Navratri Brahmotsavam | హనుమంత వాహనంపై కోదండ రాముడు.. పుష్పక విమానంపై గోవర్ధనగిరిధారి
Navratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం హనుమంత వాహనంపై కోదండ రాముడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.
Pradeep Manthri
Photo gallery | Published On Oct 17, 2026, 8.01 pm IST

Navratri Brahmotsavam | తిరుమల శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాలు నేత్రపర్వంగా సాగుతున్నాయి. ఉత్సవాల్లో ఆరో రోజైన శనివారం ఉదయం హనుమంత వాహనంపై కోదండ రాముడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిచ్చారు.

ధనుస్సు, బాణం ధరించి హనుమంతుడిపై ఊరేగుతూ స్వామివారు భక్తులను అనుగ్రహించారు. వాహనం ముందు భక్తులు చెక్కభజనలు, కోలాటాలతో సందడి చేయగా.. మంగళవాయిద్యాల నడుమ సేవ వైభవంగా సాగింది.

అడుగడుగునా భక్తులు కర్పూర హారతులు సమర్పించి శ్రీరాముడిలా దర్శనమిచ్చిన మలయప్పస్వామిని దర్శించుకున్నారు.

సాయంత్రం పుష్పక విమానంపై రుక్మిణి, సత్యభామ సమేతంగా గోవర్ధనగిరిధారి శ్రీకృష్ణుడి అలంకారంలో మలయప్పస్వామివారు అభయమిచ్చారు.


అత్యంత సుందరంగా అలంకరించిన పుష్పక విమానంపై స్వామివారి దివ్యమంగళ రూపం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది.

కొబ్బరి ఆకులతో రూపొందించిన ఈ విమానం 24 అడుగుల ఎత్తు, 15 అడుగుల పొడవు, 15 అడుగుల వెడల్పుతో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది.

వివిధ రకాల సంప్రదాయ పుష్పాలతో అలంకరించిన విమానంపై ఇరువైపులా ఆంజనేయస్వామి, గరుత్మంతుడు, నాలుగు యుగాలకు చెందిన దేవతామూర్తుల రూపాలను తీర్చిదిద్దారు.

అధిక మాసం సందర్భంగా మూడేళ్లకోసారి నిర్వహించే నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో పుష్పక విమానసేవకు ప్రత్యేక ప్రాధాన్యం ఉన్నది.

ఉదయం కోదండ రాముడిగా.. సాయంత్రం గోవర్ధనగిరిధారిగా స్వామివారు దర్శనమివ్వడంతో తిరుమల భక్తిభావంతో పరవశించింది.




























































తాజావార్తలు
- ●Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు
- ●Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి
- ●KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు
- ●MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి
- ●Hyderabad Police | పెప్పర్ స్ప్రే కొట్టి.. రూ. 25 లక్షలు దోపిడీ
- ●Vijay Sethupathi | స్లమ్డాగ్కు గుమ్మడికాయ కొట్టిన పూరి జగన్నాథ్ - విజయ్ సేతుపతి లేకుండానే క్లైమాక్స్ షూట్

Tummala Nageshwar Rao | తెలంగాణలో 315 మండలాల్లో కరువు

Telangana Journalists | జర్నలిస్టుల సమస్యలను పరిష్కరించండి.. డిప్యూటీ సీఎం భట్టికి విజ్ఞప్తి

KCR | తెలంగాణ ఆడబిడ్డలకు కేసీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు

MLC Balmoor Venkat | నీళ్లు, నిధులు, నియామకాలు కల్వకుంట్ల కుటుంబానికే దక్కాయి


