SIIMA Awards | ఉత్తమ నటుడిగా తేజ సజ్జా.. బెస్ట్ కమెడియన్‌గా బుల్లిరాజు
SIIMA Awards | హనుమాన్ మూవీలో నటనతో ప్రత్యేకతను చాటుకున్న యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డు (SIIMA Awards) దక్కింది. గతేడాది విడుదలైన మిరాయ్ (Mirai)సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని నటనకుగానూ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. ఇక బెస్ట్ కమెడియన్‌గా సంక్రాతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam
Entertainment | Published On Sep 13, 2026, 9.27 am IST
SIIMA Awards | త్రినేత్ర.న్యూస్: హనుమాన్ మూవీలో నటనతో ప్రత్యేకతను చాటుకున్న యువ హీరో తేజ సజ్జా (Teja Sajja) దక్షిణ భారతదేశ చలనచిత్ర పరిశ్రమలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావించే సైమా అవార్డు (SIIMA Awards) దక్కింది. గతేడాది విడుదలైన మిరాయ్ (Mirai)సినిమాకు గాను ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నాడు. సంక్రాంతికి వస్తున్నాం మూవీలోని నటనకుగానూ ఐశ్వర్య రాజేశ్ (Aishwarya Rajesh) ఉత్తమ నటి (క్రిటిక్స్) అవార్డును గెలుచుకుంది. ఇక బెస్ట్ కమెడియన్‌గా సంక్రాతికి వస్తున్నాం (Sankranthiki Vasthunam) సినిమాలో తన నటనతో హాస్యం పండించిన బుల్లిరాజు అలియాస్ భీమల రేవంత్ నిలిచాడు. కాగా, గతేడాది కూడా తేజ సజ్జాకు సైమా అవార్డు దక్కింది. 2024లో ఆయన హీరోగా వచ్చిన హనుమాన్కుగానూ తేజ సజ్జా ఉత్తమ నటుడు క్రిటిక్స్ విజేతగా నిలిచాడు.
Laughter, conversations and a whole lot of fun on stage! #TejaSajja, #AkulBalaji and #AnilRavipudi share a lively moment at SIIMA 2026.
Book your tickets now: https://t.co/hR282W575O
13 September | Koramangala Indoor Stadium, Bengaluru@nexaexperience @airtelindia #swastiks… pic.twitter.com/ljVKpUJNE8
— SIIMA (@siima) September 12, 2026
బెంగళూరులోని కోరమంగళ ఇండోర్ స్టేడియంలో సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్ (SIIMA) వేడుక ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా దక్షిణాది సినీ తారలు సందడి చేశారు. తెలుగు, కన్నడ, మూవీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన నటీనటులు, సాంకేతిక నిపుణులు అవార్డులను అందుకున్నారు. `కాంతార: చాప్టర్ 1` చిత్రంలో అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న కన్నడ హీరో రిషబ్‌శెట్టి (Rishab Shetty) ఉత్తమ నటుడి అవార్డును సొంతం చేసుకున్నాడు. మొత్తంగా మిరాయ్ సినిమాకు రెండు అవార్డులు రాగా, సంక్రాంతికి వస్తున్నాం, కోర్ట్ సినిమాలకు మూవీకి నాలుగు చొప్పున అవార్డులు దక్కాయి.
Some performances stay with you because they feel beautifully real.#AshikaRanganath brings emotional nuance and authenticity to the world of Gatha Vaibhava.
For a portrayal that resonated through its honesty and depth, she wins Best Actress in a Leading Role – Critics.
Book… pic.twitter.com/JjaZmCMJUS
— SIIMA (@siima) September 12, 2026
అవార్డులు వీరికే..
- ఉత్తమ నటుడు - తేజ సజ్జా (మిరాయ్)
- ఉత్తమ నటి - ఐశ్వర్య రాజేశ్ (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ సహాయనటుడు- సత్యదేవ్ (కింగ్డమ్)
- ఉత్తమ సహాయ నటి- శ్రద్ధా శ్రీనాథ్ (డాకు మహరాజ్)
- ఉత్తమ హాస్య నటుడు - బుల్లిరాజు (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ సినిమాటోగ్రఫీ- కార్తిక్ ఘట్టమనేని (మిరాయ్)
- ఉత్తమ నేపథ్య గాయకుడు - రమణ గోగుల (సంక్రాంతికి వస్తున్నాం)
- ఉత్తమ నేపథ్య గాయని - సమీరా భరద్వాజ్ (కోర్టు)
- ఉత్తమ నటుడు (పరిచయ)- హర్ష్ రోషన్ (కోర్ట్)
- ఉత్తమ నటి (పరిచయ)- శ్రీదేవి (కోర్ట్)
- ఉత్తమ నటి (పరిచయ)- సాక్షి మడోల్కర్ (మోగ్లీ)
- ఉత్తమ గేయ రచయిత- పూర్ణా చారి (కోర్ట్)
సంబంధిత వార్తలు

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు – స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
సెప్టెంబర్ 13, 2026

Aishwarya Rajesh | హిట్ తర్వాత మరో బంపరాఫర్.. రవితేజకు జోడీగా ఐశ్వర్య రాజేశ్
ఆగస్టు 28, 2026

Zombie Reddy 2 | అఫీషియల్ – తేజా సజ్జా జాంబీరెడ్డి సీక్వెల్ కన్ఫామ్ – హీరోయిన్గా జాన్వీ కపూర్ చెల్లెలు!
ఆగస్టు 23, 2026
తాజావార్తలు
- ●Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్
- ●Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు
- ●Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్
- ●Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..
- ●Brahmotsavalu 2026 | తిరుమల వెంకన్న తొమ్మిది రోజుల ఉత్సవం వెనుక వెయ్యేళ్ల చరిత్ర..!
- ●Heavy Rain | ఈ జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు.. ఆరెంజ్ అలర్ట్ జారీ

Siima Awards 2026 | సైమా అవార్డ్స్ వేడుకలో సందడి చేసిన హీరోయిన్లు - స్పెషల్ అట్రాక్షన్‌గా రుక్మిణి వసంత్

Passenger Ship | 240 మంది ప్రయాణికులతో వెళ్తున్న నౌక.. జావా సముద్రంలో గల్లంతు

Irumudi OTT | అఫీషియల్ - థియేటర్లలో ఆడుతోండగానే ఓటీటీలోకి రవితేజ ఇరుముడి - నిర్మాతలపై ఫ్యాన్స్ ఫైర్

Vinayaka Chavithi | గణపతి.. విఘ్నహర్తే కాదు.. జ్ఞానదాత కూడా..



