్రేట్‌గా ఫీల్ కాలేదు. బోల్డ్ పాత్రలు చేయకూడదని నాకు నేను పెట్టుకున్న ఈ లిమిట్ కారణంగా గత పదేళ్లలో చాలా వరకు ఎమోషనల్ సినిమాలే నన్ను వెతుక్కుంటూ వచ్చాయి. సెంటిమెంట్ క్యారెక్టర్లకే సెట్ అవుతాననే ముద్ర నాపై పడింది. ఒకే తరహా పాత్రలు చేసి నాకు బోర్ కొట్టింది" అని మృణాల్ అన్నది.
కామెడీ టైమింగ్....
"ఈ స్టీరియో టైప్ నుంచి దూరం అయ్యే మంచి ఛాన్స్ కోసం ఎదురుచూస్తున్న టైమ్‌లోనే హై జవానీ తో ఇష్క్ హోనా హై ఆఫర్ నన్ను వెతుక్కుంటూ వచ్చింది. స్వతహాగా నాకు రొమాంటిక్ కామెడీ సినిమాలు అంటే ఇష్టం. ఈ జానర్‌లో ఒక్క సినిమా నైనా చేయాలని చాలా రోజులుగా ఎదురుచూస్తున్నా. ఆ కల ఈ మూవీతో తీరింది. డైరెక్టర్ డేవిడ్ ధావన్‌ను మొదటిసారి కలిసినప్పుడు హీరో ఎవరు, కథేమిటి అన్నదిచెప్పలేదు. నీలోని నటిని ఇన్నాళ్లు చాలా మంది దర్శకులు ఎలివేట్ చేశారు. కానీ నేను మాత్రం నీలోని కామెడీ యాంగిల్ వెలికితీయాలని అనుకుంటున్నానని అన్నారు. అన్నట్లుగానే చాలా ఫన్నీగా నా క్యారెక్టర్‌ను డిజైన్ చేశారు. ఈ సినిమాతో నా కామెడీ టైమింగ్ చాలా ఇంప్రూవ్ అయ్యింది. నేను కూడా కమర్షియల్ కామెడీ సినిమాలు చేయగలననే నమ్మకం ఈ మూవీతో బలపడింది. అందుకే ఈ సినిమా చేశా" అని మృణాల్ చెప్పింది. చెప్పింది.
వరుణ్ ధావన్ హీరోగా నటిస్తోన్న ఈ మూవీ జూన్ 5న థియేటర్లలోకి రాబోతుంది. బాలీవుడ్ సీనియర్ డైరెక్టర్ డేవిడ్ ధావన్ చివరి మూవీగా హై జవానీతో ఇష్క్ హోనా హై రిలీజ్ కాబోతుంది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Krystle D’Souza | పీకల్లోతు ప్రేమలో దురంధర్ బ్యూటీ.. దుబాయి బిలియనీర్‌తో డేటింగ్..!
మే 26, 2026

Ranveer Singh | డాన్-3 మూవీ వివాదం.. మౌనం వీడిన రణ్వీర్ సింగ్..!
మే 26, 2026

Ranveer Singh Banned | రణ్వీర్ సింగ్‌కు భారీ షాక్.. ‘డాన్ 3’ వివాదంతో బ్యాన్ విధించిన సినీ వర్కర్స్ అసోసియేషన్!
మే 25, 2026
తాజావార్తలు
- ●SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ
- ●DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ
- ●Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క
- ●MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు
- ●Money Saving | చిన్న చిన్న ఖర్చులే దీర్ఘకాలంలో భారీ నష్టాలను ఇస్తాయా.. డబ్బు పొదుపు చేయడంలో మల్లర్నీ ఏం చెప్పారు..?
- ●Smart Phones | ఉదయం నిద్ర లేవగానే ఫోన్లను చూడడం తగ్గిస్తున్నారు.. కారణం ఇదే..

SBI ATM | మహబూబ్‌నగర్ పట్టణంలో ఎస్బీఐ ఏటీఎం ధ్వంసం.. నగదు చోరీ

DRDO Scientist Home | డీఆర్డీవో కాంప్లెక్స్‌లో భారీ చోరీ.. శాస్త్రవేత్త ఇంట్లో రూ.50 లక్షల విలువైన బంగారం అపహరణ

Seethakka | పనిచేసే గ్రామీణ మహిళల కోసమే హాస్టళ్లు: మంత్రి సీతక్క

MGBS | ఎంజీబీఎస్‌లో ఆర్టీసీ బస్సులో చెలరేగిన మంటలు.. పరుగులు తీసిన ప్రయాణికులు



