Anirudh | పెళ్లిపీటలు ఎక్కబోతున్న అనిరుధ్ – సీఎం విజయ్‌కి ప్రత్యేక ఆహ్వానం
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్, సన్‌రైజర్స్ ఓనర్ కావ్యమారన్ పెళ్లికి ముహూర్తం కుదిరినట్లు సమాచారం. నవంబర్ 11న గ్రీస్‌లో జంట వివాహం జరుగనున్నట్లు వార్తలొస్తున్నాయి. నవంబర్ 14న చెన్నైలో గ్రాండ్ వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నట్లు తెలిసింది. గురువారం సీఎం విజయ్‌ని కలిసిన కళానిధి మారన్ కూతురి పెళ్లి శుభలేఖను ఆయనకు అందజేసినట్లు చెబుతున్నారు.
Entertainment | Published On Oct 16, 2026, 5.55 pm IST
Anirudh | స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ పెళ్లిపీటలు ఎక్కబోతున్నారా? సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్ కూతురితో త్వరలోనే ఏడడుగులు వేయబోతున్నారా? అంటే ఔననే అంటున్నాయి కోలీవుడ్ వర్గాలు. కళానిధి మారన్ కూతురు, సన్‌రైజర్స్ టీమ్ ఓనర్ కావ్య మారన్‌తో అనిరుధ్ ప్రేమలో ఉన్నట్లుగా చాలా కాలంగా రూమర్లు వస్తున్నాయి. గత రెండేళ్ల నుంచి వీరిద్దరి సీక్రెట్ లవ్‌స్టోరీ సాగుతోన్నట్లు సమాచారం. పెద్దల అంగీకారంతో ఈ జంట నవంబర్‌లో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు తెలిసింది.
డెస్టినేషన్ వెడ్డింగ్...
నవంబర్ 11న గ్రీస్‌లో అనిరుధ్, కావ్యమారన్ డెస్టినేషన్ వెడ్డింగ్ జరుబోతుంది. ఈ పెళ్లి వేడుకలో ఇరు కుటుంబసభ్యులతో పాటు కొంత మంది సన్నిహితులు మాత్రమే పాల్గొననున్నట్లు సమాచారం. నవంబర్ 14న చెన్నైలోని ఓ ఫైవ్ స్టార్ హోటల్లో వెడ్డింగ్ రిసెప్షన్ ఏర్పాటుచేయబోతున్నట్లు వార్తలొస్తున్నాయి. గ్రాండ్‌గా జరిగే ఈ రిసెప్షన్లో కోలీవుడ్, టాలీవుడ్‌తో పాటు వివిధ భాషలకు చెందిన సినీ రాజకీయ ప్రముఖులు పాల్గొననున్నారు. పెళ్లి వేడుకతో పాటు రిసెప్షన్ పనులు శరవేగంగా జరుగుతోన్నట్లు సన్నిహితుల టాక్.
విజయ్‌కి ఆహ్వానం
అనిరుధ్, కావ్యమారన్ వెడ్డింగ్‌కు సంబంధించి ఇప్పటికే ఇన్విటేషన్స్‌ను రెడీ చేయించినట్లు సమాచారం. గురువారం తమిళనాడు సీఎం విజయ్‌ని కలిసిన కళానిధి మారన్ కూతురి పెళ్లికి ప్రత్యేకంగా ఆయన్ని ఆహ్వానించినట్లు తెలిసింది. విజయ్‌తో పాటు డీఎమ్‌కే లీడర్ స్టాలిన్‌కు కూడా పెళ్లి పత్రికను అందజేసినట్లు చెబుతోన్నారు.
జైలర్ 2
రజనీకాంత్ హీరోగా నటించిన జైలర్ 2 మూవీ గురువారం రిలీజైంది. ఈ సినిమాను చెన్నైలోని వెట్రి థియేటర్లో అనిరుధ్, కావ్య మారన్ కలిసి చూశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్నాయి.
కావ్యమారన్...
కావ్యమారన్ ప్రస్తుతం ఐపీఎల్లో సన్‌రైజర్స్ టీమ్‌కు సహయజమానిగా వ్యవహరిస్తోంది. ఐపీఎల్ ద్వారానే సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యింది. మరోవైపు అనిరుధ్ దక్షిణాదిలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్‌గా కొనసాగుతోన్నారు.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Trisha | తమిళనాడు మాజీ సీఎంగా త్రిష – ఎంజీఆర్ బయోపిక్‌లో చెన్నై క్వీన్?
అక్టోబర్ 16, 2026

Jailer 2 OTT | రజనీకాంత్ జైలర్ 2 ఓటీటీ ప్లాట్‌ఫామ్ ఇదే – నెల రోజుల్లోనే స్ట్రీమింగ్
అక్టోబర్ 15, 2026

Jailer 2 Review | జైలర్ 2 రివ్యూ – రజనీకాంత్ హీరోయిజం, ఎలివేషన్లు ఓకే కానీ … కానీ కథ ఏది?
అక్టోబర్ 15, 2026
తాజావార్తలు
- ●Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే
- ●Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు
- ●OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్
- ●Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..
- ●Amazon Business | అమెజాన్ బంపర్ ఆఫర్.. కార్పొరేట్ గిఫ్ట్స్‌పై 80 శాతం వరకు తగ్గింపు..
- ●Special Trains | పండుగ రద్దీకి ప్రత్యేక రైళ్లు.. మూడు ప్రాంతాలకు ప్రత్యేక రైళ్లు ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే..

Twisha Sharma case | తెలుగు నటి కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు.. భోపాల్ కోర్టులో విచారణపై స్టే

Supreme Court | సోషల్ మీడియా ముప్పు నుంచి పిల్లలకు రక్షణ కోరుతూ పిల్.. కేంద్రానికి సుప్రీం నోటీసులు

OTT Releases | శుక్రవారం ఒక్కరోజే ఓటీటీలో 30 సినిమాలు రిలీజ్ - ఒక్కోటి ఒక్కో జానర్

Tummala Nageshwar Rao | వైటీపీఎస్‌కు మహానది బొగ్గును కేటాయించండి..



