Ticket Price Hike | మన శంకరవరప్రసాద్ గారు టికెట్ ధరల పెంపు.. కోర్టు మొట్టికాయలు వేసినా పట్టించుకోని ప్రభుత్వం!
సినిమా టికెట్ ధరల పెంపుపై (Ticket Price Hike) హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ది రాజాసాబ్ టికెట్ ధరలు పెంచుతూ అర్ధరాత్రి మెమో జారీచేయడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. చిరంజీవి నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` సినిమా టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసకుంది.
Entertainment | Published On Jan 10, 2026, 12.29 pm IST
త్రినేత్ర.నెట్: సినిమా టికెట్ ధరల పెంపుపై (Ticket Price Hike) హైకోర్టు మొట్టికాయలు వేసినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ది రాజాసాబ్ టికెట్ ధరలు పెంచుతూ అర్ధరాత్రి మెమో జారీచేయడంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసినప్పటికీ.. చిరంజీవి నటించిన `మన శంకరవరప్రసాద్ గారు` సినిమా టికెట్ రేట్లు పెంచుతూ నిర్ణయం తీసకుంది.
అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో జనవరి 11న స్పెషల్ ప్రీమియర్ షో తో పాటు, టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతిచ్చింది. ప్రీమియర్ షో టికెట్ ధరను రూ.600గా నిర్ణయించింది. ఏడు రోజుల పాటు సింగిల్ స్క్రీన్‌లో రూ.50, మల్టీప్లెక్స్‌లలో రూ.100 టికెట్ ధర పెంచుకునే అవకాశం కల్పించింది.
కాగా, 'ది రాజాసాబ్' సినిమా టికెట్ ధరలు పెంచుకునేందుకు ప్రభుత్వం మెమోలు జారీ చేయడాన్ని కోర్టు తీవ్రంగా తప్పుబట్టిన విషయం తెలిసిందే. పదేపదే ఆదేశాలను ఉల్లంఘిస్తూ ప్రజలపై ఆర్థిక భారం మోపేలా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్నిసార్లు చెప్పినా ఎందుకు వినడం లేదని, ప్రజలపై ఆర్థిక భారం పడేలా నిర్ణయాలు తీసుకోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించింది. సినిమా టికెట్ల రేట్లు పెంచబోమని స్వయంగా సంబంధిత మంత్రి ప్రకటించినప్పటికీ, మళ్లీ ధరల పెంపునకు అనుమతిస్తూ మెమోలు ఎలా జారీ చేస్తున్నారని నిలదీసింది. ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోరా? తెలివిగా మెమోలు ఎందుకు జారీ చేస్తున్నారు? మెమో ఇచ్చే అధికారికి రూల్స్ తెలియవా? అంటూ హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.
ట్యాగ్స్:
సంబంధిత వార్తలు

Chiranjeevi | 30 ఏళ్ల తర్వాత సీన్ రివర్స్ – పవన్ కళ్యాణ్‌కు థాంక్స్ చెప్పిన మెగాస్టార్
మే 21, 2026

Chiranjeevi | మెగా 158లో మోహన్‌లాల్.. కుమార్తెగా మలయాళ బ్యూటీ!
మే 21, 2026

Mega 158 | పవన్ కళ్యాణ్ క్లాప్‌తో మొదలైన చిరంజీవి మెగా 158 మూవీ – స్పెషల్ అట్రాక్షన్‌గా మలయాళ బ్యూటీ
మే 21, 2026
తాజావార్తలు
- ●Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?
- ●Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు
- ●Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్
- ●Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్
- ●Bonthu Rammohan Case | బొంతు రామ్మోహన్ దంపతులపై కేసు.. దాడి ఆరోపణలపై పోలీసుల యాక్షన్
- ●Harish Rao New Jersey | 'ప్లాట్ కొనాలంటే ఎన్నారైలు భయపడుతున్నారు' : న్యూజెర్సీలో హరీశ్ రావు వ్యాఖ్యలు

Cockroach Janta Party | కాక్రోచ్ జనతా పార్టీ సెన్సేషన్: వారం రోజుల్లో కోటి ఫాలోవర్స్.. అసలీ ట్రెండ్ వెనుక ఉన్నదెవరు?

Ponnam Prabhakar MJP Gurukulam | 8వ తరగతి నుంచే నీట్, ఎంసెట్ కోచింగ్: ఎంజేపీ గురుకులాలపై మంత్రి పొన్నం కీలక ఆదేశాలు

Jupally Krishna Rao | తెలంగాణ టూరిజం బ్రాండ్ అంబాసిడర్లు మీరే: సోషల్ మీడియా క్రియేటర్లకు మంత్రి జూపల్లి బంపర్ ఆఫర్

Telangana UCF funds | తెలంగాణకు కేంద్రం భారీ ప్యాకేజీ: వరంగల్, కరీంనగర్‌లకు రూ.5,681 కోట్లు.. బండి సంజయ్ స్పెషల్ ఫోకస్



