త్రినేత్ర News Logo
DIGITAL-NEWS

Vijay-Trisha | విజయ్ – త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చ‌ర్చ‌

Vijay-Trisha | త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌ (CM Vijay), త్రిష (Trisha Krishnan) కి సంబంధించి షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. విజ‌య్‌-త్రిష (Vijay-Trisha) బంధానికి బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.

D

Entertainment | Published On Jun 23, 2026, 12.06 pm IST

Vijay-Trisha | విజయ్ – త్రిష బంధానికి బ్రేకప్ పడిందా..? నెట్టింట కొత్త చ‌ర్చ‌
Advertisement

Vijay-Trisha | గ‌త కొన్ని రోజులుగా త‌మిళ‌నాడు ముఖ్య‌మంత్రి విజ‌య్‌ (CM Vijay), త్రిష (Trisha Krishnan) గురించి సోష‌ల్ మీడియాలో జోరుగా ప్ర‌చారం జ‌రుగుతున్న విష‌యం తెలిసిందే. వీరిద్ద‌రూ డేటింగ్‌లో ఉన్నారంటూ టాక్ న‌డుస్తోంది. అదే స‌మ‌యంలో వీరిద్ద‌రూ ప‌లు ఈవెంట్స్‌కు జంట‌గా వెళ్ల‌డం, ప‌లు సంద‌ర్భాల్లో ఒక‌రికొక‌రు అండ‌గా నిల‌వ‌డం కూడా రూమ‌ర్స్‌కు బ‌లం చేకూరుస్తోంది. అయితే, తాజాగా వీరిద్ద‌రికి సంబంధించి షాకింగ్ వార్త వెలుగులోకి వ‌చ్చింది. విజ‌య్‌-త్రిష (Vijay-Trisha) బంధానికి బ్రేక‌ప్ ప‌డిన‌ట్లు సోష‌ల్ మీడియా మొత్తం కోడై కూస్తోంది.

నిన్న విజ‌య్ పుట్టిన‌రోజు. సినీ ప్ర‌ముఖులు, రాజ‌కీయ నాయ‌కులు విజ‌య్‌కి సోష‌ల్ మీడియా ద్వారా ప్ర‌త్యేకంగా శుభాకాంక్ష‌లు తెలిపారు. అయితే, త్రిష మాత్రం విష్ చెయ్య‌లేదు. ప్ర‌తి సంవ‌త్స‌రం విజ‌య్‌కి ప్ర‌త్యేకంగా బ‌ర్త్‌డే విషెస్ తెలిపే త్రిష ఈసారి మౌనంగా ఉన్నారు. ఎన్నిక‌ల్లో విజ‌య్ గెలిచిన అనంత‌రం ఇంటికెళ్లి మరీ శుభాకాంక్ష‌లు తెలిపిన త్రిష‌.. సీఎం పుట్టిన‌రోజునాడు విష్ చేయ‌క‌పోవ‌డం అభిమానుల దృష్టిని ఆకర్షించింది. దీంతో వీరిద్ద‌రి మ‌ధ్య బ్రేక‌ప్ అయిన‌ట్లుగా వార్త‌లు పుట్టుకొచ్చాయి. అదే స‌మ‌యంలో సోష‌ల్ మీడియాలో విజ‌య్‌ని త్రిష అన్‌ఫాలో చేశారంటూ కూడా ప్ర‌చారం జ‌రుగుతోంది. ప్ర‌స్తుతం వీరిద్ద‌రి వ్య‌వ‌హారం త‌మిళ‌నాడుతోపాటూ తెలుగు ఇండ‌స్ట్రీ, పొలిటిక‌ల్ స‌ర్కిల్‌లో హాట్‌టాపిక్ అవుతోంది.

భార్య‌తో విజ‌య్ రాజీ..?

ఇక సీఎం అయిన త‌ర్వాత విజ‌య్ త‌న వ్య‌క్తిగ‌త జీవితంపై కూడా దృష్టి పెట్టిన‌ట్లు త‌మిళ‌నాట టాక్ న‌డుస్తోంది. భార్య సంగీత‌తో మ‌ళ్లీ క‌లిసే అవ‌కావం ఉందంటూ జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. విడాకుల విష‌యంలో రాజీ ప‌డాల‌ని విజ‌య్‌, సంగీత నిర్ణ‌యించుకున్న‌ట్లు గ‌త కొద్ది రోజులుగా త‌మిళ‌నాట జోరుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. భ‌ర్త‌తో ఏర్ప‌డిన మ‌న‌స్ప‌ర్థ‌లు, గొడ‌వ‌ల విష‌యంలో వెన‌క్కి త‌గ్గాల‌ని, మ‌ళ్లీ విజ‌య్‌తో క‌లిసి ఉండాల‌ని సంగీత అనుకుంటున్న‌ట్లు స‌మాచారం. వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డిన అభిప్రాయ‌భేదాల‌ను ప‌రిష్క‌రించే దిశ‌గా సంగీత త‌ర‌ఫు కుటుంబ‌స‌భ్యుల‌తో పాటు అటు విజ‌య్ ఫ్యామిలీ మెంబ‌ర్స్ కూడా ప్ర‌య‌త్నిస్తున్నార‌ట‌.

ఇటీవ‌లే సంగీత‌ను విజ‌య్ త‌ల్లి శోభా క‌లిసిన‌ట్లు చెబుతున్నారు. పిల్ల‌ల భ‌విష్య‌త్తును దృష్టిలో పెట్టుకొని విడాకుల పిటిష‌న్‌ను వెన‌క్కి తీసుకోవాల‌ని సంగీతతో చెప్పిన‌ట్లు స‌మాచారం. ఆమె కూడా అందుకు సంసిద్ధ‌త వ్య‌క్తం చేసింద‌ట‌. అందుకే ఈ విడాకుల‌ కేసును ఆగ‌స్ట్ ఏడుకు వాయిదా వేయించిన‌ట్లు ప్ర‌చారం జ‌రుగుతోంది. త్వ‌ర‌లోనే సంగీత‌, విజ‌య్ మ‌ళ్లీ క‌లిసే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. భార్యతో రాజీ వేళ త్రిష‌కు విజ‌య్ బ్రేక‌ప్ చెప్పిన‌ట్లుగా టాక్ న‌డుస్తోంది.

Advertisement
Advertisement