Sreevishnu | రిలీజ్ డేట్ ఇష్యూ క్లియర్ – శ్రీవిష్ణు మృత్యుంజయ్ పోస్ట్‌పోన్
శ్రీవిష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్, విష్ణువిన్యాసం సినిమాలు ఒక రోజు గ్యాప్‌లో థియేటర్లలోకి రానున్నట్లు ఇటీవల మేకర్స్ ప్రకటించారు. తన సినిమాతో తానే బాక్సాఫీస్ వద్ద శ్రీవిష్ణు పోటీపడటం ఆసక్తికరంగా మారింది. తాజాగా ఈ పోటీ నుంచి మృత్యుంజయ్ తప్పుకుంది. వారం ఆలస్యంగా రిలీజ్ కాబోతుంది.
Entertainment | Published On Feb 20, 2026, 6.03 pm IST
Sreevishnu | శ్రీవిష్ణు హీరోగా నటించిన మృత్యుంజయ్, విష్ణువిన్యాసం సినిమాలు ఒక రోజు తేడాతో బాక్సాఫీస్ బరిలో నిలవడం తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తికరంగా మారింది. ఓటీటీ ప్లాట్‌ఫామ్స్‌తో చేసుకున్న డీల్ కారణంగా ఫిబ్రవరి 27న మృత్యుంజయ్, ఫిబ్రవరి 28న విష్ణువిన్యాసం సినిమాలు ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. శ్రీవిష్ణు సినిమాకు పోటీగా అతడి సినిమానే థియేటర్లలో రిలీజ్ కానుండటం టాలీవుడ్ వర్గాల్లో ఉత్కంఠను రేకత్తించింది. ఈ రెండు సినిమాల్లో ఏది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది? సినిమాల ప్రమోషన్స్‌లో శ్రీవిష్ణు ఎలా పాల్గొంటాడు? అంటూ రకరకాల అనుమానాలు అభిమానుల్లో వ్యక్తమయ్యాయి. ఈ రెండింటిలో ఒకటి పోస్ట్‌పోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లు కూడా వార్తలు వినిపించాయి.
వారం వెనక్కి...
తాజాగా ఈ రూమర్లను నిజం చేస్తూ మృత్యుంజయ్ మూవీ వారం వెనక్కి వెళ్లింది. ఫిబ్రవరి 27న కాకుండా మార్చి 6న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు మేకర్స్ ప్రకటించారు. పోస్ట్‌పోన్‌ను అఫీషియల్‌గా ప్రకటిస్తూ కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేశారు.
పాటలు లేకుండా...
మృత్యుంజయ్ మూవీకి హుస్సేన్ షా కిరణ్ దర్శకత్వం వహించారు. క్రైమ్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రెబా మోనికా జాన్ హీరోయిన్‌గా నటిస్తోంది. పాటలు, లవ్ ట్రాక్ లాంటివి లేకుండా సీరియస్ థ్రిల్లర్‌గా మేకర్స్ ఈ మూవీని తెరకెక్కించినట్లు సమాచారం.
వాస్తు, జాతకాల పిచ్చితో...
మరోవైపు విష్ణువిన్యాసం మూవీ ఔట్ అండ్ ఔట్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కింది. యధునాథ్ మారుతిరావు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నయన్ సారిక హీరోయిన్‌గా నటిస్తోంది. వాస్తు, జాతకాల నమ్మే ఓ యువకుడి ప్రేమకథతో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా విష్ణు విన్యాసం మూవీ రూపొందుతోంది.
రిలీజ్‌కు ముందే ఈ రెండు సినిమాల ఓటీటీ, శాటిలైట్ డీల్ క్లోజయ్యింది. టేబుల్ ప్రాఫిట్స్‌తో మృత్యుంజయ్, విష్ణువిన్యాసం సినిమాలు ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ప్రచారం జరుగుతోంది.
..
సంబంధిత వార్తలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
మే 21, 2026

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు…వచ్చింది – రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
మే 21, 2026

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026
తాజావార్తలు
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు
- ●Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?
- ●Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్
- ●KTR | కేబీఆర్ పార్క్‌ను కాపాడాలి – పర్యావరణ పరిరక్షణలో బీఆర్ఎస్ అండగా ఉంటుంది: కేటీఆర్ హామీ
- ●Rashmi Thakur Cannes 2026 | కేన్స్ రెడ్ కార్పెట్‌పై తెలంగాణ వైభవం: పోచంపల్లి ఇక్కత్, హైదరాబాదీ ముత్యాలతో రష్మీ ఠాకూర్ రికార్డ్

Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్

Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Aditi Rao Hydari | కేన్స్‌లో అదితీ రావ్ హైదరీ ధరించిన డ్రెస్ కాస్ట్ ఎంతో తెలుసా?

Vadde Naveen | బ్రేక్ తీసుకోలేదు...వచ్చింది - రీఎంట్రీపై వడ్డే నవీన్ కామెంట్స్



