త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Kavya-Anirudh Wedding | అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి ఫొటోలు చూశారా..?

Kavya-Anirudh Wedding | ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటయ్యారు.

D

Entertainment | Published On Nov 12, 2026, 11.26 am IST

Kavya-Anirudh Wedding | అనిరుధ్‌-కావ్య మారన్‌ పెళ్లి ఫొటోలు చూశారా..?
Advertisement

Kavya-Anirudh Wedding | త్రినేత్ర న్యూస్ : ప్రముఖ సంగీత దర్శకుడు అనిరుధ్‌ రవిచందర్ (Anirudh Ravichander), సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ సహ యజమాని కావ్య మారన్ (Kavya Maran) వివాహ బంధంతో ఒక్కటయ్యారు. నవంబర్‌ 11న గ్రీస్ (Greece) న‌గ‌రంలో అత్యంత వైభవంగా వీరి పెళ్లి జ‌రిగింది. అతి కొద్ది మంది కుటుంబ సభ్యులు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖుల సమక్షంలో వీరు మూడు ముళ్ల బంధంతో ఒక్క‌ట‌య్యారు. నవంబర్‌ 21న చెన్నైలో గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వ‌హించ‌నున్నారు. ఇక పెళ్లి వేడుక‌కు సంబంధించిన ఫొటోల‌ను అనిరుధ్ సోష‌ల్ మీడియా ద్వారా అభిమానుల‌తో పంచుకున్నారు. ఆ ఫొటోలు ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారాయి. వాటిని చూసిన అభిమానులు, నెటిజ‌న్లు, ప‌లువురు సినీ తార‌లు కొత్త జంట‌కు శుభాకాంక్ష‌లు చెబుతున్నారు. అంద‌మైన ఆఫొటోల‌పై మీరూ ఓ లుక్కేయండి..

Advertisement
Advertisement