త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Mrunal Thakur | బాహుబ‌లి ప్రీక్వెల్ – శివ‌గామి పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ – వంద కోట్ల‌తో షూటింగ్ – క‌ట్ చేస్తే!

ప్ర‌భాస్ బాహుబ‌లికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌సిరీస్ రావాల్సింది. ఈ సిరీస్‌లో శివ‌గామి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. దాదాపు వంద కోట్ల‌తో స‌గానికిపైగా షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత ఈ సిరీస్‌ను ప‌క్క‌న‌పెట్టారు.

N

Entertainment | Published On Aug 25, 2026, 7.36 pm IST

Mrunal Thakur | బాహుబ‌లి ప్రీక్వెల్ – శివ‌గామి పాత్ర‌లో మృణాల్ ఠాకూర్ – వంద కోట్ల‌తో షూటింగ్ – క‌ట్ చేస్తే!
Advertisement

Mrunal Thakur |  ప్ర‌భాస్ బాహుబ‌లి ఇండియ‌న్ సినిమాపై చూపించిన ప్ర‌భావం అంతా...ఇంతా కాదు. పాన్ ఇండియ‌న్ క‌ల్చ‌ర్‌ బాహుబ‌లితోనే మొద‌లైంది. తెలుగు సినిమా స్టామినాను జాతీయ స్థాయిలో చాటిచెప్పిన మొద‌టి మూవీ ఇది. వెయ్యి కోట్ల వ‌సూళ్ల‌ను సాధించే స‌త్తా తెలుగు సినిమాల‌కు కూడా ఉంద‌ని నిరూపించింది. బాక్సాఫీస్ రికార్డులను తిర‌గ‌రాయ‌డ‌మే కాకుండా నేష‌న‌ల్ అవార్డుల‌ను అందుకుంది. ఈ సినిమాతోనే ప్ర‌భాస్ ఇండియ‌న్ సూప‌ర్ స్టార్‌గా మారిపోయాడు.

270 కోట్ల బ‌డ్జెట్‌...

బాహుబ‌లికి కొన‌సాగింపుగా చాలానే యానిమేష‌న్ సినిమాలు, సిరీస్‌లు, బుక్స్ వ‌చ్చాయి. ఇవేవీ అంత‌గా ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌లేక‌పోయాయి. బాహుబ‌లికి ప్రీక్వెల్‌గా ఓ వెబ్‌సిరీస్‌ను రూపొందించేందుకు ప్ర‌ముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సిద్ధ‌మైంది. దాదాపు 270 కోట్ల బ‌డ్జెట్‌తో ఇండియాలోనే హ‌య్యెస్ట్ బ‌డ్జెట్ వెబ్‌సిరీస్‌గా బాహుబ‌లి ప్రీక్వెల్ తెర‌కెక్కించాల‌ని అనుకుంది. కానీ స‌గం షూటింగ్ పూర్త‌యిన త‌ర్వాత అవుట్‌పుట్ అనుకున్న‌ట్లుగా రాక‌పోవ‌డంతో ప‌క్క‌న‌పెట్టారు.

బాహుబ‌లి బిఫోర్ ది బిగినింగ్‌...

శివ‌గామి జీవితం ఆధారంగా ఆనంద్ నీల‌కంఠ‌న్ రాసిన ది రైజ్ ఆఫ్ శివ‌గామి ఆధారంగా ఈ వెబ్‌సిరీస్‌ను తెర‌కెక్కించారు. ఈ సిరీస్‌కు బాహుబలి బిఫోర్ ది బిగినింగ్ అనే టైటిల్ ఖ‌రారు చేశారు. ఈ సిరీస్‌లో శివ‌గామి పాత్ర కోసం మృణాల్ ఠాకూర్‌ను తీసుకున్నారు. కానీ షూటింగ్ డిలే కావ‌డంతో ఆమె ఈ వెబ్‌సిరీస్ నుంచి త‌ప్పుకుంది. ఆ త‌ర్వాత మృణాల్ స్థానాన్ని వామికా గ‌బ్బితో రీప్లేస్ చేశారు. ఈ సిరీస్‌కు దేవా క‌ట్టాతో పాటు ప్ర‌వీణ్ స‌త్తారు ద‌ర్శ‌కులుగా వ్య‌వ‌హ‌రించారు. మూడు సీజ‌న్ల‌తో కూడిన ఈ సిరీస్ షూటింగ్ దాదాపు 70 శాతం వ‌ర‌కు కంప్లీట్ అయ్యింది. అప్ప‌టికే ఈ సిరీస్ కోసం నెట్‌ఫ్లిక్స్ 97 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు చేసింది. కానీ ఔట్‌పుట్ అనుకున్న‌ట్లుగా రాక‌పోవ‌డం, ద‌ర్శ‌కులతో ఏర్ప‌డిన విభేదాల కార‌ణంగా ఈ సిరీస్‌ను ప‌క్క‌న‌పెట్టింది. వంద కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు అయిన త‌ర్వాత ఆగిపోయిన వెబ్‌సిరీస్‌గా బాహుబ‌లి బిఫోర్ ది బిగినింగ్ నిలిచింది.

 

 

Advertisement
Advertisement