GV Narayana Rao | టాలీవుడ్లో విషాదం.. సీనియర్ నటుడు నారాయణ రావు కన్నుమూత
GV Narayana Rao | త్రినేత్ర.న్యూస్: టఆల టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు (GV Narayana Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.
Entertainment | Published On Aug 27, 2026, 7.52 am IST
GV Narayana Rao | త్రినేత్ర.న్యూస్: టఆల టాలీవుడ్లో విషాదం చోటుచేసుకుంది. సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు (GV Narayana Rao) కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు. నటుడిగా, నిర్మాతగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నారాయణ రావు మృతిపట్ల సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన 100కుపైగా చిత్రాల్లో నటించారు.
రంగస్థలం నుంచి వెండితెరపైకి..
ఆంధ్రప్రదేశ్‌లోని కృష్ణా జిల్లా కురుమద్దాలి గ్రామంలో జన్మించిన నారాయణరావు.. గిడుగు విశాలాక్షి వద్ద భరతనాట్యం, నటరాజ రామకృష్ణ వద్ద కూచిపూడి నృత్యం, ఏఆర్ కృష్ణ వద్ద నటన నేర్చుకున్నారు. చదువుకునే రోజులలో మహమ్మద్ బీన్ తుగ్లక్, ప్రతాపరుద్రీయం, మంచుతెర తదితర నాటకాలలో నటించారు. దివంగత సినిమా నటులు కోట శ్రీనివాసరావు, నూతన ప్రసాద్, దేవదాస్ కనకాల తదితరులు ఆయనకు రంగస్థల మిత్రులు. ఆయన మద్రాస్ ఫిలిం ఇన్స్టిట్యూట్లో శిక్షణ తీసుకున్నారు. అక్కడే సినీ ప్రయాణం ప్రారంభించిన సూపర్‌స్టార్ రజనీకాంత్, మెగాస్టార్ చిరంజీవికి నారాయణరావు మంచి మిత్రుడు.
బాలచందర్ సినిమాతో..
1976లో కే.బాలచందర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘అంతులేని కథ’ చిత్రంతో వెండితెరకు పరిచయమయ్యారు. తొలి సినిమాకే ఉత్తమ సహాయ నటుడిగా నంది అవార్డు అందుకున్నారు. అంతులేని కథ, ముత్యాల పల్లకి, అంగడి బొమ్మ, చిలకమ్మ చెప్పింది, గ్యాంగ్ లీడర్, హిట్లర్ వంటి పలు హిట్ సినిమాల్లో నటించారు. దేవాంతకుడు, ఇంటికో రుద్రమ్మ, యముడికి మొగుడు, పెళ్ళినీకు శుభం నాకు సినిమాలను నిర్మించారు. సినిమాలతోపాటు ఆయన అనేక టీవీ సీరియళ్లలోనూ నటించారు. నారాయణరావు మృతిపై సంతాపం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (MAA) సంతాపం తెలిపింది. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపింది.
తాజావార్తలు
- ●Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!
- ●Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు
- ●సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?
- ●Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!
- ●Nepal Floods | నేపాల్‌లో వరదలు.. తెలంగాణ వాసులకు హెల్ప్ లైన్ ఏర్పాటు
- ●Khelo India Youth Games | డిసెంబర్లో తెలంగాణలో.. ‘ఖేలో ఇండియా యూత్ గేమ్స్’ 8 వ ఎడిషన్!

Kailash Mansarovar Yatra | ఆకస్మిక వరదలు.. తాత్కాలికంగా నిలిచిన కైలాస మానస సరోవర్ యాత్ర!

Travels Bus | ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఏడుగురి మృతి, మరో 8 మందికి గాయాలు

సుస్మిత పొలిటికల్ ఎంట్రీ: కొండా మురళి 'ప్లాన్-బి' వెనుక ఉన్న అసలు వ్యూహం ఏంటి?

Horoscope | ఆగస్టు 27 రాశిఫలాలు.. ఈ రాశి వారు సవాళ్లను సులభంగా అధిగమిస్తారు!






