Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కన్నుమూత
Singeetham Srinivasa Rao | ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని (chennai) కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు.
Entertainment | Published On Oct 4, 2026, 6.01 am IST
Singeetham Srinivasa Rao | త్రినేత్ర న్యూస్: ప్రముఖ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు (Singeetham Srinivasa Rao) కన్నుమూశారు. వయోభారంతో బాధపడుతున్న ఆయన చెన్నైలోని (chennai) కావేరి హాస్పిటల్‌లో చికిత్స పొందుతూ శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. దీంతో వెండితెరపై సరికొత్త ప్రయోగాలు అద్భుతాలు సృష్టించిన మహాదర్శకుడి నిష్క్రమణతో ఒక శకం ముగిసింది మునిగిపోయింది. వయసు అనేది కేవలం అంకె మాత్రమే అని నిరూపిస్తూ 94 ఏండ్ల వయసులో నాగ్అశ్విన్ నిర్మాణంలో `సింగ్ గీతం` (Sing Geetham) పేరుతో ఒక వినూత్న మ్యూజికల్ చిత్రాన్ని రూపొందించారు. తెలుగుతోపాటు తమిళం, కన్నడ, హిందీ, ఇంగ్లిష్ భాషల్లో 60కిపైగా చిత్రాలకు దర్శకత్వం వహించారు. ప్రయోగాత్మక చిత్రాలతో దక్షిణ భారత సినిమాను విస్లవాత్మకంగా మార్చిన ఘనత ఆయనకు దక్కింది. సింగీతం మృతిపై పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సామాజిక మాధ్యమాల ద్వారా సంతాపం తెలిపారు. చెన్నైలోనే అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
1931 సెప్టెంబర్ 21న ఆంధ్రప్రదేశ్‌లోని నెల్లూరు జిల్లా ఉదయగిరిలో సింగీతం శ్రీనివాసరావు జన్మించారు. తండ్రి రామచంద్రరావు హెడ్‌మాస్టర్ కాగా తల్లి శకుంతలాబాయి వాయులీన విద్వాంసురాలు. ఉదయగిరిలో పదోతరగతి, గూడూరులో ఇంటర్ పూర్తి చేసిన సింగీతం.. ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్‌లో బీఎస్సీ ఫిజిక్స్ చేశారు. ఆ సమయంలో హరీంద్రనాథ్ ఛటోపాధ్యాయ ఆధ్వర్యంలో నాటకరంగ ప్రవేశం చేశారు. డిగ్రీకి వచ్చిన తర్వాత సూళ్లూరుపేటలో ఉపాధ్యాయుడిగా పనిచేశారు. స్వయంగా రచించిన నాటకాలను తన విద్యార్థులతో ప్రదర్శింపచేశారు. దిగ్గజ దర్శకుడు కేవీ రెడ్డి (KV. Reddy) వద్ద ‘మాయాబజార్’ (1957) చిత్రానికి సహాయ దర్శకుడిగా తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించారు. ప్రముఖ సంగీత దర్శకుడు సాలూరి రాజేశ్వరరావు వద్ద శిష్యరికం చేశారు. 1972లో నీతి నిజాయితీ (Neeti Nijayiti) సినిమా ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యారు. 1960లో లక్ష్మీ కల్యాణిని వివాహమాడారు. ఆమెతో కలిసి `శ్రీకల్యాణీయం` ఆత్మకథను రాశారు. 2022 మే 28న అనారోగ్యంతో లక్ష్మీ కల్యాణి అనారోగ్యంతో చెన్నైలో కన్నుమూశారు. అప్పటి నుంచి చెన్నై సాలిగ్రామంలో కుమార్తెలు, మనవళ్లతో కలిసి ఉంటున్నారు.

బహుముఖ ప్రజ్ఞాశాలి..
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన సిగీతం శ్రీనివాసరావు.. దర్శకత్వంతోపాటు స్క్రీన్‌ప్లే, నిర్మాణం, సంగీతం, నటించేవారు కూడా. అందరిలా సాధారణమైన కథలతో కాకుండా ట్రెండ్‌కు భిన్నమైన పాయింట్లతో సినిమాలు తెరకెక్కించేవారు. మాటలు లేకుండా కమల్‌హాసన్ ప్రధాన పాత్రలో ఆయన తీసిన ‘పుష్పక విమానం’ (1987) భారతీయ చలనచిత్ర చరిత్రలో టెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇక తెలుగులో తొలి టైమ్ ట్రావెల్ మూవీగా వచ్చిన 'ఆదిత్య 369' నేటికీ ఒక సంచలనమే. జానపద చిత్రాల శైలిని తిరగరాస్తూ రూపుదిద్దుకున్న 'భైరవ ద్వీపం', వైకల్యాన్ని జయించిన నాట్యమయూరి సుధాచంద్రన్ నిజ జీవిత కథతో తెరకెక్కించిన 'మయూరిస, `మైఖేల్ మదన కామరాజు` వంటి విభిన్న ప్రయోగాత్మక సినిమాలతో ప్రత్యేక గుర్తింపు పొందారు.

తన ఆలోచనలకు సాంకేతికతను జోడిస్తూ విభిన్నమైన సినిమాలు రూపొందించిన సిగీతం శ్రీనివాసరావు.. తన కెరీర్‌లో రెండు జాతీయ పురస్కారాలతో పాటు ఐదు నంది అవార్డులు, మూడు కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర అవార్డులు, మూడు ఫిల్మ్‌ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. 2011లో ఫిల్మ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆయనను జీవిత సాఫల్య పురస్కారంతో సత్కరించింది.
సంబంధిత వార్తలు

Telugu OTT | ఓటీటీలోకి నివేదా పేతురాజ్ రీఎంట్రీ తెలుగు మూవీ – నో డైలాగ్స్ – సినిమా మొత్తం పాటలే!
జులై 6, 2026

Nivetha Pethuraj | డీ గ్లామర్ పాత్రలో నివేదా – టాలీవుడ్ హీరోతో రెండోసారి రొమాన్స్
జూన్ 23, 2026

Nivetha Pethuraj | సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోవాలనుకున్నా – అల్లు అర్జున్ హీరోయిన్ కామెంట్స్
జూన్ 15, 2026
తాజావార్తలు
- ●Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్
- ●Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు
- ●తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’
- ●Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?
- ●Faruk G Patel Success Story | ఆటో నడిపాడు, పిజ్జాహట్‌లో పని చేశాడు.. నేడు రూ.10,964 కోట్ల సామ్రాజ్యం
- ●Telangana Auto Drivers Welfare Board | ఆటో డ్రైవర్లకు తెలంగాణ సర్కార్ శుభవార్త: త్వరలో వెల్ఫేర్ బోర్డు.. ఒక్కో ఆటోకు రూ.1.5 లక్షల సబ్సిడీ

Supreme Court | సుప్రీంకోర్టులో జూనియర్ కోర్ట్ అసిస్టెంట్ ఉద్యోగాలు.. 250 పోస్టులతో నోటిఫికేషన్

Weekly Horoscope | అక్టోబర్ 5 నుంచి 11 వరకు.. ఈ రాశుల వారికి శుభ ఫలితాలు

తిరిగేది తక్కువ… రిలాక్స్ అయ్యేది ఎక్కువ! యువత ‘రూమ్ రాటింగ్’

Horoscope | అక్టోబర్ 4 ఆదివారం.. నేటి రాశిఫలాలు ఎలా ఉన్నాయంటే?



