Anil Ravipudi | కళ్యాణ్ రామ్ బర్త్‌డే.. ఫస్ట్‌లుక్‌తో అనిల్ రావిపూడి సర్‌ప్రైజ్
Anil Ravipudi | టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే( Kalyanram Birthday ) సందర్భంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఆదివారం సరికొత్త ఫస్ట్‌లుక్‌తో సినీ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు.
Entertainment | Published On Jul 5, 2026, 3.59 pm IST
Anil Ravipudi | త్రినేత్ర.న్యూస్ : టాలీవుడ్ హీరో నందమూరి కళ్యాణ్ రామ్ బర్త్ డే( Kalyanram Birthday ) సందర్భంగా ప్రముఖ దర్శకుడు అనిల్ రావిపూడి( Anil Ravipudi ) ఆదివారం సరికొత్త ఫస్ట్‌లుక్‌తో సినీ అభిమానులను సర్‌ప్రైజ్ చేశారు. అనిల్ దర్శకత్వంలో వెంకటేశ్, కళ్యాణ్ రామ్ హీరోలుగా ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని 2027 సంక్రాంతికి విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అయితే ఆదివారం కళ్యాణ్ రామ్ బర్త్ డే సందర్భంగా ఆయనకు పాత్రకు సంబంధించిన ఫస్ట్‌లుక్‌ను విడుదల చేసి.. అందర్నీ ఆశ్చర్యపరిచారు. తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు, మెడలో పూలహారంతో ఉన్న కళ్యాణ్‌రామ్ లుక్‌కు భారీ స్పందన వస్తోంది.
కళ్యాణ్‌రామ్ ఫస్ట్‌లుక్‌ను ఎక్స్‌లో పంచుకున్న అనిల్ రావిపూడి.. ఆయనకు బర్త్ డే విషేష్ తెలిపారు. నా తొలి హీరో, నా బెస్ట్ బడ్డీలలో ఒకరైన నందమూరి కళ్యాణ్‌రామ్ గారికి హ్యాపీ బర్త్‌డే. డెబ్యూ డైరెక్టర్‌గా నాపై మీరు ఉంచిన నమ్మకానికి నేను ఎప్పటికీ కృతజ్ఞుడిని. #VenkyAnil5 #NKRAR2 చిత్రంతో మిమ్మల్ని ఒక కొత్త లుక్‌లో చూపించడానికి చాలా ఆసక్తిగా ఉన్నాను సర్. సంక్రాంతి 2027ని మరింత గ్రాండ్‌గా సెలబ్రేట్ చేద్దాం అని అనిల్ రావిపూడి ఎక్స్‌లో పేర్కొన్నారు.
Wishing my first hero, and one of my best buddies @NANDAMURIKALYAN garu, a very Happy Birthday🤗
I will always be grateful for the confidence you placed in me as a debut director, and I'm truly excited to present you in a whole new avatar with #VenkyAnil5 #NKRAR2, Sir.😀
Let's… pic.twitter.com/ACOKAjASZE
— Anil Ravipudi (@AnilRavipudi) July 5, 2026
తాజావార్తలు
- ●New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం
- ●Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం
- ●KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం..
- ●Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!
- ●E20 Petrol India | ఇండియా E20 పెట్రోల్‌ను భూటాన్ నిజంగానే రిజెక్ట్ చేసిందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం
- ●Teejan Bai | తీజన్ బాయి ఇకలేరు.. మూగబోయిన జానపద లోకం

New Ration Cards | 48 గంటల్లోనే కొత్త రేషన్ కార్డులు జారీ : మంత్రి పొన్నం

Ponnam Prabhakar | ఉపాధి ఉన్న దగ్గరే ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తం

KTR | కేసీఆర్‌కు వారం రోజులు కాళేశ్వరంను అప్పజెప్పు.. రాష్ట్రమంతా నీళ్లు పారిస్తాం..

Instagram CSAM Ads | ఇన్‌స్టాగ్రామ్‌పై కేంద్రం కొరడా.. ఆ అసభ్యకరమైన యాడ్స్ ఏంటి? మెటాకు 7 రోజుల డెడ్‌లైన్!






